విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాందా రిపేట గ్రామంలో ఇటీవల ప్ర మాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్‌కు గురై ఆసు పత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటు న్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు స్వయంగా బాధి తుడి ఇంటికి వెళ్లి పరామ ర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసు కున్నారు. బాధిత కుటుం బానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై సంబం ధిత అధికారులు సమగ్ర విచా రణ చేపట్టి తగిన చర్యలు తీ సుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిం చారు. ఇళ్లపై నుండి ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ను చూశా రు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులకు ఫోన్ చేసి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగింది.
