గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
గణపురం నేటి ధాత్రి
గణపురంమండలం గాంధీనగర్ గ్రామం లో పట్టుకున్న గంజాయి కేసు గురించి చిట్యాల సిఐ డి. మల్లేష్ పట్టుకున్న వ్యక్తులు వివరాలను గణపురంపోలీస్ స్టేషన్ లోవిలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది.11.07.2025 వ రోజున ఉదయం 7 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు గణపురం ఎస్సై తమ సిబ్బందితో గాంధీనగర్ గ్రామం శివారులో ఒక వేపచెట్టు కింద అనుమానంగా ఉన్న వ్యక్తిని పట్టుకొనుటకు అతని వద్దకు వెళ్లగా అతడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని పంచుల సమక్ష్యం లో విచారించగా అతడు తన పేరు బెడ్డల శ్రీనివాస్ S/o రాజయ్య, వయసు 19 సంవత్సరాలు వెంకటేశ్వర్లపల్లి అని చెప్పి తను గతకొంతకాలంగాహైదరాబాద్‌లోని ఒక పబ్‌లో వర్కర్‌గా పని చేస్తూ,అదే క్రమంలో మహారాష్ట్ర రాష్ట్రం లోని బల్లర్శ ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి సల్మాన్ మాజీత్ ఖాన్ తో పరిచయం ఏర్పడి, ఆ తరువాత అతడు మహారాష్ట్ర లో గంజాయి తక్కువ ధరకు దొరుకుతుంది అని చెప్పగా, అట్టి వ్యక్తి తన పబ్ లో పని చేయడం కంటే ఆ ప్రాంతం లో తక్కువ ధరకు గంజాయి కొనుకొన్ని వచ్చి ఇక్కడ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది అని నిశ్చయించుకొని అట్టి విషయంను శ్రీనివాస్ తన గ్రామం లోని తన బాల్య మిత్రుడు అయిన జనగం ప్రేమ్ తేజ్ తో చెప్పగా అతడు నువ్వు తీసుకరా నేనుఇక్కడ భూపాలపల్లి ,రామప్ప కాలనీ , గణపురం లో అమ్మి పెడుతా వచ్చిన లాభం నీ చేరి సగం తీసుకుందాం అని అన్నాడు, శ్రీనివాస్ దీనికి అంగీకరించి మహారాష్ట్ర రాష్ట్రం లోని బల్లర్శ ప్రాంతం నుండి సల్మాన్ మాజీత్ ఖాన్ ద్వారా,గంజాయి ని గతం లో పలుమార్లు తీసుకొని వచ్చి భూపాలపల్లి,గణపురం పరిసర ప్రాంతం లో అమ్ముతున్నారు. అదే క్రమంలో తేదీ 09.07.2025 రోజున గంజాయి తేవడం కోసం రైలు ద్వారా మహారాష్ట్ర లోని బల్లర్శ కి వెళ్ళి సల్మాన్ మాజీత్ ఖాన్ దగ్గర ఒక కేజి గంజాయి కొని తిరిగి వస్తు గాంధీనగర్ క్రాస్ రోడ్డు వద్ద దిగి ఆ గ్రామ శివారులోని ఒక వేప చెట్టు కింద కూర్చోని ప్రేమ్ తేజ్ కోసం చూసే క్రమం లో గణపురం ఎస్సై తన సిబ్బంది తో వెళ్ళి పట్టుకున్నాడు.
పట్టుకున్న ఒకరిలోబెడ్డల శ్రీనివాస్ వెంకటేశ్వర్లపల్లి అదుపులోకి తీసుకోగా మిగతా ఇద్దరుజనగాం ప్రేమ్ తేజ్ వెంకటేశ్వర్లపల్లి,సల్మాన్ మజిత్ ఖాన్,బల్లర్శ ,మహారాష్ట్ర పరారీలో ఉన్నట్టు సమాచారం.