గ్రామాలలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి…

గ్రామాలలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి.

వార్షిక తనిఖీల్లో భాగంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల/తంగళ్ళపల్లి (నేటి ధాత్రి):

 

శుక్రవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీకిలో భాగంగా స్టేషన్ పరిసరాలను , వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు,స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి,స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం హాట్స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పెండింగ్ కేసులు,కోర్టు కేసులు,ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు,నేరాల స్థితిగతులపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని,ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది,అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే తగిన కార్యాచరణ ప్రారంభించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు.స్టేషన్ పరిధిలో క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పకడ్బందీగా అమలు చేస్తూ శాంతి భద్రతల అంశాలను ముందస్తు సంచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తునే వాటి వలన కలుగు అనర్ధాలపై, సైబర్ నెరల నియంత్రణ పై చైతన్య పరచాలని,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ప్రతి రోజు విస్తృతంగా వాహన తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు.

ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ఎస్.ఐ ఉపేందర్, సిబ్బంది ఉన్నారు.

సైబర్ నేరాల గురించి అవగాహన…

సైబర్ నేరాల గురించి అవగాహన
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగులపల్లి మండలంలోని వేములపల్లి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి మండల రైతులకు మొగుళ్ళపల్లి ఎస్ ఐ బి అశోక్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ గురించి మరియు ఏ విధంగా సైబర్ నేరస్తులు ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకొని అమాయకులకు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా ఇలా సైబర్ నేరస్తులు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అంటే నమ్మకండి వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి మరియు ముఖ్యంగా మీ యొక్క బ్యాంకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వివరాలు మరియు బ్యాంకు సంబంధించిన ఓటీపీలు ముఖ్యంగా రైతుబంధు రైతు బీమా రైతు భరోసా వంటి పథకాలకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటూ వచ్చే అపరిచిత కాల్స్ ను నమ్మి మోసపోవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచన ఇచ్చారు

శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన

శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండల కేంద్రంలో గల శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో మాదక ద్రవ్యాలపై ఎస్సై రావుల రణధీర్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దుగ్గొండి బ్రాంచ్ శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్ లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం సమాజంలో ఆన్ లైన్ మోసాలు, డేటా హాకింగ్, ఫేక్ అకౌంట్ వంటి సైబర్ నేరాల గురించి వివరించామన్నారు.రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రతినెల ఒక క్లాస్ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.మొబైల్ ఫోన్లో వస్తున్న ఫేక్ మెసేజ్లను ఇతరులకు షేర్ చేయకూడదుని తెలిపారు.అకౌంట్లో డబ్బులు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ జరిగినట్లయితే వెంటనే 1930 నెంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ మారక ద్రవ్యాలు, పాను,గుట్కా గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో అనుమానాస్పదంగా అనవసరమైన లింకులు,పాస్ వర్డ్ మొబైల్ ఫోన్ లో వస్తున్నాయని అటువంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కవిత బిక్షపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version