రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-7.wav?_=2

చిన్న మీడిసిలేరు గ్రామంలో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల హోమియోపతి వైద్యరాలు డాక్టర్ పూజ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య కేంద్రంలో 67 మంది ప్రజలను చూసి హోమియోపతి మందులను అందించారు
డాక్టర్ పూజ మాట్లాడుతూ హోమియో మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా పనిచేసే మందులు ఈ మందులు అందరూ ఉపయోగించుకోవాలి
దీర్ఘకాలిక రోగాలకు చర్మ రోగాలకు పిడ్స్ కిడ్నీలో రాళ్ళు స్త్రీల సమస్యలు ఫైల్స్ మొదలగు అన్ని వ్యాధులకు ఈ మందులు చక్కగా పనిచేస్తాయి
అందరు హోమియోపతి మందులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరులో ఈ మందులు ఉచితంగా లభిస్తాయి కనుక చర్ల మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలియజేశారు

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం .

https://youtu.be/EC5Z8gibvKc?si=55Iebk-pbIpN8u87
లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం 
52మందికి రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ 
పరకాల నేటిధాత్రి 
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల నియోజకవర్గ పరిధి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బిపి.ల్,షుగర్,రక్త  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్బంగా చైర్మన్,పాలకవర్గం మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి 52 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్.కిషన్ రావు,డాక్టర్.మొహమ్మద్ తయార్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,సతీష్, శ్రీకాంత్,నర్సింహ చారి,కిట్స్, జి.వర్షిత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలోని వెంకట చెరువు గ్రామంలో డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో 34 మంది రోగులను పరీక్షించారు
అనంతరం గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను బాలింతలను సందర్శించి తగు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గల గ్రామాలలో మరి ముఖ్యంగా మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశం అధికంగా ఉన్నది కనుక ఆశకార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది గ్రామాన్ని తరచూ సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలి అని అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ హెల్త్ అసిస్టెంట్ కొండ్రు నరసింహ మొబైల్ స్టాప్ నర్స్ దీక్షిత పాల్గొన్నారు

కాట్రపల్లి గ్రామానికి క్వారీ గడ్డం…

కాట్రపల్లి గ్రామానికి క్వారీ గడ్డం…

వారిని మూసేయాలని కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన యువకుడు

కేసముద్రం/ నేటి ధాత్రి

మహబూబాబాద్. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి.. సోమవారం ప్రజావాణిలో డిస్టిక్ కలెక్టరేట్ జిల్లా అధికారులతో సహా స్థానిక స్థానిక ఎమ్మార్వో ఆర్డీవో జిల్లా పంచాయతీ శాఖ అధికారుల అందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందని కాట్రపల్లి గ్రామానికి చెందిన నల్లగొప్పుల హరీష్ తెలిపారు..ఫిర్యాదు గల కారణాలు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సాయి బాలాజీ గ్రానైట్ వారు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ రాత్రి సమయంలో సైతం బాంబుల మూతతో గ్రామాన్ని దద్దరిల్లేలా చేస్తున్నారు తెలిపారు.దీనివల్ల గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ ఈ క్వారీ నుండి భారీ శబ్దాలు మరియు భూమి కంపించడం వల్ల అనేక ఇండ్లకు గోడలు బీటలు వారాయి గుండె సంబంధిత రోగులు చిన్న పిల్లల వృద్ధులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.ఇంకా రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా మారాయని క్వారీ నుండి పెద్ద పెద్ద పండరాళ్లతో అధిక లోడుతో వెళ్తున్న ఈ లారీల వల్ల అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిన సంఘటనలు ఉన్నాయని, రోడ్లు గుంతల మయమై వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి నెలకొంటున్నాయని, ఈ క్వారీ నుంచి వచ్చే కలుషిత నీరు బాంబుల రసాయనాల వల్ల వచ్చే కలుషిత విషపూరితమైన నీరు పక్కనే ఉన్న ప్రవహించే ఏరు వాగు నీటిని పంట పొలాలకు నిరంతంచే నీరు కలుషితమై చేపలు మరియు ఇతర మూగజీవాలు ప్రాణాలు వదులుతున్నాయి అని దయచేసి సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రానైట్ క్వారీని వెంటనే మూసివేయాలని సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు.!

మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు గ్రామ పెద్దలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆదివారము సాయంత్రం పగటి సవార్లు మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు.పీర్లకు చక్కెర,గంధం, కొబ్బరిగిన్నెలు, దట్టీలు, పూల దండలు సమర్పించి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. ధూపంతో ప్రత్యేక మొక్కులు చేశారు. పెద్ద సవారి కార్యక్రమంలో భాగంగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి.11-00ల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో పీర్లను ఊరేగించి, మసీదుకు దర్గాలకు.తీసుకెళ్లి మగ్గబెట్టి పూర్తి చేస్తారు

జహీరాబాద్ : పీర్ల పండుగ (మొహర్రం)ను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని నాగుల కట్ట దగ్గర ఏర్పాటు చేసే పీర్లను ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగించారు. అహ్మద్ సాహెబ్ సాయంత్రం పట్టణంలోని పీర్లు వెళ్లి కలవడంతో అక్కడ జాతరను తలపించింది.

 

ఝరాసంగం: మండల కేంద్రంతో పాటు చిలేపల్లి మేడపల్లి కంబాలపల్లి బొప్పనపల్లి కుడు సంఘం తుమ్మనపల్లి తదితర గ్రామాల్లో ప్రతిష్ఠించిన పీర్లకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆదివారం పీర్ల ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో పీర్ల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలకు షర్బత్‌ను పంపిణీ చేశారు.

మొగుడంపల్లి : మండల ధన సిరి జాడి మల్కాపూర్ ఇప్పేపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్‌ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్‌ తదితరులు ఉత్సవాల్లో పాల్గొని పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కోహీర్: మండల పరిగిలో పీర్లతో నిర్వహించిన ఊరేగింపు వైస్ చైర్మన్ షాకేర్ పాల్గొని మాట్లాడారు. మొహర్రం మత సామరస్యానికి పత్రీకగా నిలుస్తుందన్నారు. ఈ ఉత్సవాల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.

న్యాల్కల్ : మండల డప్పూర్ మల్గి మెటల్ కుంట హద్నూర్ తదితర గ్రామాల్లో ఆటాపాటలతో అలావ్‌ ఆడుతూ పీర్లను ఊరేగించారు. సాయంత్రం సమీపంలోని చెరువుల్లో పీర్లను నిమజ్జనం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు.

వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి.

వర్షాకాలం గ్రామ సమస్యలపై శ్రద్ధ వహించాలి

డిపిఓ డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

శనివారం రోజున జిల్లా పంచాయితీ అధికారి డి.వెంకటేశ్వర రావు జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.వీధులన్నీ తిరుగుతూ గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్డు ప్రక్కన,షాపుల ముందు ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి పంచాయితీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతీరోజూ తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు,ఇతర వ్యర్థాలు లేకుండా జాగ్రత్తగా శుభ్రపరచాలని తెలిపారు,షాపుల యజమానులు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను రోడ్డు ప్రక్కన పడవేయవద్దని,డస్ట్ బిన్ వాడాలని సూచించారు.సెగ్రిగేషన్ షెడ్ లో కంపోస్టు ఎరువు తయారు చేయాలని,స్మశాన వాటిక పరిశుభ్రంగా ఉంచాలని,పల్లె ప్రకృతి వనం మొక్కలను సంరక్షించాలన్నారు.త్రాగునీటి వాటర్ ట్యాంకు లను పరిశీలించి క్లోరినేషన్ చేయించి శుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, కురుస్తున్న వర్షాకాల దృష్ట్యా సరిపడా బ్లీచింగ్ పౌడర్,బై లార్వా నిల్వ ఉంచుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని,వర్షాకాలం గ్రామ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయితీ కార్యదర్శికి సూచించడం జరిగింది.అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు.ఈ పర్యటనలో డిపిఓ వెంకటేశ్వరరావు,జైపూర్ మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపురావు,పంచాయతి కార్యదర్శి ఎం.విష్ణువర్ధన్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా.

హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా దత్తు రెడ్డి నియామకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాలు మేరకు హుగ్గెల్లి గ్రామం నూతన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ ని నియమించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఈ సంధర్బంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తురెడ్డి,వైస్ ప్రెసిడెంట్ గా ఎండీ అహ్మద్ ,జనరల్ సెక్రటరీ గా బొడ తుకారాం లకు మరియు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ పార్టీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు సన్మానించి ,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ మోసపూరిత 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దేనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ తరపున తమ పోరాటం తప్పదన్నారు సమీష్టగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో పీజీ శంకర్, కిష్టా రెడ్డి,రాథోడ్ భీమ్ రావు నాయక్,మధు, అహ్మద్,కసిం,షకీల్,అడ్డు,బాబ్బు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ జైపూర్ లో మీడియాతో ఈసందర్భంగా మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది.కానీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జూలై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్థంగా పని చేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.సెంట్రల్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు,పార్టీలోని అందరూ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈసమావేశంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే పార్టీ శ్రేణుల మద్దతును సమీకరించుకునే గొప్ప అవకాశం అని తెలిపారు.అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు,ఐఎన్టియుసి మిత్రులు అందరు కూడా తప్పకుండా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. అదేవిధంగా, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఇట్టి అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు._

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని శ్రీరంగాపురం గ్రామంలో డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య శిబిరం నిర్వహించే వ్యాధులతో బాధపడుతున్నవారు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా శానిటేషన్, నీటి నిల్వలు ఆయిల్ బాల్స్ రిలీజ్ , బ్లీచింగ్ చల్లించడం పంచాయితీ కార్యదర్శి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కాచి చల్లార్చి నీళ్లు మాత్రమే తాగాలని హారపదార్ధాలు వెచ్చగా ఉన్నప్పుడు తినాలని తెలిపారు. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, కరకగూడెం పి హెచ్ సి. హెచ్ ఈ ఓ కృష్ణయ్య, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఏ ఎం నరసింహారావు, సుజాత, ఆశాలు, హెల్త్ సూపర్వైజర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ

జైపూర్ నేటి ధాత్రి:

 

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని కాన్కూర్ గ్రామంలో మంగళవారం సోలార్ లైట్ అమర్చారు.టీజీ ఎఫ్ డీసీ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,ఫీల్డ్ సూపర్ వైసర్ రాజేష్,వాచర్ లు శంకర్,సాయికిరణ్, రాకేష్,గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది

రాత పుస్తకాలు అందజేసిన_మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వము అందించిన ఉచిత రాత పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము నుండి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను అందజేస్తుందని అన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు,రాత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,రాగి జావా,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు,అన్ని ఉచితంగా కల్పిస్తున్నది. కావున విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి గ్రామ ప్రజలది మరియు తల్లిదండ్రులదని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతికి మూడు,రెండవ తరగతి మూడు,మూడో తరగతి నాలుగు,నాలుగవ తరగతికి ఐదు,ఐదవ తరగతి ఆరు నోటుబుక్కులను ఉచితంగా అందజేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నోట్బుక్కులు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్ మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి.

గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి
భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు
అంబాల చంద్రమౌళి మాదిగ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో M R P S మొగుళ్లపల్లి మండల ఇంచార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ మరియు రేణుకుంట్ల సంపత్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్య కార్యాలర్తల సమావేశానికి ముఖ్య అతిధులుగా M R P S భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల చంద్రమౌళి
ముఖ్య అతిథిగా హాజరైన
మాట్లాడుతూ
జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ జన్మదిన వేడుకలు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరపాలని పిలుపునివ్వడం జరిగింది
మహాజన నేత మంద కృష్ణ మాదిగ అన్న ఎస్సీ లలో మాదిగ , ఉపకులాల కు ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా అన్యాయం జరుగుతుందని గుర్తెరిగి మాదిగ దండోరా (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) స్థాపించి పల్లె పల్లేనా మాదిగలను, ఉపకులాలను ఏకం చేసి సబ్బండ వర్గాల ప్రజలందరి మద్దతు కూడగట్టి ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని అలుపెరుగకుండా ముప్పై ఏండ్లు సాగించి ఫలితాన్ని సాధించి పీడిత వర్గాల ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసాడని అన్నారు. మాదిగల, ఉపకులాల పక్షాన ఉద్యమిస్తూనే సమాజం లో ఏ వర్గం కు ఆపద వచ్చిన ఆయా సామాజిక వర్గాలకు అండగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంతడుపుల సారంగ పాణి జీడీ సంపత్ రొంటాల రాజ్ కుమార్ బండారి రామస్వామి నిమ్మల భద్రయ్య మంగళ పల్లి శ్రీనివాస్ గుడిమల్ల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా

చర్ల నేటిధాత్రి:

 

చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

నేడే అంత్యక్రియలు ముగిసిన 33 ఏళ్ల గాజర్ల కుటుంబ ప్రస్థానం.

సెంట్రల్ కమిటీ సభ్యుడు హోదాలో మరణం. జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు.

చిట్యాల నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర నేటితో ముగియనుందా అనే సందేహం కలుగుతుంది వెలిశాల తల్లడిల్లుతుంది ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు, వివరాల్లోకి వెళితే గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008 ఎన్కౌంటర్లో చనిపోగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి.

చెందిన విషయం తెలిసిందే దీంతో గాజర్ల కుటుంబ ప్రస్థానం ఉద్యమంలో ముగిసినట్లయింది, రవి మృతదేహం కోసం బయలుదేరిన గాజర్ల అశోక్ అలియాస్( ఐతు) ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం కు బయలుదేరి మృతదేహాన్ని తీసుకొస్తున్న క్రమంలో చిట్యాల చౌరస్తాలో రవి మృతదేహానికి గౌడ సంఘం నేతలు మరియు తన చిన్ననాటి స్నేహితులు బంధువులు ప్రజలు నివాళులర్పించి రవన్న అమరహే అంటూ నినాదాలు చేశారు ,ఈ సందర్భంగా గాజర్ల రవి అలియాస్ గణేష్ తమ్ముడు అశోక్ మీడియాతో మాట్లాడుతూ డెడ్ బాడీ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అని కావాలని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చనిపోయిన శవాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావడం నిజంగా చాలా దురదృష్టకరం అని కనీసం డెడ్ బాడీనికూడా చూపించడానికి ఉదయం 8 గంటల నుండి వేడుకుంటే రాత్రి 12 గంటలకు డెడ్ బాడీని అప్పజెప్పారు అని ఫోరోనిక్స్ వాళ్ళు లేరని నిర్లక్ష్యం సమాధానం చెబుతూ చాలా కాలయాపన చేశారు అని.
ఈ ప్రాంత పోరాటం కోసం ఎన్నో పోరాటాలు చేసిన రవి మృతదేహాన్ని చూడడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కడసారి చూపు కోసం నోచుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు, డెడ్ బాడీ కోసం ఆంక్షలు పెట్టి ఇచ్చారని ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కు మరియు పోలీస్ శాఖ వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగిందని అట్లాంటి సంఘటనలు ఏమీ జరగవు అని ఈ సందర్భంగా తెలిపారు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానులు అందరూ శుక్రవారం రోజు జరిగే జరిగే అంత్యక్రియలో పాల్గొనాలని అన్నారు, మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినవారు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి గౌడ్ ఉపాధ్యక్షులు తడక సుధాకర్ ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అభిమానులు బంధువులు తదితరులు ఉన్నారు.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక. చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
నేర్పటి శీను కుమ్మరి శ్రీనాథ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగులపల్లి మండల ఇన్చార్జి MRPS నేరెళ్ల ఓదెలు మాదిగ.కో ఇన్చార్జీలు రేణికుంట్ల సంపత్ మాదిగ. రామ్ రామ్ చందర్ మాదిగ . మొగులపల్లి మండల.ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి మాదిగ. జీడి సంపత్ మాదిగ ఆధ్వర్యంలోMRPS ముఖ్య కార్యకర్తల సమావేశ నికి ముఖ్య అతిథులుగా మొగులపల్లి మండల ఇన్చార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ. కో ఇన్చార్జి రేణికుంట్ల సంపత్ మాదిగ లు హాజరై వారు మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత , పద్మశ్రీ అవార్డు గ్రహీతమంద కృష్ణ మాదిగతన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లోవెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారామాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇసిపేట గ్రామ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది
గౌరవ అధ్యక్షులుగా. జన్నె సదయ్య.మాదిగ
అధ్యక్షులు : నేర్పట్టి శీను మాదిగ
ఉపాధ్యక్షులు : జన్నె క్రాంతి మాదిగఅధికార ప్రతినిధిగా. బొచ్చు రాకేష్ ముఖ్య సలహాదారులుగా. నేర్పాటి శ్రీను మాదిగ. జన్నెమొగిలి మాదిగ ప్రధాన కార్యదర్శి : బొచ్చు రాజు మాదిగ కార్యదర్శి : నేర్పట్టి అశోక్ మాదిగ కోశాధికారిక. గడ్డం చిరంజీవి మాదిగ.
ప్రచార కార్యదర్శిగా నేర్పటి రాజయ్య మాదిగ
సంయుక్త కార్యదర్శిగా. గడ్డం
రాజు. మాదిగ లను
చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.అధ్యక్షులుగా. కుమ్మరి శ్రీనాథ్ఉపాధ్యక్షులుగా. శ్రావణ్అధికార ప్రతినిధిగా. అజయ్ ప్రధాన కార్యదర్శిగా. ప్రభాస్కార్యదర్శిగా. రాంబాబు
కోశాధికారిగా. అంతడుపుల రాజు
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి జీడి సంపత్. రొంటాల రాజ్ కుమార్. జంపయ్య తదితరులు పాల్గొన్నారు

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు.

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు

 

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version