కాంగ్రెస్ కు అండగా బీసీలు ఉండాలి .

కాంగ్రెస్ కు అండగా బీసీలు ఉండాలి

జిల్లా కాంగ్రెస్ నేత సాయిలి. ప్రభాకర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక చారిత్రాత్మకమని ఇది సామాజిక విప్లవానికి నాంది అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిసి నేత. సాయిలి ప్రభాకర్ పేర్కొన్నారు.అందుకు బీసీ కులాలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు.సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కు బీసీలు అండగా నిలవాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన జనాభా ప్రతిపాదికన ఎవ్వరెంతో వారికంత రిజర్వేషన్ల డిమాండ్ ను దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమలు చేయడం గర్వకారణమని అభివర్ణించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించగా అదే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతానికి పెంచడం పట్ల రాష్ట్ర మంత్రి వర్గానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ కు అండగా నిలబడి పార్టీని గెలిపించాలని ప్రభాకర్ కోరారు.

ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత.

ప్రమాదాకరంగా ఉన్న ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలో రోడ్డు మీద ప్రమాదకరంగా ఉన్న ఇనుప కరెంటు స్తంభం ముక్క. నడికూడ నుండి ధర్మారం వరకు రోడ్డు వెడల్పు లో భాగంగా ఇనుప కరెంట్ స్తంభాలను తొలగించగ మిగిలిన ముక్క రోడ్డు మీద ప్రమాదకరంగా ఉండి వాహనాధారులు ప్రమాదానికి గురయ్యేవారు. నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు చొరవ తీసుకుని కటర్, గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో ఇనుప కరెంట్ స్తంభం ముక్కను తొలగించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. దీనితో పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు.!

బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్

హన్మకొండ, నేటిధాత్రి:

సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు
నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు…
కాకతీయ యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్.!

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్ – పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి మార్చి 1: “నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు… నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి.” ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుకట్ల పొశం మల్లీశ్వరి, కుటుంబాన్ని పోషించేందుకు మందమర్రిలోని ఇందు గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగనుండగా, పెళ్లి ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్, సహాయ హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు రూ. 50,000 నగదు మరియు పెళ్లి బట్టలు అందజేశారు. కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యులా భావించి, ప్రేమతో ఆశీర్వదించారు.

“ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం”

ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, “నాయకత్వం కేవలం రాజకీయాలకు పరిమితం కావాలి కాదు, సహాయం అవసరమైన వారి కోసం నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు, ఇలాంటి సందర్భాల్లో తమ వంతు సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు.

ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మానవతా గుణం

సదానందం యాదవ్ చేసిన మానవీయ చర్య స్థానిక ప్రజల హృదయాలను హత్తుకుంది. “ఇలాంటి నాయకుల వల్లే సమాజం బాగుపడుతుంది” అని వార్డు పెద్దలు, మహిళలు ప్రశంసించారు. “అధికారంలో లేకున్నా పేదల కోసం నిలబడే నేతలు అరుదుగా కనిపిస్తున్నారు. సదానందం నిబద్ధతకు హృదయపూర్వక నమస్కారం” అంటూ పలువురు వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అండగా నిలిచే గొప్ప మనస్సు ఉన్న నేతగా బండి సదానందం యాదవ్, సామాజిక సేవకు చిరునామాగా మారారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version