రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు…

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రోడ్డు భద్రతా మాసంలో భాగంగా, కోహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ( జడ్. పి. హెచ్. ఎస్ ) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమాద కారణాలు, ముఖ్యమైన రోడ్డు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతలను జహీరాబాద్ మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య గారు, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన తుడా చైర్మన్…

*గరుడ టూ వీలర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన….

+తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి గరుడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల విన్నపం మేరకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో బాలాజీ కాలనీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీ”* ని ఆయన పోలీసు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ప్రాణ రక్షణకు హెల్మెట్ ఒక కవచంలా పనిచేస్తుందని, కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
గరుడ టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా,ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలోని ప్రధాన కూడళ్లలో గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది,మెకానిక్ సోదరులు హెల్మెట్లు ధరించి, భద్రతా నిబంధనలపై ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.
అంతకముందు బాలాజీ కాలనీ కూడలి వద్దకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి అసోసియేషన్ సభ్యులు దుశ్శలావతో సత్కరించి, క్యాలెండర్ ప్రతిని అందించారు. ​
ఈ కార్యక్రమంలో గరుడ టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, పోలీస్ అధికారులు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు మెకానిక్ సోదరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version