ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు….

ఇంధనం కొరత వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

◆”-: రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మార్చ్ 26: పెట్రోల్, డీజిల్ కొరత వదంతుల్లో వాస్తవం లేదని, ఇంధన సరఫరాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ రెడ్డి చరాక్ పల్లి ఎస్సై ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని బారులు తీరవద్దని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్సై పేర్కొన్నారు.

కనీస వేతన సలహా మండలి తీర్మానాలను.!

కనీస వేతన సలహా మండలి తీర్మానాలను వెంటనే గెజిట్ చేసి అమలుపరచాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన ఏఐటియుసి నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ప్రతిపాదనలను తక్షణమే గెజిట్ చేసి అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ముగ్దూమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కనీస వేతనాల సలహా మండలి సభ్యులు ఎండి.యూసుఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి.అక్బర్ ఆలీ లు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులకు కనీస వేతనాలు పెరగక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని, యాజమాన్యాలు అర కోర వేతనాలు చెల్లించి శ్రమ దోపిడికి పాల్పడ్డాయి అని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచడానికి కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేసి అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారని, సోమవారం రోజున జరిగిన కనీస వేతనాల సలహా మండలి లో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని,కార్మికుల పర్వదినమైన మే 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి పంపించిన ప్రతిపాదనలను అంగీకరించి అధికారికంగా ప్రకటించాలని,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గెజిట్ చేసి అమలు పరుచుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలు జీవో ప్రకారం వేతనాలను కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ కార్మికులు పొందుతున్నారని,వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను ఆమోదించిన వెంటనే సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఉద్యోగ భద్రత,ఈఎస్ఐ, చట్టబద్ధమైన లీవులు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు అఫ్రోజ్ ఖాన్,యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ క్రిస్టోఫర్,కార్యవర్గ సభ్యులు దొడ్డిపట్ల రవీందర్ తదితరులు  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version