సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి.
బాలానగర్ ఎస్సై లెనిన్.
బాలానగర్ /నేటి ధాత్రి
రానున్న సంక్రాంతి పండగ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ప్రజలు ఊరెళ్ళితే తమ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఎస్సై లెనిన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు బలంగా మూసివేయాలన్నారు. ఇంట్లోనే నగదును, బంగారం, వెండి నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలన్నారు. రాత్రి వేళలో ఇంటిముందు లైట్లు వెలిగించాలని, “పండగకి ఊరికి వెళ్తున్నాం” అని సోషల్ మీడియాలో పెట్టకూడదన్నారు. ఇంటిముందు చెట్ల పొదలు ఉంచరాదన్నారు. ఇంటికి కాపలా వాచ్ మెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ఇంటి తాళాలను పూల కుండీలలో, మ్యాట్ కింద భద్రపరచరాదన్నారు. పొరుగింటి వారికి తమ ఇంటిపై నిఘా పెట్టాలని సూచనలు ఇవ్వాలన్నారు. అద్దె ఉన్న యజమానులు ఖాళీగా ఉన్న ఇండ్లపై నిగా పెట్టాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
