జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 1 రాజీవ్ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, అధికారులతో కలిసి పారిశుధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిబంధనలకు లోబడి త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఇండ్ల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మురుగు కాలువ సమస్య, పట్టణ ఆరోగ్య ఉప కేంద్రంలో నెలకొన్న సమస్యలు, ఇంటి పైనుండి విద్యుత్ తీగలు వెళ్లడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజలకు త్రాగునీరు, వీధి దీపాలు,మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో పన్నులను 100 శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పన్నుల వసూలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వేసవి కాలం అయినందున ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారం త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిలువలు లేకుండా ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ శ్రీపతి బాబురావు సూచించారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు,పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.పెగడపల్లి శివారులో చెత్తతో నిండి ఉన్న డ్రైనేజ్ లను శుభ్రం చేపించారు.జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులు వంద శాతం పూర్తి చేయాలని,ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్,పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాము,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,శ్రీవాణి సిబ్బంది పాల్గొన్నారు.
అత్నూర్ గ్రామంలో రూ.10 లక్షల సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/FvRqDzK6-PU?si=-2MLBuxUJemVBUgU
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో బుధవారం సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ఎంపీ కోటా కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని నాయకులు తెలిపారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ, నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం
మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
నర్సంపేట, నేటిధాత్రి:
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపల్ యంత్రాంగంతో కలిసి 24వ వార్డులో పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, స్థానిక వార్డు కౌన్సిలర్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వార్డులో ఎమ్మెల్యే సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పారిశుధ్యం, మెరుగైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను వారు సమీక్షించారు. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వించి మోటర్లు అమర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా వార్డులోని జీడయ్యపల్లె ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డును పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అయూబ్ ఖాన్, 24వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు,వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 3వ వార్డులో బిఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ,వార్డు సమస్యలపై నేరుగా స్పందిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి సృజన కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.మంగళవారం పరకాల పట్టణంలోని పద్మశాలి వాడ,గడ్డం వాడ, ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ కాలనీలోని తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో,ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ మీ ముందుకు వచ్చానని తెలిపారు.మీరు ఆశీర్వదిస్తే 3వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పంచగిరి సుధాకర్,ఆలేటి మహేందర్, వార్డు ఇంచార్జి రవీందర్, నాయకులు విష్ణు,అనిల్, ఉమర్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి జాతర కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పకడ్బందీగా. మహాశివరాత్రి జాతరను పండుగగా భావించి భక్తులు సులభంగా, వేగంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శివ స్వాములకు సులభ దర్శనం జరిగే విధంగా చూడాలని, దర్శన సమయం కూడా అరగంట అదనంగా పెంచాలన్నారు. పుర ప్రముఖులకు గతంలో మాదిరి అందజేసి సులభ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలాని. ప్రస్తుతం భక్తుల కోసం రెండు క్యూలైన్‌ల సిస్టం ఉన్న దృష్ట్యా వీఐపీల కోసం మూడో క్యూలైన్ శివరాత్రి లోగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు తాగునీరు, కుర్చీలు, పందిల్ల సౌకర్యం కల్పించాలని. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. బస్టాండ్ లో మూత్రశాలలు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని. కంట్రోల్ రూమ్‌ల వద్ద ప్రజా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి మైకు ద్వారా భక్తులకు తెలియజేసే సౌకర్యం కల్పించాలన్నారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు శాశ్వత సీసీ కెమెరాలను పెట్టాలన్నారు. జాతర విజయవంతం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు. జాతరలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన ఏర్పాట్లు చేయాలని. భక్తులు స్వామి వారి దర్శనాన్ని వేగంగా, సౌకర్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని కోరారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జాతర సందర్బంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వలంటీర్‌లను ఏర్పాటు చేయాలని. అగ్ని మాపక అధికారులు ఆలయ సిబ్బందికి అగ్ని మాపక పరికరాలు వాడే విధానంపై ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని నీటి సరఫరా. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా నిరంతరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని.మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని అన్నారు, అమృత గుండం దగ్గర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి దర్శనానికి వచ్చిన భక్తులను స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలన్నారు,
ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఝరాసంగం మండల ఆయా గ్రామీణ ప్రాంతాలు, సైతం అవసరమైన ఏర్పాట్ల కోసం మసీదుల వద్ద విద్యుత్ దీపాలు ఎక్కడైనా, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. మసీదుల వద్ద హైమాస్ లైట్, వీధి దీపాల పని తీరు పర్యవేక్షించాలని, మసీదుల వద్ద పారిశుద్ధ్య మురికి కాలువలు నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. మండల అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని పంచాయతి అధికారులను కోరారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని అన్నారు,ఇషా నమాజ్ తర్వాత రాత్రి సమయంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు.సహర్ (Sehri): సూర్యోదయానికి ముందు వేకువజామున చేసే భోజనం. ఈ సమయంలో విద్యుత్ శాఖ అధికారులకు రంజాన్ సమయాలను తెలియజేసి, ఆ సమయంలో పవర్ కట్స్ చేయకుండా చూడాలని ముందస్తుగా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మండల ఆయా గ్రామాలలో వంటి ప్రాంతాలలో ఇబ్బందులను నివారించాలని కోరారు.
మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభ్యర్థి రజిని నవీన్ లతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థితో పాటు స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్బంగా శనిగరపు రజిని నవీన్ మాట్లాడుతూ నమ్మకంతో గెలిపించండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.వార్డులో తాగునీరు,డ్రైనేజీ,రోడ్ల అభివృద్ధి,పారిశుధ్యం వంటి సమస్యలపై పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపుతామని అన్నారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు ఆముదాలపల్లి అశోక్ గౌడ్,పార్టీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, పారదర్శక పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలు ( మురికి కాలువలు, తాగునీరు, విద్యుత్), పారిశుధ్యం, మరియు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ కట్టుబడి ఉన్నామని. గ్రామ సభలు, ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరిస్తూ, కార్యక్రమాలతో ఆదర్శ గ్రామాలుగా మార్చడమే నా లక్ష్యం అని అన్నారు. ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి రెండు గ్రామాలు ఉండగా ఒకటి తుమ్మనపల్లి రెండవది కె. సంఘం గ్రామం ఉంది అదేవిధంగా మంగళవారం కె. సంఘం గ్రామంలో మురికి కాలువలు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు గ్రామాన్ని అభివృద్ధి దిశగా దూసుకెళ్లించి, సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరిస్తానని తెలిపారు.తాగునీరు, మురుగు పనులు, యువతకు అవకాశాలు కల్పించి గ్రామాన్ని మార్పు చూసేలా పనిచేస్తానని అన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించగా, వాటిని పరిష్కరిస్తానని వారు తెలిపారు. కే.సంఘం గ్రామంలో మాట ఇచ్చిన ప్రకారం రోడ్ల పనులను ప్రారంభించారు పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి సంఘం కి పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపిటిసి నవాజ్ రెడ్డి తదితరులు ఉన్నారు,
శ్రీ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భూపాలపల్లి మండల పరిధిలోని గుర్రంపేటలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ మిని మేడారం జాతరను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం చెల్లించారు.
జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, పారిశుధ్యం, త్రాగునీరు, వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్ తదితర అధికారులు, ఆలయ సిబ్బంది, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట మండలం రజాక్ పల్లి గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వజ్జే కనకరాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై గ్రామ సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భవనం ,సీసీ కెమెరాలు, పారిశుద్ధ పనులు గురించి మాట్లాడడం జరిగిందన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానానికి తీసుకుపోదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, నూతన పాలకవర్గం సభ్యులు ఉన్నారు.
బస్తీ బాట పట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన బస్తీ బాట కార్యక్రమం నిర్వహించిచారు ఈ బస్తీ బాట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్న గండ్ర వెంకట రమణా రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
పొట్టి పల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం
◆-: “మాజీ సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ”….
◆-: సర్పంచులు గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలోని పొట్టి పల్లి గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలో బి అర్ ఎస్ పార్టీ బలపరిచిన నాయకులు శ్యామల మొగులయ్య సర్పంచ్ గా విజయం సాధించగా సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… రెండవ విడత స్థానిక ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచులు గ్రామములో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు త్రాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. గెలిచిన బి అర్ ఎస్ సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సర్పంచులు బాధ్యతగా పనిచేస్తూ గ్రామస్తుల మన్నలను పొందాలి అన్నారు. సేవాగుణంతో పని చేసే వారికి ప్రజల గుర్తింపు ఉంటుంది అని గుర్తు చేశారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులేనని, గ్రామ పాలనలో వారందరి సేవ వెలకట్టలేనిదని, మీతో పాటు నేను గ్రామాల ప్రగతి లక్ష్యంగా నిరంతరం పని చేస్తాము అన్నారు. ఓటమి పాలైన బి అర్ ఎస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని వారందరూ సమయాభావంతో ఉండి గ్రామాల్లో మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్, సర్పంచ్ శ్యామల మొగులయ్య, ఉప సర్పంచ్ జనార్దన్, మాణిక్ పస్తాపూర్ రాములు శేరి బసవరాజ్ శివకుమార్ పాండు విష్ణు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
కేజీబీవీ హాస్టల్‌కు కూరగాయలు సక్రమంగా సరఫరా చేయడం లేదని తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మహాముత్తారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్శన సందర్భంగా విద్యాలయంలోని వసతి సదుపాయాలు, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, మెనూ నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, హాజరు రిజిస్టర్, వంటశాల పరిశుభ్రత వంటి అంశాలను ఆయన పరిశీలించారు. ఆహార మెనూ అమలు చేయకపోవడం లేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషణ దృష్ట్యా ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనం అందించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ పర్యవేక్షణ చేస్తూ ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాలయంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయలు సక్రమంగా సరఫరా చేయడం లేదని విద్యాశాఖ అధికారి విచారణ నిర్వహించి నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ ఆర్ఐ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండలం లోని చైన్ పాక గ్రామం లోబుధవారం రోజున ప్రమీల టీచర్ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను ఉదయం 9 గంటలకు కేంద్రాలకు పంపాలని, ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లల బరువులు తీయించుకోవాలని, గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని 14 నుండి 18 సంవత్సరాల బాలికల పై జరుగుతున్న హత్యాచారాలు జరగకుండా చూడాలని ఆడ మగ భేదం లేకుండా పిల్లలను అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని వృత్తి, విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించనైనది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మాట్లాడుతూ నీటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించినారు. సెక్రెటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మురికి కాలువలు లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కస్తూరి, రజిత, ప్రమీల ఆశ వర్కర్ మహిళలు హాజరైనారు.
చిట్యాల మండలం లోని చైన్ పాక గ్రామం లోబుధవారం రోజున ప్రమీల టీచర్ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను ఉదయం 9 గంటలకు కేంద్రాలకు పంపాలని, ప్రతి నెల 1వ తేదీ రోజు పిల్లల బరువులు తీయించుకోవాలని, గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని 14 నుండి 18 సంవత్సరాల బాలికల పై జరుగుతున్న హత్యాచారాలు జరగకుండా చూడాలని ఆడ మగ భేదం లేకుండా పిల్లలను అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని వృత్తి, విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించనైనది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మాట్లాడుతూ నీటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించినారు. సెక్రెటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం మురికి కాలువలు లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కస్తూరి, రజిత, ప్రమీల ఆశ వర్కర్ మహిళలు హాజరైనారు.
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
మంగళవారం జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్, సాధారణ వార్డులు, ఐసీయూ వార్డులు, రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, ఓపి సేవలు, సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అన్ని విభాగాల ప్రధాన వైద్యులతో సమావేశం నిర్వహించారు.
సిబ్బంది ఖచ్చితమైన సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు రోగులకు వేస్తున్న బెడ్‌షీట్లను మార్చాలని సూచించారు. రోగులకు అందించే ఆహారానికి స్పష్టమైన మెనూ ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య సేవలపై రోగులు అభిప్రాయాలు చెప్పేందుకు ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం వార్డుల్లో పర్యటించిన కలెక్టర్, చికిత్స పొందుతున్న రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవలపై స్పందనను అడిగి తెలుసుకున్నారు. రక్షణ చర్యల్లో బాగంగా ఫైర్ ఎస్టింగ్విషర్‌ల గడువు ముగిసినట్లు గుర్తించిన కలెక్టర్, ఇప్పటి వరకు ధృవీకరణ ఎందుకు తీసుకోలేదని పర్యవేక్షకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడం కోసం జిల్లా వైద్య శాఖ ఆధీనంలో ఖాళీగా ఉన్న భవనాన్ని వినియోగించాలని సూచించారు. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, రోజుకు దాదాపు వెయ్యి మందికిపైగా వైద్యసేవలు అందుకుంటున్నారని పర్యవేక్షకులు డా. రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రసూతి విభాగాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రతి నెల 160–180 ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. అందులో సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌ల వివరాలు, ప్రమాదకర కేసులను ఎక్కడికి రిఫర్ చేస్తున్నారన్న అంశాలను కూడా కలెక్టర్ వివరంగా ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఉపయోగించటం లేదని గుర్తించి, లీకేజీల కారణంగా వినియోగం ఆగిపోయిందని వైద్యులు వివరిగా తెలియజేయగా, వెంటనే మరమ్మతులు చేసి సేవల్లోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగుల భద్రత, నాణ్యమైన వైద్యసేవలు నిర్దేశిత విధానంలో అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆర్ ఎం ఓ దివ్య అని విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మాకులచెరువు, కట్ట ఆధునీకరణ, సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి
నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి/మరిపెడ
మండల కేంద్రం లోని జిల్లా, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడి, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,మరిపెడ మండల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్,ప్రాథమిక మండల పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని మాకుల చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందని అందులో భాగంగానే మరిపెడ పట్టణంలోని మాకులచెరువు అభివృద్ధి పనులు నిమిత్తం సుమారు రెండు కోట్ల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని ఆ యొక్క పనులను వెంటనే పూర్తి చేసి పట్టణ అభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు, అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న పిల్లలకు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వైద్య పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని,అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యా బోధనలు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు సూచించారు,అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని నెలవారి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి అందించాలని చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని, కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సామ్, మామ్, ఆరోగ్య వివరాలను నిత్యం క్షేత్రస్థాయిలో గమనిస్తూ వారికి కావలసిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా కలెక్టర్ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, అంగన్వాడీ కేంద్రాలలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ స్టడీ రూమ్స్ తరగతి గదులు స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ క్రిష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ ఆర్. విజయాఆనంద్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ముదిగుంట గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ గ్రామసభ ఎంపీవో శ్రీపతి బాబురావు బుధవారం నిర్వహించారు. అలాగే గ్రామపంచాయతీ లో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే ఉపాధి హామీ పనుల వివరాలు తెలిపారు.ఈజీఎస్ లో చేపట్టవలసిన పనులు పశువుల పాక,కోళ్ల షెడ్డు, అజోల్లా,నాడెపు కంపోస్ట్ పిట్, మట్టి రోడ్డు నిర్మాణం,చిన్న ఊట కుంటలు,ఫారం ఫండ్, మామిడి తోటల పెంపకం, ఫారెస్ట్ కందకాలు,కొబ్బరి తోటల పెంపకం చేపట్టాలని సూచించారు.అనంతరం మొబైల్ యాప్ తనిఖీ నిర్వహించి సానిటేషన్ పనులు చేపట్టి,100% ఇంటి పన్నులు త్వరగా పూర్తి చేయాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,ఉపాధి హామీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.