మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ శాంతినగర్ కాలనీ సమీపంలో ఉపరితల గని రెండో దఫా పనుల కొరకు డిసెంబర్ 3న ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న నేపథ్యంలో కాలనీవాసులకు ఇంటి స్థలాలు కేటాయించి ,ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అధికారికి కాలనీవాసులు వినతి పత్రం అందించారు. ఉపరితల గని మొదటి దఫా లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లకి కాలనీలలోని ఇండ్ల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలు అనారోగ్యాన బారిన పడ్డారని అందుచేతనే రెండోదఫా పనులు ప్రారంభానికి ముందే నష్టపరిహారం చెల్లించి తమ కాలనీవాసులను ఆదుకోవాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే ఫోర్ గడ్డ శాంతినగర్ కాలనీ సమీపంలో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3 రోజున ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న సందర్భంగా శాంతినగర్ కాలనీవాసులు తమ అభిప్రాయాలను ముందస్తుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ లకు కాలనీవాసుల అందరి సంతకాలు సేకరించి వినతి పత్రాలు అందించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడారు. మొదటి దఫా పనులు జరిగిన సందర్భంగా బాంబు బ్లాస్టింగ్ లతో కాలనీలలోని ఇల్లుల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలంతా అనారోగ్య బారిన పడ్డారని తెలిపారు. మళ్లీ రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం కేటాయిస్తే కాలనీ నుండి వెళ్లిపోతామని కలెక్టర్, ఆర్డిఓ ,మున్సిపల్ కమిషనర్, జిఎం లకు వినతి పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.
మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాను (Cyclone Montha) ఏపీలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే పంట పొలాల్లోకి నీరు చేరడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం అందజేస్తామని.. ప్రతీఒక్కరినీ ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అలాగే తుఫాను బాధితులకు ఇంటికి వెళ్లే ముందు రూ. మూడు వేల నగదు ఇవ్వడంతో పాటు బియ్యం, నిత్యావరసరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండి పడి అక్కడి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక పశువులు చనిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండిపడి నష్టపోయిన కుటుంబాలకు, పశువులకు ప్రత్యేక స్కేలు ఆర్థిక సాయం చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు (సోమవారం) విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి జయలక్ష్మి జీవో ఆర్టీనెంబర్ 125ను జారీ చేశారు. ఈనెల 6న వల్లూరు గ్రామం కేవీబీపురం మండలంలోని రాయలచెరువు ట్యాంకుకు గండి పడింది. దీంతో ఆ నీరంతా కాల్తూరు హరిజనవాడ, ఎస్‌ఎల్ పురం, పాతపాలెం గ్రామాల్లోకి రావడంతో భారీగా పశువులు చనిపోయాయి.
రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం
రైతుల పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలి
మోంథా తుఫాన్ తో తీవ్రతతో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కృషి చేయాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
అధిక వర్షాలు, మోంథా తుఫాన్, యూరియా కొరతలతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని సొసైటీలు, బ్యాంకులు నోటీసులు ఇవ్వడం దారుణమని తక్షణమే అట్టి నోటీసులను ఉపసంహరించుకొని పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల వ్యవసాయం అధిక వర్షాలు యూరియా కొరతతో అస్తవ్యస్తంగా మారిందని, పంటల దిగుబడి తగ్గిందని ఈ క్రమంలో అరాకోరా పంటలు చేతికచ్చే దశలో మోంథా తుఫాన్ తో ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాలలో పత్తి మొక్కజొన్న వరి తదితర పంటలు కోల్పోయారని దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన వరంగల్ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి సురేఖ,నర్సంపేట వర్ధన్నపేట పరకాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అదుపోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, డివిజన్ నాయకులు జన్ను రమేష్ ముర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవాలి
ఎం సిపిఐ(యు )పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమార్ స్వామి డిమాండ్
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం మండల కేంద్రంలో ఎం సిపిఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ బొల్లోజు రామ్మోహన చారి, అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కామ్రేడ్ గోనె కుమారస్వామి ,మాట్లాడుతూ ఇటీవల కురిసిన మొంథా తుఫాను భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు వేసిన వరి మొక్కజొన్న పత్తి మిర్చి తదితర వాణిజ్య పంటలు మరియు గొర్రెలు మేకలు ఇతర పశువులు ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను మరియు మరణించిన కుటుంబాలను తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. రైతులకు గత యాసంగి పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నాలుగు నెలలు దాటిన ఇవ్వకపోవడం రైతులను మోసం చేసిన ప్రభుత్వం అవి ఇవ్వకుండానే ఖరీఫ్ వానకాలపు పంటలకు బోనసిస్తామని ప్రగల్బాల్ పలుకుతున్నారని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపినారు. ఇప్పటికైనా వెంటనే బోనస్ రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం మొక్కలు తదితర వాటిని కొనుగోలు చేయుటకు ముందుకు వచ్చి పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరగకపోవడం వలన గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్రం నుంచి గ్రామాలకు రావలసిన నిధులు సుమారు 2,800 కోట్ల రూపాయలు రాకుండా పోయినాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తక్షణమే జరపాలని డిమాండ్ చేశారు, నవంబర్ 19న ఇందిరా పార్కు దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.నల్గొండ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాటం వలన సాధించిన శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువ కు బి.యన్.రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ, ఎం సిపిఐ యూ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి( యు) పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న, జిల్లా నాయకులు నూకల ఉపేందర్, కటకం బుచ్చిరామయ్య, బొల్లోజు రామ్మోహనాచారి, తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రే షియా ప్రకటించాలి
*బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టిరామకృష్ణ*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్య క్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పత్తి, మొక్కజొన్న, మరియు వరి పంటలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశె ట్టి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన మాట్లాడుతూ రైతు కష్టానికి విలువ ఇచ్చే ప్రభు త్వం కావాలి కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైపో యింది. వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అయినా, ఇప్పటివరకు ఎలాంటి పంట నష్ట నివారణ చర్యలు తీసు కోలేదని ప్రభుత్వం రైతుపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. బిజెపి తరఫున డిమాండ్లు ప్రతి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం తక్షణం ప్రకటించాలి, పంట బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి,రాబోయే పంట సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి, నష్టపోయిన గ్రామాలను సర్వే చేయించి మండలాన్ని దుర్ఘట ప్రభావిత మండలంగా గుర్తించి రాష్ట్ర బృందం ద్వారా అంచనా వేయించాలి.ప్రభుత్వం స్పందించకపోతే, బిజెపి రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రైతు అన్నదాత అతనిని రక్షించడం ప్రభుత్వ ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరించిన ప్రభుత్వా నికి రైతులు తగిన గుణపాఠం చెబుతారు. బిజెపి ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుందని రైతుల కష్టాన్ని గుర్తించని ప్రభుత్వం, ప్రజల కష్టాన్ని ఎలా గుర్తిస్తుందని తెలపడం జరిగింది.
దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి.
#మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ గౌడ్ మాట్లాడుతూ..కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట,వెన్ను దశలో ఉన్న పంట నేలకొరిగి కంకులు నీటిలో నానుతున్నాయని తెలిపారు.ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తుపాను గురించి సకాలంలో హెచ్చరికలు చేయడంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతోనే భారీగా పంట నష్టం జరిగిదన్నారు. పెనుగాలుల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.తక్షణమే పంట నష్టం గురించి అంచనా వేసేందుకు వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో బృందాలను వేసి,పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి జాబితాను రూపొందించాలని కోరారు.ఎకరాకు వరికి రూ.25 వేలు,మొక్కజొన్న , పత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను,కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి,మండల కార్యదర్శి బూర కృష్ణ, మండల నాయకులు వల్లే పర్వాతలు,బోట్ల ప్రతాప్,నాగిరెడ్డి రాజిరెడ్డి,బూత్ అధ్యక్షులు ఊటుకూరి చిరంజీవి, నాగపూరి సాగర్,కొలిపాక దేవేందర్ పార్టీ నాయకులు కొనుకటి మధుకర్,చెంచు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..
*చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు.
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటి ధాత్రి)అక్టోబర్
ఆంధ్ర ప్రదేశ్ ను వణికించిన మొంథా తుఫాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఎదుర్కొన్న తీరు మహా అద్భుతమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు. మొంథా తుఫాన్ బలహీన పడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని ఆయన అన్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు చర్యలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారుమా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షత వల్లే మొంథా తుఫాన్ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోగలిగామన్నారు. ఏపీ ప్రజల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదో తార్కాణమన్నారు.
మొంథా తుఫాన్ బలహీన పడిన తర్వాత సీయం ఏరియల్ సర్వే నిర్వహించడం.
తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించడంతోపాటు బాధితులకు ముఖ్యమంత్రి సహాయం అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం స్ఫూర్తిదాయకమన్నారు. తుఫాను వల్ల పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ చెప్పారాయన. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి, మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు,పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారనీ..ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మించిన సియంను తాను చూడలేదన్నారు. అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. దాదాపు 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనాలను అధికారుల ద్వారా తక్షణం సమాచారాన్ని సేకరించడం సీఎం పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం కర్తవ్య నిర్వహణలో ఆయనకున్న చిత్తశుద్ధిని, సమయస్ఫూర్తిని తెలియజేసిందన్నారు. మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో అప్రమత్తతో వ్యవహరించి, ప్రజలకు బాసటగా నిలిచిన ఎమ్మెల్యేలు, అధికారులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ సందర్భంగా అభినందించారు.
అకాల వర్షాలకు చేతికి వచ్చిన పత్తి పంట తీవ్రంగా దెబ్బతిని రైతులకు విపరీత మైన నష్టం వాటిల్లిందని ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామ బి. ఆర్.. ఎస్. సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి అన్నారు ప్రభుత్వం వెంటనే ఎకరాకు ముప్పై వేల నష్ట పరిహారం అందించాలని అలాగే యాసంగి రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఋణ మాఫీ కాక మిగిలిన రైతులకు వెంటనే ఋణ మాఫీ చేయాలని కోరారు లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు అని హెచ్చరించారు,
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ న్యాల్కల్ మోగుడంపల్లి కోహిర్ ఝరాసంగం ఉమ్మడి మండలంలో పెద్ద ఎత్తున పత్తి పంటలు దెబ్బతిన్నాయి వ్యయ ప్రయాసలకు ఓర్చి వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతు లకు పంటలు చేతికి వచ్చే దశలో ప్రకృతి వికృత రూపం దాల్చి కాయ కష్టం మొత్తాన్ని ఉడ్చేసింది. దీంతో ఉమ్మడి మండలంలో సుమారు 50 కోట్ల కు పైగా నష్టం వాటిల్లింది ఉమ్మడి మండలంలో ప్రధాన పంటలైన వారి పత్తి
ఈ రెండు పంటలే ప్రధాన పంటలు కావడంతో రైతన్నలు పంట సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి భూములను కౌలుకు తీసుకొని అందులో పంటలను సాగు చేసినప్పటికీ పంటలు చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వరుణుడు తమ ప్రతాపం చూపడంతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అటు పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులకు కంటినిండా నిద్రలేక రైతులు తీవ్ర అస్తవ్యస్తాల కు గురవుతున్నారు. పత్తి చేలల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో పత్తి పంట రంగు మారిపోయింది అంతేకాకుండా పత్తి చెట్టుకు కాసిన కాయల్లో నుంచి సగం కాయలు పూర్తిగా కుళ్ళి పోయాయి ఉన్న అరకొర కాయలు కూడా తెలుపు రంగులో ఉండే పత్తి నలుపు రంగులోకి మారిపోయింది.
రంగు మారిన పత్తిని కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు దీంతో రైతన్నలు ఏమి చేయాలో అర్థం కాక పోవడం ఒక ఎత్తు అయితే పంట సాగు కోసం తెచ్చిన అప్పులు రెట్టింపు కావడంతో ఆ అప్పులను ఎలా తీర్చాలో రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది లేనియెడల తమకు మరణమే శరణ్యమని పలు గ్రామాల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
మరోవైపు కాస్తో కూస్తో కొద్దిపాటి వరి పొలం ఉండడంతో ఆ వరి పంట కూడా రేపో మాపో చేతికి వస్తుందనుకున్న సమయంలో అధిక వర్షాల వల్ల అట్టి వరి పంట గింజలు నేలరాలిపోయాయి, మరికొంతమంది వరి పొలాలు పూర్తిగా నీడ మునిగిపోయి, అట్టి నీటిలోనే వరి పంట కుళ్ళిపోయింది దీంతో ఆయా గ్రామాల రైతులు తమ కళ్ళముందే తమ పంటలు ఇలా చెడిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు పడ్డారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నష్టపోయిన పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు లేనియెడల పురుగుల మందులే పాయాసం అనుకోని ఆత్మహత్యలకు పాల్పడడం ఖాయమని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి నష్టపోయిన పంటలను గుర్తించి అట్టి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
మెట్పల్లి ఎస్బిఐ బ్యాంకులో ఖాతాదారుడైన టీజీ ఎస్ ఎన్ పి డి సి ఎల్ ఉద్యోగి రంగు రవీందర్ గ్రామం గోవిందారం వారు ఆరు నెల క్రితం సహజ మరణించడం జరిగింది సాలరీ ప్యాకేజ్ అకౌంటు ఖాతాదారుడి కి ఉన్నందున ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు అతని భార్యకు బ్యాంకు మేనేజర్ పి నవీన్ కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ. డి ఈ ఈ డిఈ చేతుల మీదుగా చెక్కును అందజేయడం జరిగింది. అనంతరం బ్యాంకు మేనేజర్ పి నవీన్ మాట్లాడుతూ 18వ తారీకు రెండో నెల 2025 రోజున ఎస్బిఐ మరియు టీజీ ఎస్ ఎన్ పి డి సి ఎల్ మధ్య ఎం ఓ యు శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఒప్పందం జరిగింది. తెలంగాణ కరెంటు డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎస్బిఐ బ్యాంకు లో ఖాతా దారులుగా జీతం పొందుతున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలని ఒప్పందం కుదిరిందని తెలిపారు. మా బ్యాంకులో ఖాతాదారుడైన విద్యుత్ శాఖ ఉద్యోగి రవీందర్ ఇటీవల ఆర్నెల్ల క్రితం చనిపోవడం జరిగింది. వారికి సాలరీ ప్యాకేజ్ అకౌంటు ఉన్నందున ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు బ్యాంకు సిబ్బంది విద్యుత్ ఉన్నత అధికారులతో చెక్కును వారి భార్యకు అందివ్వడం ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ మౌనిష రాకేష్ విద్యుత్ శాఖ ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.
పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంటప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి:మలా మహానడు ఝరాసగం మండలు అధ్యక్షులు బాబు సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గంగాపూర్ మలా మహానాడు సీనియర్ నాయకులు బాబు అన్నారు.ఎడతెరిపి లేకుంట కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రావొద్దని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని అన్నారు. సాధ్యమైనంత వరకు వాగుల ప్రవాహం ఆగిన తర్వాతనే దాటాలని కోరారు. అదేవిదంగా నిలకడ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని పంటలు అన్ని పూర్తిగా పాడయ్యాయని,రైతులు చాలా నష్టపోయారని,కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణమని అన్నారు.ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000అందించాలని, కౌలు రైతులకు ఎకరాకు 50000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
Pothole Damage? You Can Claim a Refund Under Consumer Law
The Danger of Potholes
Potholes on our roads are not just an inconvenience. They cause serious damage to vehicles and are responsible for many accidents every year. What most citizens don’t know is that they have a legal right to claim compensation—a refund for the damage suffered.
⚖️ Legal Responsibility
Under the Consumer Protection Act and the Motor Vehicle Act, the responsibility of maintaining safe roads lies with civic authorities. These include the Municipality, Roads & Buildings Department (R&B), and the National Highways Authority of India (NHAI). If these agencies fail to maintain roads properly, they can be held accountable.
What To Do If Your Vehicle Is Damaged
If your vehicle suffers damage due to a pothole, it is important to collect proper evidence:
Take photos and videos of the pothole.
Keep repair bills and receipts of the damage.
File a complaint with the concerned municipal or highway authority.
️ Next Step: Consumer Forum
If the authority does not respond or refuses to take action, you can approach the District Consumer Forum. With sufficient evidence, the forum can order the concerned department to pay compensation (refund of expenses) for your losses.
Example Cases
In several past judgments, courts have directed civic authorities to pay not just the repair costs, but in some cases also additional compensation for the mental agony caused. This sets a strong precedent that pothole-related damages are not just “bad luck” but a matter of consumer rights.
✅ Your Right as a Citizen
The next time your vehicle is damaged because of potholes, don’t remain silent. Collect evidence, file a complaint, and assert your rights. The Consumer Protection Act is there to protect you.
◆:- ప్రభుత్వం బాధ్యత వహిస్తూ నష్టపరిహారం అందించాలి
◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయింది వెంటనే పూర్తిగా చెత్తను తొలగించాలి ప్రజలు తమ ఇష్టారిథిగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయుచున్నారు ఇలా పాడవేయకుండా ప్రజలను చైతన్య పరచాలి జహీరాబాద్ పట్టణంలో మురికి కాలువలలో నిండుగా మురికి పేరుకుపోవడంతోని విపరీతమైన దోమలు ఏర్పడి ప్రజలకు డెంగు మలేరియా లాంటి వ్యాధులు సోకుతున్నాయి వెంటనే వీటిని నిర్మూలించాలి మురికి కాలువలు నిండుకుండ లాగా తయారైనాయి మురికి కాలువలు పూర్తిగా పైకప్పులతో మూసి వేయబడ్డాయి వాటిని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేయించాలి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పరిపాలన అధికారి జహీరాబాద్ పట్టణ పురవీధులను పరిశీలించాలి పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ పట్టణంలో గత నాలుగు రోజులుగా వేరువేరు స్థలాల వద్ద కొండముచ్చులు ప్రజల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి ఈ దాడిలో శాంతినగర్ హమాలీ కాలనీ రాంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలో దాదాపుగా పదిమందిపై అనగా మారుతి రావు సిద్దు శాంతాబాయి శంకర్ లక్ష్మి శంకరమ్మ జీవరత్నం గార్లపై కొండముచ్చులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినాయి గాయపడ్డ చాలామంది నిరుపేదలు ఉన్నారు రోజువారి కూలీలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు నష్టపరిహారాన్ని చెల్లించాలని సవినయంగా బాధితుల పక్షాన పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ ఘటనపై జాగో తెలంగాణ వ్యవస్థాపకులు పి. రాములు నేత మాట్లాడుతూ మూగజీవాలు ఈ రకంగా పట్టణంలో చేరి దాడి చేయడానికి తగు కారణం చూస్తుంటే జహీరాబాద్ పట్టణం ఎక్కడ చూసినా మురికితో నిండిపోయి ఉండడం కనబడుతుంది వాస్తవానికి జహీరాబాద్ పట్టణంలో పూర్తిస్థాయి చెత్త సేకరణ కార్యక్రమం జరగడం లేదు పురపాలక సంఘం అధికారులు ప్రజలకు ఎక్కడపడితే అక్కడ చెత్తను తినుబండరాలను పార వేయకుండా ఈ రకంగా పారవేసే వారి గురించి పురపాలక సంఘం అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టకపోవడం ప్రధాన కారణంగా కనబడుతుంది పురపాలక సంఘం పరిధిలో ఎక్కడ చూసినా విపరీతమైన చెత్త పేరుకుపోయి ఉన్నది మురికి కాలువలు మురికితో నిండుకుండ లాగా తయారైపోయాయి ఏ మూలమలుపులో చూసినా కూడా తినుబండారాలతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది దీనిని ఆసరా చేసుకొని వీధి పందులు వీధి కుక్కలు కొండముచ్చులు పశువులు ప్రజల నివాసాల మధ్య చేరిపోయి అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి ఇకనైనా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక పాలన అధికారి స్థానిక సంస్థల జిల్లా అధికారి జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే దసరా దీపావళి పండుగల సందర్భంగా జహీరాబాద్ లో పేరుకుపోయిన చెత్తాను పూర్తిగా తొలగించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలను చైతన్య పరచాలని ఇలాంటి కార్యక్రమం పురపాలక శాఖ తీసుకుంటే మా వంతు సహకారం గా మేము కూడా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా అడవి శాఖ వారికి బాధితులను ఆదుకోవాలని తెలపగా అందుకు సానుకూలంగా స్పందించిన సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు జహీరాబాద్ అటవీశాఖ సిబ్బంది బాధితులను కలిసి వారి వివరాలను సేకరించారు మా శాఖ తరపు నుండి బాధితులకు వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం చే పరిహారం ఇప్పించడం జరుగుతుందని జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు బాధితులతో మరియు వారి పక్షాన ఉండి పోరాడుతున్న జాగో తెలంగాణ నాయకులకు తెలిపారు కార్యక్రమంలో జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు పి. కృష్ణమ్మ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి. కిరణ్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్లు గంగాభవాని భాస్కర్ నిజాముద్దీన్ సంజీవ్ గార్లు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్ , గొల్లమల్లు , కాలనీవాసులు సిహెచ్ సంతోష్ ,సిహెచ్ జగదీష్ ,జామ్ గారి రాజ్ కుమార్ ,నారాయణపేట రాజ్ కుమార్ పాల్గొన్నారు,
బాధిత కుటుంబాలను పరామర్శించినబీజేపీ రాష్ట్ర నాయకులుచల్లనారాయణ రెడ్డి**
* మహదేవపూర్ సెప్టెంబర్ 13 (నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి రాంశెట్టి సమ్మయ్యని పరామర్శించి ప్రమాదంకు సంబదించిన పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో హాస్టల్స్ లో డైలీ వెజ్, కాoటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరానికై చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే వర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో గురువారం గోదావరి తీరా ప్రాంతంలో పిడుగు పాటుకు మృతి చెందిన 94 గోర్లు, వాటి కాపరులను పరామర్శించి, అనంతరం మాట్లాడుతూ పశు సంబంధిత అధికారులు, కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది,అలాగే 94 మృతి చెందిన గోర్లతో పాటు ఇంకో 30 గోర్లు కూడా చనిపోయే పరిస్థితి లో వున్నవి కాబట్టి వాటిని కూడా కలుపుకొని ఆర్థిక సహాయం చేయాలనీ, గొర్ల యొక్క విలువ మొత్తం 14 లక్షల నుంచి 15లక్షలు వరకు ఉంటుందని,కానీ ప్రభుత్వ సహాయం కింద గొర్రెకు 5000 వేలు నష్ట పరిహారం ఇస్తూ బాధిత కుటుంబలు 9 లక్షల వరకు నష్ట పోతుందని, ఆలా కాకుండా 14 లక్షలు అన్నిటి విలువ కట్టి ప్రభుత్వo ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, అలాగె బీజేపీ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్ శంకర్,లింగంపల్లి వంశీదర్ రావు,శ్రావణ్, బీజేపీ మండల నాయకులు ఆడప లక్ష్మి నారాయణ, కొక్కు శ్రీనివా స్, సాగర్ల రవీందర్, దాడిగేలా వెంకటేష్, రాకేష్, అయ్యప్పతో పాటు పలువురు పాల్గొన్నారు
సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం రాష్ట్రము అంతటా చెరువులు కుంటలు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ లు నిండు కుండల ఉండి మత్తళ్ళు దునుకుతుంటే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేప పిల్లలు రాక చేపల వృత్తే జీవనధారంగా కొన్ని లక్షల మంది మత్స్య కారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎన్నికలముందు వారు ఇచ్చిన హామీలు నమ్మి ప్రతి మత్స్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని ఒక్కవైపుగా మద్దతూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయినా మాట అందరికి తెలిసిందే. కానీ గత సంవత్సరం అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసి రకం చేప పిల్లలు పోయాడంతో పాటు కేటాయించిన చేప పిల్లలు పోయాక దొంగ లెక్కలు చూపి మత్స్యకారులను దగాచేసినారు ఈ సంవత్సరం జులై మాసం లొ పొసే సబ్సిడీ పిల్లలు సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికి ప్రభుత్వం ఇవ్వకపోవడం మత్స్యకారులు ప్రభుత్వం పై కన్నెర్ర చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జీవనధారం కోల్పోయిన మత్స్య కారులకు. భృతి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్
ములుగు టౌన్ నేటి ధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని భాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు,, మల్లంపల్లి మండలాల సంయుక్త సమావేశము గున్నాల రాజకుమారి,,అంకం పధ్మ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ పాఠశాలలలో వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు చిన్నచూపు అన్నారు అందుకే వారి సర్వీసు,సేవాభావానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హేళనగా చూస్తున్నారు అన్నారు,వంట కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్ళినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికే వంటలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా జరిగాయి అన్నారు రంగారెడ్ది జిల్లా శంషాబాద్ లో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గాంధినగర్ లో, హన్మకొండ జిల్లా కటాక్షపూర్ లో,నిన్న నిజామాబాద్ జిల్లా అమ్రాధ్ ఉన్నత పాఠశాలలో లలిత అనే కార్మికురాలు ఇలా గంజి పడి ఒకరు, కుక్కర్ పేలి ఒకరు కూర పడి ఒకరు ఇలా అనేక మంది వంట కార్మికులకు విపరీతమైన గాయాలై నడువలేని స్థితిలో ఉన్నారు అన్నారు ఇదంతా విధ్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్న సందర్భంలో జరిగినవే లక్షలాది రూపాయలు వారు స్వంతంగా పెట్టుకోవలసిన పరిస్థితితులు వీరు ప్రభుత్వం లో భాగస్వాములు కారా వారి ఖర్చులు ప్రభుత్వం భరించకూడదా అన్నారు కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి వంట కార్మికులకు భీమా కల్పించి పరిహరాలు అందించాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే లక్షలాది రూపాయలు స్వంత డబ్బులు పెట్టి వంటలు చేస్తుంటే ఆ బిల్లులు నేలల తరబడి పెండింగ్లో ఉండి అప్పుల పాలౌతుంటే, మల్లీ ప్రమాదాలు జరుగుచున్న సందర్భంలో ప్రభుత్వం భరించక పోతే ఎలా అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహరాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్రంలో ఉన్న 54200 మంది వంట కార్మికులను సమీకరించి ఏఐటియుసి నాయకత్వంలో ఉద్యమాలు నిర్వహస్తము అన్నారు,,ఈ సమావేశంలో గున్నాల రాజకుమారి,గుండ్రెడ్డి శ్రీనివాస్,మాలగాని కమల,పౌర రాధ,మాడిశెట్టి భాగ్య,సలువాల స్వరూప, కొత్త కనుకలక్ష్మి, కొత్త పూల,ఆసరి లక్ష్మి,ముత్యం రవీంద్ర,,అకఖం పధ్మ, బండి సరోజన,పోరిక ప్రమీల,భానోత్ బుల్లీ,భానోత్ కమల,సార సుగుణ,పల్లెవేణ మల్లిఖాంభ, తదితరులు పాల్గొన్నారు*
యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు
సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం
ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్
శాయంపేట నేటిధాత్రి:
నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్ డెత్ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్ డ్రైనేజీ వర్కర్స్, మిక్సర్ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్ డెత్, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్ సర్టిఫికే ట్ లేదా డాక్టర్ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్ షిప్ సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు అందజేసి లేబర్ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.
◆:- టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నుల్క మానిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో వివిధ
గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి భారి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెసర మినుము, పత్తి, సోయా, మొక్కజొన్న చాలావరకు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయింది. ఆగస్టులోనే రికార్డు స్థాయిలో వానలు కురిశాయి.
TRS party senior leader Nulka Manik Rao
సాధారణం కంటే 75% వర్షపాతం నమోదయింది .కావున తెలంగాణ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామాన్ని ఏ.ఈ.ఓ, ద్వారా సర్వే చేయించి అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, మాణిక్ రావు డిమాండ్ చేశారు.
కేబుల్ వైర్ల వ్యవహారంపై మరోసారి హైకోర్టులో విచారణ..
ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
శ్రీ కృష్ణజన్మాష్టమి పర్వదినాన రామాంతపూర్ శోభాయాత్రలో జరిగిన విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో..హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్‌ను పరిశీలిస్తూ, ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించటం శోచనీయమని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికింది. కేబుల్ వైర్ల పునరుద్ధరణకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ నాగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అనంతరం ప్రభుత్వ అధికారులు కేబుల్ వైర్లను కట్ చేయడంతో టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ మరోసారి హైకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరపనుంది.
రామంతపూర్‌లో ఇటీవల చోటు చేసుకున్న విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో హైకోర్టు వైర్లు తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. కేబుల్‌లలో విద్యుత్ ప్రసారం జరగదని.. ప్రమాదానికి కేబుల్ వైర్లు కారణం కానే కాదని స్పష్టంచేశారు. వీటి తొలగింపుతో లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో వైపు,ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రాణనష్టం ఘటనను సీరియస్‌గా తీసుకున్న కమిషన్, బాధిత కుటుంబాలకు పరిహారంపై, ప్రమాదానికి దారితీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, విద్యుత్ శాఖను కూడా భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేబుల్ తొలగింపు విషయంలో హైకోర్టు కూడా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజల ప్రాణాలు పోతుంటే కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యతను విస్మరించి ప్రజల భద్రత ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని పూర్తిగా తప్పుపట్టింది.
అయితే, అధికార అనుమతులతోనే కేబుళ్లు అమర్చామని.. ప్రతి స్తంభానికి ప్రభుత్వానికి రూ.1100 చొప్పున మొత్తం రూ.21కోట్లు చెల్లించామని భారతి ఎయిర్‌టెల్ వాదిస్తోంది. చెల్లింపుల వివరాలను గత విచారణలోనే హైకోర్టులో నివేదించింది. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం అప్పటికప్పుడు కేబుల్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వం నిబంధనను పట్టించుకోని కారణంగా తమ కస్టమర్లు అసౌకర్యానికి గురయ్యారని విన్నవించింది. డాక్టర్లు, న్యాయవాదులు, మీడియా, వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు– ఇంటర్నెట్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ తరఫున న్యాయవాది వాదిస్తూ, ఒకే స్తంభానికి అనధికారికంగా అనేక కేబుళ్లు అమర్చారని, ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందని పేర్కొన్నారు. దీంతో, జస్టిస్ నాగేశ్ భీమపాక పునరుద్ధరణపై తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. అన్ని పక్షాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించిన అనంతరం మాత్రమే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.