పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం భూపాలపల్లి జిల్లా లోని, మొగుళ్లపల్లి మండలం, రంగాపురం గ్రామంలో వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. యు నాగభూషణం మాట్లాడుతూ రైతులు కలుపు యాజమాన్యం పై రైతు జాగ్రత్త వహించాలని.. గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ (రైస్ స్టార్) అనే మందును ఎకరాకి 350 మిల్లీమీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే వెడల్పాటి ఆకు కలుపు మరియు తుంగ నిర్మూలనకై ట్రై ఫోమో + ఈత్ ఆక్సీ సల్ఫురాన్
( కౌన్సిల్ ఆక్టివ్) మందును ఎకరానికి 90 గ్రాములు చొప్పునరో డువందలులీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.. అలాగే పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చేచే పురుగుల నివారణకై వేప నూనె (1500 పి పి ఎం) ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాక మూడు వందల గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని. అంతేకాకుండా 1:4 నిష్పత్తిలో మోనోక్రోటఫాస్ లేదా 1:20 నిష్పత్తిలో ఇమిడా క్లోరోప్రీడ్ లేదా ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకొని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేత కారణానికి అంటే విధంగా మొక్కలకు పూసుకోవాలి అని సూచించారు. ఈ బృందం సభ్యులు శాస్త్రవేత్త డా// ఆర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, తో పాటు ఏ ఈ ఓలు, అభ్యుదయ రైతులు పోలినేని రాజేశ్వర్ రావు,ఎర్రబెల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ.!

ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

M R P S మండల ఇంచార్జ్ రేణుకుంట్ల సంపత్
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ శ్రీ మంద కృష మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మండల ఇంచార్జ్ రేణుకుంట్ల సంపత్ మాదిగ హాజరైజెండా ఆవిష్కరణ చేశారు స్వీట్ల పండ్లు పంపిణి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తదనంతరం మండల సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి సామాజిక ఉద్యమాల ద్వారా సకల జనులకు మేలు చేశారని ఆరోగ్యశ్రీ పథకం వికలాంగులు వితంతువులు గుండె జబ్బు పిల్లల కోసం ఇలా సమాజానికి సేవ చేయడం సమాజం అండగా ఉండడం ద్వారా వర్గీకరణ సాధించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో B J P భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి B J P జిల్లా నాయకులు శవ శేషగిరి ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జీడీ సంపత్ మాదిగ అంతడుపుల సారంగపని మాదిగ రొంటాల రాజ్ కుమార్ మాదిగ మంద సాంబయ్య మాదిగ బండారి రామస్వామి మాదిగ పుల్యాల భగత్ మాదిగ వివిధ గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే ‌‌.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లోని పర్లపల్లి గ్రామంలో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కాంతాలా సతీష్ రెడ్డిగారి కూతురినీ ఆశీర్వదించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ కార్యక్రమంలో చిట్యాలవ్యవసాయ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి వైస్ చైర్మన్ మమ్మద్ రఫీ మొగుళ్ళపల్లిసొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు జిల్లా నాయకులు తక్కలపల్లి రాజుమండల అధ్యక్షుడు ఆకుతోట కుమార్ స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ జిల్లా బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ మండల నాయకులు పాల్గొన్నారు

అంతిమ యాత్రలో పాల్గొన్న నాగుర్ల

అంతిమ యాత్రలో పాల్గొన్న నాగుర్ల
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో గురువారం గుండెపోటుతో మరణించిన గండు శ్రీహరి గౌడ్ (85) అంతిమ యాత్రలో తెలంగాణ రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు ( నవత వెంకన్న ) పాల్గొన్నారు. మృతుని కుమారుడు గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు గండు శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి..ఓదార్చారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. నాగుర్ల వెంట చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version