అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు
*వాహనదారులు ప్రజల భయాందోళన
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండల
అధ్యక్షులు రావుల జానకి రావు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.
ములుగు జిల్లాలో, ముఖ్యంగా మంగపేట మండలకేంద్రంలో వందలాది ఇసుక లారీలు రోడ్లపై తిరుగుతూ వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లారీల పైన పట్టాలు కట్టకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల వాహనదారుల కళ్లలో ఇసుక రేణువులు పడుతూ నిత్యం ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. పాదాచారులు సురక్షితంగా రోడ్లను ఉపయోగించలేక, భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతున్నాయని బిజెపి నేతలు కార్యకర్తలు అన్నారు.
ఇలాంటి ఇసుక లారీల వల్ల ప్రజలకు, వాహనదారులకు కలిగే భీభత్సాన్ని గుర్తుచేసి, వెంటనే లారీలను నియంత్రించి, సరైన పార్కింగ్‌లో ఉంచేటట్టు, రోడ్ల భద్రతను, ప్రజలకు సౌకర్యాన్ని కల్పించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.