సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాట,దీపావళి బోనస్ చెల్లించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T124741.237.wav?_=1

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాట,దీపావళి బోనస్ చెల్లించాలి

ఫిట్ కార్యదర్శి మారేపల్లి సారయ్య

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

తమ జీవితకాలంలో దీర్ఘకాలికంగా సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందిన పదవీ విరమణ పొందిన గని కార్మికులకు యాజమాన్యం లాభాల వాటా,దీపావళి బోనస్ ను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం (ఎఐటియుసి) ఆర్కే -7 ఫిట్ కార్యదర్శి మారేపల్లి సారయ్య అన్నారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తూ అనారోగ్య కారణాల చేత అన్ఫిట్ అయిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికులను యాజమాన్యం గుర్తించి సంస్థగతంగా ఆర్థికపరమైన ప్రయోజనాలను కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.పదవి విరమణ పొందిన కార్మికల సంక్షేమ ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.పదవి విరమణ కార్మికులు నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ యొక్క సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T122024.059.wav?_=2

 

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం సిఎంఓఎఐ జనరల్ బాడి మీటింగ్,జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిపించారు.ఈ సమావేశంలో లో జనరల్ సెక్రటరీ సంతోష్ ఇదివరకు జరిగిన కార్యక్రమాలను జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించారు.తదుపరి జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) &(ఓ&ఎం) మదన్మోహన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,జాయింట్ సెక్రటరీ పదవులకు నామినేషన్ కోరడమైనది.దీనికి అధికారుల సంఘం సభ్యులందరూ సిఎంఓఎఐ ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా డి.పంతులా ని ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.వైస్ ప్రెసిడెంట్ గా జనగామ శ్రీనివాస్ ని,జాయింట్ సెక్రటరీ గా శ్యామల ని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ధారావత్ పంతులా మాట్లాడుతూ.. అధికారుల సంఘం సభ్యులకి ఎస్టిపిపి యాజమాన్యానికి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అందరి సహాయ,సహకారాలతో సెంట్రల్ కమిటి సభ్యులతో,యాజమాన్యాన్ని సమన్వయ పరుస్తూ పెండింగ్ లో ఉన్న పనులను, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సాధించుకోవడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడి సిహెచ్.చిరంజీవి,జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) & (ఓ&ఎం)మదన్మోహన్,ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డిజిఎం (సివిల్) ఆజాజుల్లా ఖాన్,డీజీఎం(పర్సనల్),డి కిరణ్ బాబు,కార్యవర్గ సభ్యులు డి.పంతులా,సంతోష్ కుమార్,జనగామ శ్రీనివాస్,అప్పారావు,రమేష్,శ్యామల,మోబిన్ పాల్గొన్నారు.

దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం…

దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం

జైపూర్,నేటి ధాత్రి:

దాబాలపై పోలీసుల దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ గురువారం తెలిపారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…

ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.క్వారీలో షవల్స్,డంపర్లతో సహా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.ప్రస్తుతం రోజుకు పదివేల క్యూబిక్ మీటర్ల ఓబి తొలగింపుతో పాటు 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా, వర్షం వల్ల ఇది పూర్తిగా ఆగిపోయింది.క్వారీలో చేరిన నీటిని భారీ పంపులతో బయటకు తోడేస్తున్నారు.వర్షం పూర్తిగా తగ్గితేనే ఉత్పత్తి పునరుద్ధరణ సాధ్యమవుతుందని మేనేజర్ శ్రీనివాస్ గురువారం తెలిపారు.

డిగ్రీ ఫీజుల తేదీ పొడిగించాలని పి డి ఎస్ యూ డిమాండ్…

డిగ్రీ ఫీజుల తేదీ పొడిగించాలని పి డి ఎస్ యూ డిమాండ్

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా చెన్నూర్ డిగ్రీ కళాశాలలో పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ…
కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజులు నేటితో ముగియడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు.బడుగు, బలహీన,వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు జి.అంజి,అసిఫ్, విజయ్,జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ పై హెల్మెట్ ధరించి వెళ్తూ నేటి ధాత్రి కెమెరా లో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి…

సైకిల్ పై హెల్మెట్ ధరించి వెళ్తూ నేటి ధాత్రి కెమెరా లో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

సమాజానికి ఆదర్శవంతంగా నిలిచిన

అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కోటి వెంకటేశ్వర్లు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ లో సైకిల్ పై ప్రయాణిస్తూ హెల్మెట్ ధరించి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి శనివారం నేటి ధాత్రి కెమెరాకి చిక్కారు.నేటి ధాత్రి రిపోర్టర్ నరేష్ గౌడ్ వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.తన పేరు కోటి వెంకటేశ్వర్లు గ్రూప్ 2 ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా మంచిర్యాల,ఆసిఫాబాద్ సిటిఓ ఆఫీసులో వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.తను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని వారికి కారు,బైకు ఉన్నప్పటికీ కాలుష్యాన్ని తగ్గించాలని మంచి ఆలోచనతో అప్పుడప్పుడు తన నివాసం శ్రీరాంపూర్ నుండి మంచిర్యాల్ వరకు సైకిల్ పై హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తుంటానని,అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, బైకుపై హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తూ నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని,హెల్మెట్ ధరించి చేసే ప్రయాణంలో ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించిన ప్రాణాలతో బయటపడవచ్చునని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు తెలిపారు.వారు ఈ విధంగా ప్రయాణం చేయడం వల్ల కొంత మందిలో నైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో హెల్మెట్ ధరించి సైకిల్ పై ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు.

పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు….

పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు

నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు వినతి పత్రం అందించిన రైతులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొండపేట, నాగంపేట,ఏసన్వయి,ఏడగట్ట, పిన్నారం గ్రామాలలో భారీగా అడవి పందులు పత్తి పంటను నష్టం చేశాయని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డివై ఎఫ్ఆర్ఓ లావణ్య కి వ్యవసాయ శాఖ అధికారి ఏవో సాయి రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు.పలు గ్రామాల రైతులకు జరిగిన నష్టానికి అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి వెంటనే తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సాంబ గౌడ్,కోటపల్లి మండల సీనియర్ నాయకులు కొట్టే నారాయణ,అజ్మీర, పున్నం,అన్వర్,ఆలీ,పోచం, కొట్రాంగి మల్లేష్,దేవయ్య, రూపా నాయక్,భూమయ్య, రైతులు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మీడియాపై దాడులు హేమమైన చర్య…

మీడియాపై దాడులు హేమమైన చర్య

ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

కార్తీక మాసంలో దీప దానంతో లక్ష్మీదేవి అనుగ్రహం…

కార్తీక మాసంలో దీప దానంతో లక్ష్మీదేవి అనుగ్రహం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

కార్తీక మాసంలో మహిళలు వేకువనే లేచి స్నానం ఆచరిస్తారు.ఈ మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించాలి.తర్వాత దీపారాధన చేయాలి.దీప దానానికి ఈ పవిత్ర మాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో లేదా ఇంట్లో తులసి మొక్క దగ్గర ప్రతిరోజూ దీపదానం చేయాలి.ఇలా చేస్తే జీవితంలో,ఇంట్లో చీకటి తొలగిపోతుందని,లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరిసంపదలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో బుధవారం ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తోళ్ళ వాగు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన చింతల మోజెస్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.అతనిపై కేసు నమోదు చేసి,బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు…

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీలను నియమిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువకులు, నాయకులు పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా తమ వంతు కృషి చేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు.అలాగే మంచిర్యాల జిల్లాలోని చున్నంబట్టి లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి లను ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం చేపట్టనున్నారు.23న గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ జిల్లాలో నియోజకవర్గం ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని తెలిపారు.

తప్పుడు సర్టిఫికేట్ తో రుణం పొందిన మహిళకు జైలు…

తప్పుడు సర్టిఫికేట్ తో రుణం పొందిన మహిళకు జైలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తప్పుడు కుల ధ్రువపత్రంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 5 లక్షల సబ్సిడీ రుణం పొందిన మంచిర్యాల పట్టణానికి చెందిన చిలుకమర్రి రాధకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిరోషా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించారు.ఈ విషయాన్ని సిఐ ప్రమోద్ రావు శనివారం తెలిపారు.రాధ నకిలీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం సృష్టించి రుణం పొందినట్లు రెవెన్యూ,బ్యాంక్ అధికారుల విచారణలో తేలినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మిత్రబృందం చేయూతగా నిలిచిన స్నేహితులు

ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి చేయూతగా నిలిచిన మిత్రబృందం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతెన శ్రీనివాస్ మరణించడంతో వారి బాల్య మిత్రులు 1991 టు 1992 బాయ్స్ హై స్కూల్ మిత్రులందరు శ్రీనివాస్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు శ్రీనివాస్ కుటుంబానికి శుక్రవారం అందజేశారు.కష్ట కాలంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని వారి వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కష్టాల్లో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మిత్రులందరికీ తెలియజేశారు ఇకముందు కూడా శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్న మిత్రుల సహాయంతో సహాయ సహకారాలు అందిస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ నాట్య మయూరి..కూచిపూడి నర్తకి అకిరా జాను….

తెలంగాణ నాట్య మయూరి..కూచిపూడి నర్తకి అకిరా జాను

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ మంచిర్యాల జిల్లా కు చెందిన అకీరా జాను చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా ప్రముఖమైన
కూచిపూడి నర్తకి గా గుర్తింపు పొందింది.అకీరా తన నాట్య ప్రయాణాన్ని చిన్నతనంలోనే ఏడవ సంవత్సరంలో ప్రారంభించి,ఇప్పటివరకు సుమారు 100 కీ పైగా నృత్య ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొంది.కళా సంస్కృతి, సాంప్రదాయాల విలువల అభివృద్ధికి కృషిచేస్తూ,వివిధ సంస్కృతిక కార్యక్రమాలలో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది.ప్రఖ్యాత గురువుల నుంచి శిక్షణ పొంది,శాస్త్రీయ నాట్యంలో విశిష్టమైన తనదైన శైలితో కళకు జీవం పోస్తుంది.బాల్యంలో నుండే అకీరా పలు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల పురస్కారాలు,ప్రశంస పత్రాలు అందుకుంది.తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఉత్తమ కూచిపూడి నృత్య ప్రదర్శన కళాకారిణిగా గుర్తింపు పొందింది.రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం ఆమెను నామినేట్ చేయడం ఈ ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకం.అనేక పత్రికలు అకిరా నృత్య ప్రదర్శన పై ప్రత్యేక కథనాలు,శీర్షికలు ప్రచురించాయి.ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్‌లో మరిన్ని దేశ,విదేశీ వేదికలపై కూచిపూడి కళను ప్రదర్శించి భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేయాలని,ఈ సంప్రదాయ నృత్యాన్ని మరింతగా గ్రామ స్థాయి యువతలోకి తీసుకెళ్లాలని అకీరా ఆకాంక్షిస్తుంది.

బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే పై బీసీ సంఘాల రాస్తారోకో…

బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే పై బీసీ సంఘాల రాస్తారోకో

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్,బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తారోకోను శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్,బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా పోవడం వల్ల బీసీలు వెనుక పడుతున్నారని,తెలంగాణ రాష్ట్రం లో అనేక రకమైన బీసీ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఆ మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకొచ్చారన్నారు.స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అగ్రవర్ణాలైనా రెడ్డిలు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం జరిగింది.గురువారం హైకోర్టులో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఆపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపి వేశారన్నారు.తీర్పు బీసీ మెజార్టీ ప్రజల మనోభాలకు వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్,బిజెపి పార్టీలు ఇప్పటికైనా మెజారిటీ ప్రజలైన బీసీలకు అనుకూలంగా వ్యవహరించి బీసీలకు దక్కాల్సిన విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపిలో ఉన్న బీసీ నాయకులందరూ ఏకతాటిపై వచ్చి బీసీ ప్రజలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించడంలో ముందు ఉండాలని,లేనిపక్షంలో బీసీ ప్రజల ముందు మిమ్ములను దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.ఇప్పటికైనా హైకోర్టు కు అన్ని రాజకీయ పార్టీలను బీసీ రిజర్వేషన్ల పైన తమ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని బీసీ సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీల రిజర్వేషన్ల ను 9 షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు.కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపి పార్టీలు బీసీల ప్రజల మనోభాలతో చెలగాటం ఆడితే రాబోవు కాలంలో రాష్ట్రాన్ని స్తంభింప చేయడం జరుగుతుందని,అగ్రవర్ణాలు కూడా బీసీలకు రావాల్సిన హక్కులకు అడ్డుపడితే తెలంగాణలో అగ్రవర్ణ ఎమ్మెల్యేలు,ఎంపీలకు ఓట్లతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కర్నే శ్రీధర్,ఏదునూరి రమేష్,విద్యార్థి ఉద్యమ నాయకుడు చేరాల వంశీ,బొలిశెట్టి లక్ష్మణ్,గరిగే చేరాలు,వైద్య భాస్కర్,వైద్య రవి,కట్కోజుల రమణాచారి, కంటి రవీందర్,నరసింహ చారి,రాళ్ల బండి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

తాండూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద సిఐ దేవయ్య ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య పటిష్ట బంధవస్తు నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్సై లు హెచ్చరించారు.అలాగే తాండూర్ మండల కేంద్రంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్…

చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న పెద్దింటి ప్రభాకర్

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పెద్దింటి ప్రభాకర్(64)అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వారు సేకరించిన వివరణ ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడానికి అలవాటు పడడంతో కుటుంబ సభ్యులు అతన్ని మందలించారని తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి భార్య రాజేశ్వర్ తో పాటు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

కన్నెపల్లి మండలంలో బిజెపి మండల సమావేశం…

కన్నెపల్లి మండలంలో బిజెపి మండల సమావేశం

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పిలుపు మేరకు కన్నెపల్లి మండల అధ్యక్షులు మైధం ఆశన్న ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కన్నెపల్లి మండల ఎన్నికల ప్రభారి జిల్లా కార్యదర్శి,రామగౌని మహీధర్ గౌడ్ రావడం జరిగింది. కన్నెపల్లి మండలంలోని 5 ఎంపిటిసి స్థానాలలో ఆశావాహుల అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు.ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు,ప్రజా సమస్యల పరిష్కారం కీలక అంశాలపై చర్చించి, ఎంపీటీసీ,జెడ్పిటిసి గా పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు సేకరించడం జరిగింది.పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేలా మండలం లోని ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బేరే రామన్న యాదవ్, జిల్లా మండల నాయకులు బర్ల పోషన్న,అరికల భీమన్న,బర్ల సంతోష్,ఇందురి సత్తయ్య, పాముల మల్లేష్,ఎం. భాస్కర్,దాసరి రాజు, శ్రీనివాస్,సౌల్ల తిరుపతి, ఇందురి విజయ,గంగాధర్, పోశం,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version