ఇది చెట్ల పొద కాదు.. అది బావి..
*కనీసం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చెయ్యని అధికారులు..
*ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా..?
పరకాల,నేటిధాత్రి
పరకాల మండల పరిధిలోని ఓ రహదారిపై బావి వాహనదారులు ప్రమాదకరంగా మారింది.చూడడానికి చెట్ల పొదల కనిపించే బావి రహదారి పక్కనే సాధారణ కంచె ఏర్పాటు చేసి దర్శనమిస్తుంది.పరకాల పట్టణం నుండి మొగుళ్లపల్లి,చిట్యాల మండలాలకు,అలాగే సమీప గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ బావి హనుమాన్ కమాన్ సమీపంలో ఉంది.బావి నిర్మాణం సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై బలహీనపడిందని చెప్పవచ్చు రోడ్డుకు చాలా సమీపంలో ఉండడం వల్ల వాహనాలు,ముఖ్యంగా రాత్రిసమయాల్లో లేదా వర్షకాలంలో తారసపడే ప్రమాదం అధికంగా ఉందని, బావి చుట్టూ రక్షణ గోడ మరియు కనీసం హెచ్చరిక బోర్డు లేకపోవడం ప్రమాద సంకేతాలను మరింత పెంచుతోందని చెప్పవచ్చు ప్రతిరోజూ ఈ రహదారిపై వాహనాలు,ఆటోలు,ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు వెళ్తుంటాయి.ఆ సాధారణ కంచెను తొలగించి బావి చుట్టూ సిమెంట్ గోడ ఏర్పాటు,రహదారిపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులు పెట్టడం,రాత్రి సమయంలో లైట్లు అమర్చడం వంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని చెబుతున్నారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను మరియు స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
