రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు
తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీ మరియు మాదారం గ్రామంలో ప్రధాన రహదారులపై,కాలనీల్లో ఆవులు నిర్బంధం లేకుండా సంచరించడం వలన వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్ అన్నారు.ముఖ్యంగా రాత్రి సమయంలో ఆవుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని,ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు.కాబట్టి దయచేసి ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకొని,ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేసి,అవసరమైతే జరిమానాలు విధించడం గాని లేదా ఆవులను గోశాలలో ఉంచే చర్యలు గాని తీసుకోవాలని ఎంపీడీఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.