కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్, బహువార్షిక పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయల సాగు ప్రభుత్వ ప్రోత్సాహకా లు ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం వరి నుండి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు & మల్బరీ సాగు చేయాలి.
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
గురువారం తొర్రూరు మండలంలోని వెంకటాపురం, మాటేడు, హరిపిరాల, తదితర గ్రామాలలో సాగులో ఉన్న ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న పరిశీలించారు.
ఈ సందర్బంగా రైతులకు సాగుపై పలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులు నికర ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ ద్వారా టమాట, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవవర్, తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయల నారు మొక్కలను ఎకరానికి 8000 మొక్కలను ములుగు, సిద్ధిపేట జిల్లా నుండి రాయితీ పై సరఫరా సౌకర్యం ఉన్నదని తెలిపినారు. అలాగే తీగ జాతి కూరగాయల సాగుని శాశ్వత పందిరిని నూతనంగా నిర్మించి సాగు చేసే రైతులకు అర ఎకరానికి రూ. 50,000/- రాయితీని రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కల్పించబడునని తెలిపారు. పామాయిల్ తోటలలో మొదటి నాలుగు సంవత్సరాలలో అంతరపంటల కింద కూరగాయలు సాగు చేసే ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 2,100/- అందించబడునని తెలిపారు.
ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు సర్వేశ్వర రావు, యాకయ్య, టి. జి. ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి సి.హెచ్. రాములు, క్షేత్ర సిబ్బంది వెంకట్, అఖిల్, రంజిత్, ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధులు జి. ప్రసాద్ బాబు, జి. శరత్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆదేశాలతో డాక్టర్ అమరేందర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న జిల్లా క్షయ అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీరాములు మరియు జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించి పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా కల్పించారు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల డ్రాప్ అవుట్ వెరిఫికేషన్ గ్రామంలో ఆంటీ లార్వా రిమూవ్ శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత గవర్నమెంట్ డెలివరీ టీబి కేసెస్ ఫాలో ఆఫ్ . ఫీవర్ కి ఎస్ ఎస్ వెరిఫికేషన్ చేయడంతో పాటు క్యాంపును సందర్శించారు మెడికల్ క్యాంపులో 82 మందికి ఓపి చూడగా 12 మంది రక్త నమూనాల సేకరించి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ మందులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది. గ్రేస్మని శ్రీనివాస్ రమ స్వప్న సంధ్య విజయ పాల్గొన్నారు
భారత రాజ్యాంగ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ గ్రామీణ ఎస్ఐ యం కాశీనాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిది రంజోల్ లో గల శ్రీ సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ కాశీనాథ్ విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న విద్యాహక్కు చట్టం ఆర్టికల్ 21 ఏ ద్వారా మనం ఇంత స్వేచ్చగా విద్యను అభ్యసించ గలుగుతున్నామని ఎస్ఐ ఆన్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో ఉచిత విద్యను అందిస్తూ, అనేక ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది విద్యా హక్కు చట్టం ద్వారానే అని పేర్కొన్నారు. విద్యార్థులకు సైబర్ అవేర్నెస్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006, ది తెలంగాణ ప్రివిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్-1997, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-2009, చైల్డ్ లేబర్ యాక్ట్-2016, పీఓసీఎస్ఓ ఆక్ట్-2012 మరియు మోటార్ వెహికల్ యాక్ట్ లాంటి చట్టాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు సుమారు 150 మంది పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన మండల వైద్యాధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ సంధ్య
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ,డాక్టర్ సంధ్య గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని మంగళవారము నిర్వహించినారు. గ్రామంలో 53 మందికి వైద్య పరీక్షలు చేసి, జరపీడుతులకు రక్త నమూనాలు ఒకటి తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,సిజను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం స్వరూప ,ఆశాలు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు. దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది. మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంజేపి (మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే) పాఠశాలలో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 110 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగినది. విద్యార్థులకు సీజన్ వ్యాధుల గూర్చి అవగాహన కల్పించడం జరిగినది ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని తెలియజేసినారు . విద్యార్థులకు ఎవరికైనా జ్వరం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని డాక్టర్ నాగరాణి గారు సూచనలు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ప్రిన్సిపల్ శారద ,సూపర్వైజర్ సునీత, ఏఎన్ఎం శ్రీలత ,స్టాఫ్ నర్స్ అశ్ర ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం*
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయని అన్నారు.జీవన శైలి వ్యాధులు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్స్ , ఆత్మహత్య ఆలోచనలు ఎక్కుగా ఉంటున్నాయని అన్నారు. ప్రతికూల ఆలోచనల్ని విడనాడి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక జీవన శైలి వ్యాధుల బారి నుండి బయట పడవచ్చని అన్నారు.కార్మికుల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మైండ్ కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటం సహజమని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కారమార్గాల మీద దృష్టి నిలిపి ఓపికతో పరిష్కరించుకోవాలని అన్నారు.కార్మికుల్లో పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉందని, తమ ఆదాయంలోంచి ఎంతో కొంత పొదుపు చేయడం అలవర్చుకోవాలని అన్నారు.సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో శారీరక, మానసిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి మానసిక సమస్యలు ఎదురైనా వాయిదా వేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు. మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, ఎటువంటి మానసిక సమస్య ఎదురైనా తమను సంప్రదించాలని కార్మికులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కార్మికులు పాల్గొన్నారు.
డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్సై సంతోష్
శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్,గంజాయి,మద్యం ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు.రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.విద్యార్థులు,యువత,కార్మికులు,పౌరులు చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని అన్నారు.మత్తు పదార్థాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.విద్య సంస్థలలో అవగాహన సదస్సు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్ధలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే కేసులో ఇరుకుతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేస్తూ తరచూ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు వినియోగించరాదు గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని అందులో నుంచి బయటకు వచ్చేందుకు పునరావాస కేంద్రాలకు పంపిస్తూ ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
ఉత్తమ సమాజ నిర్మిద్దాం విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి : ఎస్సై రాజు మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
వర్దన్నపేట (వరంగల్ జిల్లా ) ,నేటిధాత్రి:
వర్ధన్నపేట పట్టణంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా (యాం టీ డ్రగ్ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా వెస్ట్ జోన్ జనగాం, మరియు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ వరకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించే ర్యాలీ విద్యార్థులు, పోలీస్ అధికా రులతో కలిసి ఇవాళ (గురువారం) నిర్వహించబడిరది. ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింప చేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం-మనందరి బాధ్యత డ్రగ్స్‌కి నో చెప్పండి,ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్, నినాదాలు చేశారు.డ్రగ్స్,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపుని చ్చారు . అనంతరం వారు మాట్లడుతూ. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ , ఎస్సై రాజు , పోలీస్ సిబ్బంది, విద్యార్థులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో విద్యార్థినీ విద్యార్థులకు మందమర్రి పోలీస్ అధికారులు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రుల పిల్లలకు సూచించారు గంజాయి మత్తులో పడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు ఇటువంటి అరాచకాల్ని అరికట్టడానికి మేము శాశ్వత ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలని తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి, సింగరేణి జిఎం, లైన్స్ క్లబ్ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది.
పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు
ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోలో బుధవారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోత్క పల్లి – కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందన్న సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పై దికొండ రమేష్ నేతృత్వంలో (బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సబ్ స్టాన్స్ అబూస్ ఆర్ వన్ బ్యాడ్ ఛాయిస్ కాన్ చేంజ్ ఏ లైఫ్) అనే నినాదాలతో స్థానిక జడ్.పి. హెచ్.ఎస్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మాబ్ (నృత్య ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రదర్శన పొత్కపల్లి సెంటర్లో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. అవగాహన సభలో ఎస్పై రమేష్ మాట్లాడుతూ, “డ్రగ్స్ వాడకాన్ని యువత ఫ్యాషన్గా తీసుకోవడం ప్రమాదకరం. ఇది భవిష్యత్తును నాశనం చేస్తుంది. మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, నేరాలకు దారి తీస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు మార్గనిర్దేశం చేయాలి,” అని అన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్ లో స్థానిక ఎస్ ఐ వారి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిర్మూలనకై, ఆన్లైన్ లో జరిగే ఆర్ధిక మోసాల పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ మాట్లాడుతూ మత్తును కలిగించే మారక ద్రవ్యాలను వాడకూడదని వాటిని వినియోగిస్తే కలిగే అనర్థాలు ఎంతో వివరించడం జరిగింది. ఆర్ధిక మోసాలకు కారణమైన అనవసరపు మెసేజ్ లు, వాటి లింకులు ఓపెన్ చేసి రిప్లై ఇస్తే కలిగే ఆర్ధిక నష్టాల పట్ల అవగాహన కలిగించారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ.తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని చదువుకోసం కేటాయించి గొప్ప ప్రయోజకులు కావాలని అందుకోసం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. మారక ద్రవ్యాలు వినియోగిస్తే మన శరీరంపై కలిగే దుష్ప్రభావాలను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
సైబర్ క్రైమ్ నేరాలపై పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్సై రాజేష్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసగిస్తున్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఓటిపిలు చెప్పొద్దన్నారు . అలాగే సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేయాలని ఆయన సూచించారు
వర్షాకాలం సీజన్ దృశ్య ఆతిసార వ్యాధి రాకుండా ఓ ఆర్ ఎస్ జింక్ కార్నర్ ను మండల వైద్యాధికారి అమరేందర్ రావు ఆదేశాను సారము హెచ్ డబ్ల్యూ సి ఇంచార్జ్ బొల్లం దీప్తి జింక్ కార్నర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనా ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది ముత్తారం మండలం మచ్చుపేటలో ఎచ్ డబ్ల్యూ సి సెంటర్ లో ఎమ్ ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి మాట్లాడుతూ ఓ ఆర్ ఎస్ అనేది నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇది ద్రవాలు మరియు లవణాలను తిరిగి నింపడం ద్వారా మితమైన నిర్జలీకరణం మరియు అతిసారం యొక్క చికిత్సకు సహాయపడుతుంది. జింక్ అనేది శరీరానికి అవసరమైన ఒక పోషకం, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఓ ఆర్ ఎస్ మరియు జింక్ రెండూ కలిసి అతిసారం యొక్క చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి, ముఖ్యంగా పిల్లల విషయంలో. ఓ ఆర్ ఎస్ (నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్):అతిసారం ద్వారా కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది, ఇది నిర్జలీకరణం మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది. దీనిని నీటిలో కరిగించి త్రాగాలి. ద్రవ స్థాయిలను తిరిగి నింపడానికి క్రమం తప్పకుండా త్రాగాలి అని ఓ ఆర్ ఎస్ అతిసారం చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం, ఇది పిల్లలలో మరణాల సంఖ్యను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, అతిసారం యొక్క వ్యవధిని తగ్గిస్తుంది మరియు తీవ్రతను తగ్గిస్తుంది రోజుకు ఒకసారి జింక్ టాబ్లెట్ నీటిలో కరిగించి త్రాగాలని సూచించారు ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ సతీష్ లో సిబ్బంది పుష్పలత లత టీచర్ కళావతి లు పాల్గొన్నారు
◆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫె: ఐదాస్ జానయ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలోని బిలాల్ పూర్ గ్రామంలో రైతుల అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం, సాగు చేస్తున్న పంటలను ఎ విధంగా సంరక్షించుకోవాలి, మరియు వ్యవసాయ పంటలకు సరిపడ ఎరువులను ఎలా వాడాలని శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు బహు చక్కగా ఉపయోగపడే ఇలాంటి అవగాహన కార్యక్రమాలను చేయడం శుభపరిణామం అని, కాలనుసారంగా ఎలాంటి పంటలను వేయాలో ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులు తెలుసుకోవచ్చు అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ గారు,బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్ర్తావేత్త విజయ్ కుమార్, మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ,సామెల్ గారు,కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ ఎంపీటీసీలు మలన్న పాటిల్, అశోక్, అనిల్ ,కోహిర్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి గారు,శంశీర్, మునీర్ పటేల్ ,ముర్జల్,అశోక్,మోసిన్ ,వీరారెడ్డి , దయానంద పాటిల్, నరసింహా రెడ్డి,మరియు INTUC (F) రాజ్ కుమార్ కోహిర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.
రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం. రేపాక గ్రామంలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క బాబు చెక్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల మరియు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జూన్ 13న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు 10 అంశాల పైన అవగాహన కల్పించారు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోని యూరియాను ఉపయోగించడం పచ్చి రొట్ట ఎరువుల వర్మి కంపోస్ట్ పశువుల ఎరువుల వాడడం భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటకు. ఎరువులు అందించడం రసాయన ఆధారిత పురుగుమందులను అవసరం మీదకు మాత్రమే ఉపయోగించడం మరియు పంటల్లో పద్ధతులు పాటించడం పంట వైభవ సమయంలో. పంట బీమా పొందడానికి మరియు నష్టపరిహారం కోసం పంట కోసం కొనుగోలు చేసిన వివిధ విత్తనాల రసాయనిక ఎరువుల మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం సాగునీటి యజమాన్యం. బిందు మరియు తుంపర్ సేద్యం మల్చింగ్ పద్ధతుల సుస్థిరమైన వ్యవసాయం కోసం పంట మార్పిడి మరియు పంట వైవిధ్యాకరణ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం. పి జె టి ఏ యు. యూట్యూబ్ ఛానల్ మరియు బీజేపీ యూ వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడం వర్మీ కంపోస్టు తయారీ మరియు. పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన. పంట బీమా పథకాలు వెదురు మొక్కలు మరియు. ఆయిల్ పామ్ సాగు. అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి సందేహాలను నివృతం చేసుకున్నారు రైతులు ఈ కార్యక్రమం తెలుసుకున్న అంశాలను తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల అసోసియేట్ డిఎన్ డాక్టర్ సునీత దేవి. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేందర్. డాక్టర్ జె చిరంజీవి. మండల వ్యవసాయ అధికారి కే సంజీవ్. ఉద్యాన శాఖ అధికారి వి గోవర్ధన్. వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్. గౌతమి లక్ష్మణ్. వ్యవసాయ కోర్స్. అభ్యసిస్తున్న. విద్యార్థులు ఏ సాత్విక. ఎస్ బాలకృష్ణ. రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.
Whether you choose to walk or run, you are a child.Whether you choose to walk or run, you are a child.
ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.
ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.
రైతుల పండుగ ఎరువక.
ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.