భూపాలపల్లి రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని

భూపాలపల్లి నేటిధాత్రి

దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉండటం ఆందోళనకరమని జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు గత 37 సంవత్సరాలుగా వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదని పేర్కొన్నారు. అందుకే నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం మంజూరు నగర్‌లోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం–2026 సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీ ద్వారా తల్లిదండ్రులకు కూడా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులను సూచించారు. నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
మోటారు సైకిళ్ల ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు. సక్రమంగా వెళ్లకపోవడం, అశ్రద్ధ, సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడవడం లేదా వాహనం నడపడం, జిగ్‌జాగ్‌గా వెళ్లడం, అతివేగం వంటి కారణాల వల్ల వాహనం నడిపే సమయంలో ధ్యాస లేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.
ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులచే రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్వో శ్రీనివాస్,కళాశాల ప్రిన్సిపాల్ రవి, ఏఎంవిఐలు శ్రీనివాస్, సుందర్ లాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

దారిపై మంచు భూతం..

దారిపై మంచు భూతం..

 

 

 

గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

చలితీవ్రత పెరగడంతో జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేస్తోంది. కనీసం పదడుగుల దూరంలోని మనుషులు, వాహనాలు సైతం కనిపించనంతగా పొగమంచు ఉంటోంది. ఉదయం 8 గంటలు దాటినా దీనిప్రభావం ఉంటోంది. ఈనేపథ్యంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు వంద కిలోమీటర్ల మేర ఉంది. కొడికొండ చెక్‌పోస్టు నుంచి శిర జాతీయరహదారి, మడకశిర నుంచి కళ్యాణదుర్గం రహదారి, కదిరి జాతీయరహదారి విశాలంగా ఉన్నాయి. దీంతో వాహనాలు అతివేగంగా పరుగులు తీస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డుపై ఎక్కువ భాగం పొగమంచు కప్పివేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతిఏటా డిసెంబరు, జనవరి మాసాల్లో తెల్లవారుజామున, ఉదయం జరిగే రోడ్డు ప్రమాదాలు అధిక పొగమంచు కారణంగానే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వారం కిందట మడకశిర-బెంగళూరు రహదారిపై తెల్లవారుజామున మంచు అధికంగా ఉండటంతో దారి కనిపించక వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.

– గతవారం జాతీయరహదారిపై తెల్లవారుజామున బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు మంచు ప్రభావంతో మలుపు గుర్తించ లేకపోవడంతో నేరుగా వెళ్లి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్నవారు గాయపడ్డారు.

– కొద్దిరోజుల క్రితం కదిరి, అనంతపురం హైవేపై కదిరి సమీపంలో పొగమంచు ప్రభావంతో రోడ్డు దాటుతున్న మహిళ కనిపించక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version