కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “మన గుడి మన వ్యాపారం” పేరిట యాదాద్రి పరిరక్షణ కమిటీ నిరసనకు దిగింది కమిటీ సభ్యులు, ప్రజలు, యువకులు కొండపైన కొబ్బరికాయలు విక్రయిస్తూ నిరసన వ్యక్తం చేశారు వర్తక సంగం పేరుతో నిర్వహిస్తున్న దుకాణాలను రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఆలయ అభివృద్ధి సమయంలో కొండపై తొలగించిన దుకాణాల ను వర్తక సంఘం పేరిట ఏర్పాటు చేసి కొన్నాళ్లగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు

రైతులు పండించిన పంట నేలపాలేనా ?

రైతులు పండించిన పంట నేలపాలేనా ?
– తక్షణమే రైతులను ఆదుకోవాలి
– తెలంగాణ రక్షణ సేన గుంటుక సంపత్ డిమాండ్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

అకాల వర్షం ఈదురు గాలుల వల్ల తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది అని తెలంగాణ రక్షణ సేన(టి.ఆర్.ఎస్) పార్టీ రాజన్న సిరిసిల్ల నాయకులు గుంటుక సంపత్ అన్నారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం త్వరతగతిన కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. ఇవ్వకపోతే తెలంగాణ రక్షణ సేన (టి.ఆర్. ఎస్)పార్టీ తరపున పెద్ద ఎత్తున రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాజన్న సిరిసిల్ల నాయకులు గుంటుక సంపత్ డిమాండ్ చేసారు.

ప్రపంచ శాంతి, అంతరాలు లేని సమాజం కోసం పోరాడాలి

ప్రపంచ శాంతి, అంతరాలు లేని సమాజం కోసం పోరాడాలి
ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

 

శ్రమదోపిడి రహిత సమాజం కోసం, ప్రపంచ శాంతి కోసం పెట్టుబడిదారీ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటాలను ఉధృతం చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. శ్రామికుల హక్కులను హరిస్తూ పాలక పార్టీలు మేడే జరపడం సిగ్గుచేటు అని విమర్శించారు.ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేని పురస్కరించుకొని గురువారం నర్సంపేట పట్టణంలోని మార్క్స్ కాలనీ, జ్యోతి బస్ నగర్ లలో అలాగే ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయం ఓంకార్ భవన్‌లో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ జెండాను ఆవిష్కరించారు. నగర కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మార్చి సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ దోపిడీని విస్తృతం చేస్తున్నారన్నారు. అన్నదాతలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసేలా ఉత్పత్తి ఖర్చులు పెంచి, గిట్టుబాటు ధర లేకుండా మార్కెట్ దోపిడీని పెంచి పోషిస్తున్నారని తెలిపారు.ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కూలీలకు ఉపాధి లేకుండా చేశారని, యుద్ధాల పేరుతో అశాంతిని సృష్టించి గ్యాస్, డీజిల్, పెట్రోల్‌లపై కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడే స్ఫూర్తితో పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.రైతుల పంటలకు మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలకై పోరాడుతూ పాత కార్మిక చట్టాలను, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాలపై పోరాటాలతో ఒత్తిడి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సింగతి సాంబయ్య, గోనె కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుసుంబా బాబురావు, ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్, ప్రాంత కార్యదర్శులు గణిపాక ఓదేలు, మహమ్మద్ మహబూబ్ బాషా, పరిమళ గోవర్ధన్ రాజు, జిల్లా నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, సింగారపు దాసు, రాయినేని ఐలయ్య, సమ్మయ్య, కొమురయ్య, పూలమ్మ, ఆశా బేగం, యాకయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 152వ బూత్‌లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు రమేష్ పాండ్య, మడ్లపెల్లి క్రాంతి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంబంపాటి పుల్లారావు, జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమైన భారతీయ జనతా పార్టీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, అటల్ బీహారి వాజపేయి, ఎల్.కే.అద్వానీ వంటి అగ్రనేతల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం అయిందన్నారు. ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే దిశగా పార్టీ పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కూనమళ్ళ పృథ్విరాజ్, పంజాల శ్రీరామ్, ఠాగూర్ శివంజన్ సింగ్, దామెర ఆకాష్, కనుక గణేష్ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ భక్తులపై దుర్భాషలాట

హనుమాన్ భక్తులపై దుర్భాషలాట

క్షమాపణ చెప్పాలని ప్రధాన రహదారిపై రాస్తారోకో..

నర్సంపేట,

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలదారులపై అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దుర్భాషలాడటం కలకలం రేపింది. మాలదారులు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం గ్రామానికి చెందిన హనుమాన్ భక్తులు మాల వేసుకుని హనుమాన్ గుడి దగ్గర ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రాల్లో స్థానికులు వాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చెప్పులు, షూలు వేసుకుని తాము ఉండే ప్రాంతంలో నడవవద్దని భక్తులు చెప్పడంతో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు హనుమాన్ భక్తులను అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు మాలాదారులు ఆరోపిస్తున్నారు. తమను తిట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భక్తులు నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనాలు ఇరు వైపులా నిలిచిపోయాయి.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భక్తులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. క్షమాపణ చెప్పాలని కోరగా నిరాకరించడంతో సంబంధిత ఇద్దరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

మద్దతు పలికిన శ్రీ రామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు..

వరంగల్ -నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న హనుమాన్ భక్తులకు శ్రీ రామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి మద్దతు పలికారు.పవిత్రమైన హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులపై అసభ్యపదజాలంతో మాట్లాడిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హిందూ సాంప్రదాయాలు,భక్తుల మనోభావాలు దెబ్బతీసేవింగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమాన్ భక్తులకు బహిరంగంగా చెప్పాలని వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.

విద్యుత్ ఉద్యోగుల ధర్నా…

విద్యుత్ ఉద్యోగుల ధర్నా

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి మోత్కూరి కోటి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ యాళ్ల సురేందర్ రెడ్డి ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈ ధర్నాలో ఆర్టిజన్, అన్‌మాన్, స్పాట్ బిల్లర్స్, ఎస్‌పీఎంలు ఇతర పీస్‌రేట్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్మికుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క కార్మికుల సమస్యను పరిష్కరించాలి అని వారు అన్నారు
ఆర్టిజన్ కార్మికులను వారి విద్యార్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి
ఏపీఎస్ఈబి నిబంధనలు పూర్తిగా అమలు చేయాలి
ఒకే సంస్థలో సంవత్సరాలుగా పని చేస్తున్న అన్‌మాన్ కార్మికులను ఆర్థిక ఆర్టిజన్‌గా గుర్తించాలి
కార్మికులకు శాశ్వత పరిష్కారం కల్పించాలి
కార్మికులు సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా అనంతరం డివిజన్ ఇంజనీర్ కి కార్మికుల సమస్యలను వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఉమ్మడి డివిజన్ కమిటీ భూపాలపల్లి ఆధ్వర్యంలో టీవీఏఈ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో:
చైర్మన్‌గా – నాగుల తిరుపతి రెడ్డి
కన్వీనర్స్‌గా – మోత్కూరి కోటి, తిప్పారపు రాజు
కో-కన్వీనర్స్‌గా – సమ్మయ్య, జన రవీందర్
కో-చైర్మన్‌గా – బత్తుల రాజేందర్
వైస్ చైర్మన్‌లుగా – జి. సుదర్శన్, ఎల్. రాజయ్య
జాయింట్ సెక్రటరీగా – వేముల కిరణ్
కోశాధికారిగా – హరిచంద్ర
నూతన జేఏసీ కమిటీ ఏర్పాటుతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 7న “చలో వరంగల్” కార్యక్రమం నిర్వహించి, అవసరమైతే సమ్మెలోకి వెళ్లే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ధర్నా అనంతరం టీవీఏఈ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వంటేరు మల్లయ్య, ఎండి అక్షావాలి, భాస్కర్ చారి, విజేందర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు

పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం….

పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం

నర్సంపేట,నేటిధాత్రి:

పీడీఎస్యు ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చంద్రబోస్, ఉషా కిరణ్, సందీప్, శ్రీకాంత్, అనిల్ షఫీనా, పూజ, అభినయ, అఖిల తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీ పథకాల లబ్ధిని తక్షణమే ప్రజలకు అందించాలి…

ఆరు గ్యారెంటీ పథకాల లబ్ధిని తక్షణమే ప్రజలకు అందించాలి
– సిరిసిల్ల పట్టణ తహసిల్దార్ కి వినతి పత్రం
– సిరిసిల్ల బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణ తహసిల్దార్ కి సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, కమిటీ తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఆరు గ్యారెంటీ పథకాల లబ్ధిని తక్షణమే ప్రజలకు అందించాలని తహసిల్దార్ ని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు కనకయ్య, నరసయ్య, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, దేవరాజు, సూరం వినయ్, అంకారపు రాజు తదితరులు పాల్గొన్నారు.

హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం- బింగి వేణు…

హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం- బింగి వేణు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయనికి నిరసనగా వెళ్లి తహసీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు నూతన పింఛన్లు మంజూరు చేయడం లేదని, ఎన్నికల సమయంలో అనేక ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం ఎకరాకు ఆరువేల రూపాయలు వేస్తామని చెప్పి మూడు విడతల పైసలు ఎగ్గొట్టి రైతులను మోసం చేస్తోందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు కాడే నర్సింగం, జాతరగొండ ఐలయ్య, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేని అంజిబాబు, ఉప సర్పంచ్ లు బద్ధం లక్ష్మారెడ్డి, కుమ్మరి అనిల్, నాయకులు మాదం శివ, షెవెళ్ల అక్షయ్, వడ్లూరి రాజేందర్, మునిగంటి శ్రీనివాస్, వేముల రమేష్, హరీష్, బూత్ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, దైవల తిరుపతి గౌడ్, వీర్ల రామచంద్రరావు, మంద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పోతన నగర్ కల్వర్టు వివాదం..

పోతన నగర్ కల్వర్టు వివాదం

స్పందించిన పోలీసులు – రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ నగర పరిధిలోని పోతన నగర్‌లో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ వివాదంపై పోలీస్ శాఖ స్పందించింది. భూ బాధితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

మునుపటి రోజున భూ బాధితులు కల్వర్టు విస్తరణ పేరుతో తమ ప్రైవేటు భూమిని అసమానంగా స్వాధీనం చేసుకుంటున్నారని, దళితుల వైపు ఎక్కువగా భూమి తీసుకుని, ఇతరుల వైపు తక్కువగా తీసుకున్నారని ఆరోపిస్తూ టెంటు వేసి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పోలీసులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి, సంబంధిత పత్రాలు పరిశీలించినట్లు సమాచారం. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇక విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి నిర్మాణ పనులపై విచారణ ప్రారంభించారు. కల్వర్టు నిర్మాణం అనుమతులు, ప్రణాళికలు, భూస్వాధీనం విధానం తదితర అంశాలపై పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. రెండు వైపులా భూమి తీసుకున్న పరిమాణంపై స్పష్టతకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.

నిర్మాణం జరిగిన ప్రదేశంలోనే ప్రత్యక్షంగా కొలతలు తీసి, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల అధికారులను కూడా వివరణ కోరినట్లు సమాచారం.

భూ బాధితులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇరువైపులా సమానంగా భూమి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం…

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం

ప్రజలకు అందుబాటులో ఉంటా-అభ్యర్థి ఏకు బాబు (బొబ్బిలి)

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని మున్సిపాలిటీ 19వ వార్డ్ టిఆర్ఎస్ అభ్యర్థి ఏకు బొబ్బిలి(బాబు) ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈ ప్రచారంలో ఇన్చార్జిలు బొట్ల శ్రీను,దోమల శ్రీనివాస్ వార్డు అధ్యక్షులు ఏకు కార్తీక్ లు మాట్లాడుతూ 27 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థ ఎలక్షన్ లో ప్రచార నిర్వహించే నైతిక హక్కు లేదని అంకెల గారడి తో ప్రజలను మోసం చేస్తున్నారని మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జలాలుద్దీన్,సాదిక్,బండి శ్రావణి,బొచ్చు రాజు,ఏకు ప్రవీణ్,ఏకు శివతేజ,కొమ్ముల మహేష్,ఒంటేరు రాకేష్,ఏకు వంశీ మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ బద్దెనపల్లి ఇందిరమ్మ .కాలనీలొకాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లిశ్యామ్.గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ మేము చేయలేదు అని చెప్పిన కేసీఆర్ కు తన కూతురు కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ముఖ్య సాక్షిగా నా ఫోను నా భర్త ఫోన్ టాప్ చేసింది మా నాన్న మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పడం. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులు ఎన్నో అక్రమాలు చేసిన వారిని వదల వద్దని. గతంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ టాపింగ్ చేస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అవినీతి అక్రమాలు ప్రజలకు. తెలవాలని. ఇలా తెలంగాణ పేరు చెప్పి ఎన్ని అక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారని దీనిపై సిట్ అధికారులు గత ప్రభుత్వంలొ జరిగినటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా సీట్ విచారణ చేస్తున్నారని. ఇలాంటి అవినీతి వెలికి తీయాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని విషయాలు బయటకు రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మన ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన ప్రభుత్వంలో పెద్దల ఇతర మంత్రుల సహాయంతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఓర్వలేక అనేక అబండాలు వేస్తూ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా. ఇలా. ఇలా చేస్తే వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని. ప్రజాక్షేత్రంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని. ఎలాంటి తప్పు చేయని మీకు భయం ఎందుకని సిట్ విచారణ చేస్తే తప్పేము ఉంటుందని దానికి సహకరించాలి తప్ప ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఇకనైనా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వాటి సభ్యులు. వడ్డేపల్లి రామా. ముందాటి శారద. భరత్. కాంగ్రెస్ నాయకులు. శ్రీరామ్. నరేష్. లక్ష్మిపతి. రంగయ్య. సుదర్శన్. రాజు. శ్రీనివాస్. రమేష్. కిషన్. గురునాథ్. రవి. రామచంద్రం. రాజు. కిరణ్. శ్రీనివాస్. లక్ష్మణ్. మహిళ నాయకులు. యమునా. భాగ్యలక్ష్మి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా..

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ

నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

దుగ్గొండి నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.

కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే

భూపాలపల్లి నేటిధాత్రి

 

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని టీయూడబ్ల్యూజే హెచ్ 143 జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు మంతెన సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 239 జీవో ఆధారంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ న్యాయబద్ధంగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 252 జీవో తీసుకువచ్చి అర్హులైన వారికి అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ జీవో మూలంగా డెస్క్ జర్నలిస్టులకు, నియోజకవర్గ జర్నలిస్టులకు అలాగే ఒక్కో పత్రికకు జనాభా ఆధారంగా ఆయా మండలాలకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాగా వెంటనే 252 జీవో ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబాల సంపత్, శేఖర్ నాని, బండ మోహన్, తిక్క ప్రవీణ్, విజయ్ ,రడపాక రమేష్, జగన్,రాజశేఖర్,దేవేందర్,మహేందర్,నరేందర్, మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.a

రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం..

రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండలం మాల్దీ గ్రామంలో మంగళవారం తెలంగాణ ప్రజల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రవి ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, ప్రమాదకర రసాయన పరిశ్రమ వల్ల ప్రజలకు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దీనికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.

మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి..

మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి

నల్లా నీళ్లు రావడం లేదంటూ బిందెలతో కాలనీవాసుల ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు కాలనీలో తీవ్ర మంచినీటి సంక్షోభం నెలకొంది.గత కొంతకాలంగా కాలనీలో నల్లా నీళ్లు కూడా సరిగా రావడం లేదని,తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా 1 వ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఒకటో వార్డులో గత కొన్ని నెలలుగా నీటి సమస్యలు వస్తున్నాయని పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు.ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేసిన వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేపట్టిన మహిళలు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మౌలిక వసతులైన తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని, బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల సురేష్, దంచనాదుల సతీష్,ఎండి అఫ్జల్ పాషా, భూక్య మంజుల, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య సునీత, నల్లబెల్లి మంజుల,
ఎండీ గుడియా బేగం,ఎండీ కౌసర్, ఎం.ఈ హసీనా, ఎం.ఈ జరినా, ఎం.ఈ సజియా, ఎండీ నూర్,
శ్రీపెల్లి రమ, మల్యాల నాగలక్ష్మి, జాటోత్ విజయ, లవూడియా విజయ తదితరులు పాల్గొన్నారు.

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు ఇవ్వాలి..

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు ఇవ్వాలి

అసంపూర్తి ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి

దూపకుంట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన ఎంసిపిఐ(యు) బృందం

నేటిధాత్రి ఖిలా వరంగల్ :-

https://youtu.be/wR0ljd3z7mE?si=XsG-p6jOssIJ31iK

 

 

వరంగల్ నగరం, దూపకుంట పరిధిలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేసి కూడా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకపోతే అర్హులైన పేదలను సమీకరించి ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు.

శుక్రవారం ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా–నగర నాయకత్వ ప్రతినిధి బృందం దూపకుంటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి నిర్మాణ స్థితిగతులను పరిశీలించింది.

ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ…
వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిరాశ్రయ పేదలకు అన్ని సౌకర్యాలతో రెండు పడకల ఇండ్లు ఇస్తామని ప్రచార ఆర్భాటం చేసిన గత ప్రభుత్వం, కాలయాపన చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండానే అధికారాన్ని కోల్పోయింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి కొండ సురేఖ ప్రస్తుత మంత్రిగా ఉన్నా కూడా దూపకుంటలో పూర్తయిన ఇండ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం విడ్డూరం” అని విమర్శించారు.వరంగల్ నగర పరిధిలో దూపకుంటలో సుమారు 2400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకోగా, సగం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇండ్లు అసంపూర్తిగా ఉండటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు మార్లు అధికార యంత్రాంగానికి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు.

అలాగే లక్ష్మీ టౌన్షిప్‌లో 210, తిమ్మాపూర్‌లో 456 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ నేటికీ పంపిణీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే పంపిణీ చేయకపోతే ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇండ్ల నిర్మాణంలో జరిగిన నాసిరకం పనులు, అసంపూర్తిగా నిలిపివేసిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు ఎంసిపిఐ(యు) నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలోజిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మహమ్మద్ మెహబూబ్ పాషా, పరిమళ గోవర్ధన్ రాజు, తాటికాయల రత్నం, చుక్క ప్రశాంత్, నలివెల రవి, రామస్వామి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి

ఏఐఎఫ్ టియు ప్రజా సంఘాల డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్ టీయు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. టి రత్న కుమార్. అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి.
రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు.
వై .మల్లేష్. జి .అంజయ్య. ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని -29. కార్మిక చట్టాలను అమలు పర్చాలని
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ మోడీ -అమీషా ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను
అనుసరిస్తూ. కార్మికులు అనేక ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29. కార్మిక చట్టాలను
నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పరిశ్రమంలో అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కార్మిక ఉద్యోగ సంఘాలు అనేక నిరసనలు భారత్ బందులు, టోకెన్ సమ్మెలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసినప్పటికీ కార్మికుల అభిష్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి. కార్మిక వ్యతిరేక
ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను (21/11/25) రోజు నుండి అమలులోకి తెచ్చి. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి భారత రాజ్యాంగంలో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పొందుపరచుకున్న కార్మిక చట్టాలను హిందుత్వ మతోన్మాద బిజెపి మోడీ -అమీషా .ప్రభుత్వం. భారత కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నమని చెప్తూ మరోవైపు. లాభాల లొ నడుస్తున్న. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తూ. ఆదాని- అంబానీ-బడా పారిశ్రామిక వేత్తలకు అమ్మివేస్తూ . కార్మికులను కార్మిక కుటుంబలను రోడ్డుమీదికి నేటి వేస్తూ. అన్ని రంగాల ప్రజలను సంక్షోభములకు నెడుతు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి. భారత కార్మిక వర్గం ప్రశ్నించే హక్కు లేకుండా. ప్రశ్నించే కార్మికులను. ఎలాంటి సమాధానాలు లేకుండా. నేరుగా ఉద్యోగం నుండి తొలగించే విధంగా. బ్రిటిష్ వారిని మై మరిపించే విధంగా. కార్మిక చట్టాలను మారుస్తు. కార్మిక వ్యతిరేక. నల్ల చట్టాలను అమల్పరుస్తూ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా. మోడీ. విధానానకు వ్యతిరేకంగా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలకు ముందు. కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు పర్చాలని. నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపియాలని
కార్మికులు కార్మిక సంఘాలు ఐక్యంగాక. నాలుగు లేబర్ కోడ్స్ ను ఎత్తివేసి.29 కార్మిక చట్టాలను అమలుపరిచే వరకు ఉద్యమించాలని . రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు. ఏం. రాయమల్లు.
ఏం . పోచమల్లు. జి .రాములు. సామల అనసూర్య. వెంకటలక్ష్మి.
లక్ష్మి. రాజేశ్వరి. లత. కే .రాము. చంద్రగిరి .శంకర్. కుర్తి లింగం. కిష్ట స్వామి. తదితరులు పాల్గొనడం జరిగింది

సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి..

సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

హైదరాబాదు నగర నడిబొడ్డు మీద ఉన్న నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ సుమారు 2000 మంది కార్మికులు తమ వేతనాలను పెంచాలని గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు గురువారం నాడు కార్మికుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఐఎఫ్టియు ప్రతినిధి బృందం తరపున ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా సాయి ఎక్స్పోర్ట్ కమిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుకాలం గడుస్తున్న కార్మికుల వేతనాలు రూ10 వేల లోపే పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం మహిళా కార్మికులు ఉన్నప్పటికీ వారికి కనీస రక్షణ చర్యలు లేవని ఫలితంగా తీవ్ర వివక్షకు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ సమస్యపై స్పందించాలని లేబర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి కార్మికుల యాజమాన్య తో చర్చించి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి చట్టాలు అమలు చేయకుండా కార్మికుల కనీస హక్కులను హరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి సాయి ఎక్స్పోర్ట్ కంపెనీలో చట్టాలు అమలయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలని అందులో భాగంగానే కనీస వేతనం కింద ఒక్కో కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని మహిళా కార్మికులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనియెడల కార్మికులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, నాయకులు కావేరి, మల్లన్న, ఇంద్రసేనారెడ్డి, శ్రీశైలం, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఈ పరిశ్రమలతో మా ప్రాణాలకు ముప్పు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T170358.605.wav?_=1

 

ఈ పరిశ్రమలతో మా ప్రాణాలకు ముప్పు…!

పరిశ్రమ నుండి వచ్చే దుమ్ము ధూళి తో చిన్నపిల్లలు అనారోగ్య పాలవుతున్నారు

జననివాసాలు ఉండే చోట ఈ పరిశ్రమలు ఏంటి…?

ఈ పరిశ్రమల కాలుష్యంతో మేము ఉండాలా…? పోవాల్నా…?

ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతూ,
కేసముద్రం మండల కేంద్రంలో చైతన్య నగర్ కాలనీకి ప్రక్కన జన నివాసాలు ఉన్నచోట ఇండస్ట్రీస్ ఉడుకేత మిల్లులు రైస్ మిల్లులు పత్తి మిల్లులు కొత్తగా నిర్మాణం చేస్తూ ప్రజలకు చిన్న పిల్లలకు హానికరమైన కంటికి కనబడని కాటన్ ముక్కులోకి నోట్లోకి వెళ్లి చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడేలా హాని కలిగిస్తున్నాయని, అదేవిధంగా ఉడుకేత మిల్లుల ద్వారా నల్లటి దుమ్ము త్రాగే నీళ్లలో ఇంటి ముందు రోజు వాడుకునే నీళ్లలో అలాగే రాత్రిపూట ఆరు బయట నిద్రిస్తే తెల్లవారేసరికి మనిషి మీద మొత్తం నల్లటి దుమ్ము దూళి వడ్ల పొట్టు.ఉనుకా తూర్పారబోసినట్టుగా వెదజల్లుతున్నాయని కాలనీ ప్రజల ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఇండస్ట్రీకి వెళ్ళవలసిన భారీ లారీలు ట్రాక్టర్లు జెసిబి లు ఇండస్ట్రీకి ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు పెద్ద పెద్ద వెహికల్స్ మొత్తం కాలినికివెళ్ళేదారినుండి దురుసుగా స్పీడ్ గా వెళుతూ కాలనీవాసులు రోడ్డుమీదికి రావాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయటకు రావాల్సి వస్తుంది అన్నారు. గత 30 40 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సంబంధిత శాఖ వారు మరియు ఇండస్ట్రియల్ ఆఫీసర్లు అందరూ వీటిపైన చర్యలు తీసుకుని కాలనీవాసులకు న్యాయం చేయాలని వారు తెలిపారు.అప్పటికి చర్యలు తీసుకొని పక్షంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకత్వంతో. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల్ నాయకులు కొమ్ము సునీల్ ఎమ్మార్పీఎస్.గ్రామ నాయకులు కొమ్ము నిఖిల్ వల్లందాస్ మురళి పెండల అశోక్ కొమ్ము రమాకాంత్ కొమ్ము భరత్ పెండేలా బన్నీ సోమారపు రఘు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version