మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
#తహసిల్దార్ ముప్పు కృష్ణ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటు తీవ్రమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొ o థ తుఫాన్ కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని. అలాగే కరెంటు స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్లకూడదని అదేవిధంగా పాత గోడలు, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిలో వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే క్రమంలో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని . ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటకి పంపరాదు అని ఆయన మండల ప్రజలకు సూచించారు.
