ఓదెల మల్లికార్జున దేవస్థానంలో రోడ్డు భద్రత అవగాహన

ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించిన పోత్కపల్లి పోలీస్..

ఓదెల( పెద్దపల్లి జిల్లా) నేటి ధాత్రి

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓదెల మల్లన్న దేవాలయంలో పోత్కపల్లి పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోత్కపల్లి పోలీస్ మాట్లాడుతూ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలి.రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయకూడదు.ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గా వాహనం నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు మరణాలు సంభావిస్తాయి.ట్రాఫిక్ కి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి.రోడ్డుకు అడ్డంగా అటు ఇటు కాకుండా పార్కింగ్ ఏరియాలో మాత్రమే వాహనాలు పార్కు చేయాలి.ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరుగుతే డయల్ 112 కాల్ చేసి రోడ్డు ప్రమాదం సంబంధించిన సమాచారం ఇవ్వాలి.సిగ్నల్ జంప్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు వీలందనైనంత త్వరగా తరలించాలి అని సూచించారు.

ఓదెలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

ఓదెల మోడల్ స్కూల్ రోడ్డు భద్రతా అవగాహన : ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి

ఓదెల మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ము స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, సరైన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారే వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించగా, నోటీస్ బోర్డుల్లో రోడ్ సేఫ్టీ పోస్టర్లు అతికించారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో రోడ్డు భద్రతపై పోస్టర్లు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

బస్టాండ్లో బస్సు ఢీకొని ప్రయాణికుడికి తీవ్ర గాయాలు…

బస్టాండ్లో బస్సు ఢీకొని ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో సీటు కోసం పరుగులు తీస్తున్న ఖదీర్ (35) అనే ప్రయాణికుడిని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో ఖదీర్ రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అతన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అజాగ్రత్తగా పరుగులు తీయడం ప్రమాదకరమని డిపో మేనేజర్ సూచించారు. కొందరు బస్సు డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

నెక్కొండలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

రోడ్ సేఫ్టీ పాటిస్తేనే ప్రమాదాల నివారణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

రోడ్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, నెక్కొండ సీ ఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్సై మహేందర్,మోటార్ వెహికల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, నెక్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశానికి నెక్కొండ మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, వాహన బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని, అధిక ప్రయాణికులతో వాహనాలు నడపరాదని తెలిపారు.
రోడ్ సేఫ్టీని పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, మన కుటుంబాల భద్రతకు కూడా కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవిస్తేనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు.

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి…

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి

వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించం – ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఓదెల మండలంలో నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని,మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది.ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినా, మీ న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మకూడదు.బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామని,మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఎవరైన ఈ నియమాలను అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ కు మండల ప్రజలు సహకరించాలని కోరారు.2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని పోత్కపల్లి పోలీస్ పోలీసు విజ్ఞప్తి చేస్తోంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, నిరంతర పెట్రోలింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్….

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

 

స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

 పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢికొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను వారి కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అలాగే కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రత వాహనదారులు సహకరించాలని కోరారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version