సంక్రాంతి పండుగలో పోలీసుల హెచ్చరిక

*సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నాం……*

◆-: దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు.. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త

◆-: చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్ ,బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచనలు.. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

వీధుల్లో కొత్త వ్యక్తులు కదలికలపై 100 కు డయల్ చేయండి…

వీధుల్లో కొత్త వ్యక్తులు కదలికలపై 100 కు డయల్ చేయండి
గణపురం ఎస్సై రేఖ అశోక్
గణపురం నేటి ధాత్రి 
https://youtu.be/sai65LRr7hk?si=AP_U0noezyXyTWvF
గణపురం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రేఖ అశోక్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ పండగకు ఊరెళ్తున్నారా జరభద్రం
దసరా పండగ సందర్భంగా ఊర్లకు వెళ్ళేవారు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వండి..  
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ. పరిమిత వేగంలో ప్రయాణించండి.. 
మద్యం సేవించి వాహనం నడపరాదు. రాత్రి పూట డ్రైవింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
పండగ సమయంలో దొంగతనాలు, ఆస్తి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. దసరా పండగ సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లోకల్ పోలీసులకు సమాచార ఇవ్వాలి .  ప్రయాణాలలో హెల్మెట్, సీట్ బెల్ట్ దరించి, పరిమిత వేగంలో వెళ్లాలని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు  చేరుకోవాలి ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. 
ఊర్లకు వెళ్తున్నప్పుడు పక్కింటి వారిని ఇంటి పరిసరాలను గమనించాలి విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. 
ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. 
ఊళ్ళకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి.
ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.
ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా  ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. 
ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి.
అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి.
సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ నంబర్స్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా గంజాయి వినియోగదారులు  కనిపించినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును . అదేవిధంగా ఇంటి నిర్మాణం ఇతర పనుల నిమిత్తం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి పనివాళ్లను తీసుకొచ్చినట్లయితే ముందుగా వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయించవలెను అదేవిధంగా వారి ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పోలీస్ స్టేషన్ నందు ఇవ్వగలరు రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. ఫోన్ నెంబర్స్_ 8712 658122 +8712658143 ఈ నెంబర్లకు డయల్ చేయాలని ఎస్ ఐ ఆర్ అశోక్ తెలిపారు
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version