జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.