పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..
సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం…
ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి..
అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ జిల్లా (నేటిధాత్రి):
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారు. అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజి రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి, చాందరాజు సంతోష్, మల్లాడి తిరుపతి రెడ్డి, వీరబోయిన రవి, బైరి సునీల్, లింగారెడ్డి, రవి, స్వర్ణలత, రావుల శ్రీకాంత్ తో హసన్పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి, సిబ్బంది తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….
