జహీరాబాద్ నియోజకవర్గంలో ఆయా మండల ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ గ్రామాలలో పత్తి ఏరేందుకు కూలీలు ఇతర నుంచి కూలీలను వలసకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నా రు. వారు సైతం అనుకున్న స్థాయిలో దొరకకపోవ డంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. వలస కూలీలతో పనులు చేయించడం వల్ల వారికి స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసి ఇతరత్రా సౌకర్యాలు ముందుగానే సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో పత్తి రైతులకు ఖర్చులు తడిసిమోపడవుతున్నా యి. ఏటా జిల్లాలో పత్తి పంట సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కూలీల కొరత వల్ల కొందరు రైతులు పత్తి జోలికి వెళ్లడం లేదు. ఓ వైపు కూలీల సమస్యలు మరోవైపు వర్షాలు, రోజు కురుస్తున్న వర్షాలతో మునిగిన పంటలు ఇవన్నీ పత్తి రైతుల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పత్తి పంటను నమ్ముకు న్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వలస కూలీల ఆర్థిక భారాన్ని భరించడం తప్ప చేసేదేమీలేదు..
అడ్వాన్స్ ఇస్తేనే..
పత్తి ఏరేందుకు వలస కూలీలకు అడ్వాన్స్ ఇస్తేనే పనులకు వస్తున్నారు. ఏపీ నుంచి అనంతపురం, శ్రీకాకుళం, కర్నాటక ప్రాంతం నుంచి వలస కూలీలను తీసుకొస్తున్నారు. వారికి గుడారాలు, నిత్యావసర సరుకులకు అవసరమైన డబ్బు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఒప్పందం ప్రకారం కూలీలు పనులకు వస్తున్నారు. ఈ భారం అంతా రైతులపై పడడంతో పాటు దిగుబడి తగ్గి గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల్ నూతన ఎంపిడిఓ షగుఫ్తా ఇఫ్తాత్ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇంకా తీరుమారని ప్రైవేట్ పత్తి వ్యాపారుల అక్రమ దందా….
◆:- ప్రభుత్వ నిబంధనలు బేకాతర్
◆:- నియోజకవర్గ ఆయా మండలాల అక్రమ పత్తి వ్యాపారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల్లో అక్రమ పత్తి వ్యాపారుల ప్రైవేట్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ వారు మాకేం కాదంటూ తమ వ్యాపారాన్ని నడిపిస్తూనే ఉన్నారు. కూత వేటు దూరంలో ప్రభుత్వ సిసిఐ కేంద్రం ప్రారంభించినప్పటికీ ప్రైవేటు వ్యాపారుల చీకటి వ్యాపారం కొనసాగుతూనే ఉంది. అమాయక రైతులను మోసం చేస్తూ లక్షల అధికారులు ప్రైవేట్ వ్యాపారాలు ఘటిస్తున్నారు. ప్రైవేటు యాపారం అక్రమంగా జరుగుతుందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లగా అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.
అధికారి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల ప్రైవేట్ పత్తి వ్యాపారుల దందా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అక్రమ పత్తి వ్యాపారులను నోటీసులు అందించి చేస్తామని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాటిని కూడా ప్రైవేట్ వ్యాపారులు పట్టించుకోకుండా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఆటోల ద్వారా వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులను మోసం చేసి పత్తిని తీసుకొచ్చి తల్లాడలో అమ్మకాలు చేస్తే ఆనాడు తల్లాడ పోలీసులు పలువురు యువకులపై బైండోవర్ కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
మరలా అదే విధంగా ప్రస్తుతం కూడా యువకులు ఆటోలు ద్వారా రైతులను మోసం చేసి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కూడా బైండ్లవర్ కేసు నమోదు చేసి అవి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తల్లాడలో అక్రమ పత్తి వ్యాపారులపై కొరడాలు జూలిపించి రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సిసిఐ కేంద్రం ద్వారా పత్తిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
తెలంగాణలో అత్యంత ఘనంగా,భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో నాగుల చవితి ఒకటి.ఈ పండుగ సందర్భంగా నాగ దేవతలను,పుట్టలోని పాములను భక్తులు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు.శనివారం నాగుల చవితి పండుగను పురస్కరించుకొని పరకాల పట్టణలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.మహిళలు పుట్టల్లో పాలు పోసి,మొక్కులు తీర్చుకున్నారు.
ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు.సనాతన విశ్వాసాల ప్రకారం,ఈ రోజు నాగుల పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంతోషం,ఐక్యత మరియు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.పూజా విధానంలో మొదటగా పుట్ట వద్దకు వెళ్లి నాగ దేవతను నమస్కరించడం పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి,వ్రతాన్ని ప్రారంభిస్తారు.వ్రతం చేసేటప్పుడు పూర్తి ఉపవాసం తప్పనిసరిగా పాటిస్తారు.
న్యాల్కల్,ఇందిరమ్మ గృహ పథకం అమల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరు ఇండ్లను నిర్మించుకోవచ్చు అని, ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో బిల్లులు చెల్లిస్తామని, ఇండ్ల నిర్మాణాలను చేపట్టని గృహ లబ్దిదారులు వెంటనే పనులను ప్రారంభించాలని జిల్లా గృహ నిర్మాణాధికారి చలపతిరావు సూచించారు. శు క్రవారం మండలంలోని మెటల్ కుంట గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. గ్రామానికి 31 ఇండ్లు మంజూరు అవ్వగా 18 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానిక గృహ నిర్మాణ అధికారులు వివరించారు. జహీరాబాద్ డివిజన్ గృహ నిర్మాణాధికారి ఆంజనేయులు, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల ఏఈ శివానంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిర, తదితరులతో కలిసి ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో అధికార పార్టీ శ్రేణులు పాండు రంగారెడ్డి, శ్రీకాంత్, సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.
అధిక మొత్తంలో జూదమాడుతున్న 11మంది జూదరులపై కేసు నమోదు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని రాజోల గ్రామంలో జర్నప్ప వ్యవసాయ క్షేత్రంలో చెరుకు తోటలో జూదం ఆడుతున్న 11 మంది జూదరులను నేడు అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వ్యక్తులు జూదం ఆడుతుండగా వారి వద్ద నుండి రూ:1,80,000 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
న్యాల్ కల్: విధినిర్వహణలోనున్న పోలీసులపై పరుషపదాలతో దూషించిన యువకులపై హద్దునూర్ ఎస్సై గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్ కల్ కు చెందిన యువకులు మున్నూరు రాజు, చుట్టాకుల శ్రీకాంత్, గాండ్ల వినయ్ కుమార్ లు బుధవారం అర్ధరాత్రి నారాయణఖేడ్, న్యాల్ కల్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి మద్యం సేవిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు సాయికుమార్, మహేష్ లు గస్తీ నిర్వహిస్తుండగా.. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి మీరెవరు అంటూ.. మద్యం మత్తులో యువకులు పోలీసుల పైనే పరిష పదాలతో దూషిస్తూ.. పోలీసులు వీడియో రికార్డు చేస్తుండగా.. విధులను ఆటంకం కలిగిస్తూ.. వారివద్ద నుండి సెల్ ఫోన్లు, లాఠీలను లాక్కోవడం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ న్యాల్కల్ మోగుడంపల్లి కోహిర్ ఝరాసంగం ఉమ్మడి మండలంలో పెద్ద ఎత్తున పత్తి పంటలు దెబ్బతిన్నాయి వ్యయ ప్రయాసలకు ఓర్చి వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతు లకు పంటలు చేతికి వచ్చే దశలో ప్రకృతి వికృత రూపం దాల్చి కాయ కష్టం మొత్తాన్ని ఉడ్చేసింది. దీంతో ఉమ్మడి మండలంలో సుమారు 50 కోట్ల కు పైగా నష్టం వాటిల్లింది ఉమ్మడి మండలంలో ప్రధాన పంటలైన వారి పత్తి
ఈ రెండు పంటలే ప్రధాన పంటలు కావడంతో రైతన్నలు పంట సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి భూములను కౌలుకు తీసుకొని అందులో పంటలను సాగు చేసినప్పటికీ పంటలు చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వరుణుడు తమ ప్రతాపం చూపడంతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అటు పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులకు కంటినిండా నిద్రలేక రైతులు తీవ్ర అస్తవ్యస్తాల కు గురవుతున్నారు. పత్తి చేలల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో పత్తి పంట రంగు మారిపోయింది అంతేకాకుండా పత్తి చెట్టుకు కాసిన కాయల్లో నుంచి సగం కాయలు పూర్తిగా కుళ్ళి పోయాయి ఉన్న అరకొర కాయలు కూడా తెలుపు రంగులో ఉండే పత్తి నలుపు రంగులోకి మారిపోయింది.
రంగు మారిన పత్తిని కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు దీంతో రైతన్నలు ఏమి చేయాలో అర్థం కాక పోవడం ఒక ఎత్తు అయితే పంట సాగు కోసం తెచ్చిన అప్పులు రెట్టింపు కావడంతో ఆ అప్పులను ఎలా తీర్చాలో రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది లేనియెడల తమకు మరణమే శరణ్యమని పలు గ్రామాల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
మరోవైపు కాస్తో కూస్తో కొద్దిపాటి వరి పొలం ఉండడంతో ఆ వరి పంట కూడా రేపో మాపో చేతికి వస్తుందనుకున్న సమయంలో అధిక వర్షాల వల్ల అట్టి వరి పంట గింజలు నేలరాలిపోయాయి, మరికొంతమంది వరి పొలాలు పూర్తిగా నీడ మునిగిపోయి, అట్టి నీటిలోనే వరి పంట కుళ్ళిపోయింది దీంతో ఆయా గ్రామాల రైతులు తమ కళ్ళముందే తమ పంటలు ఇలా చెడిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు పడ్డారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నష్టపోయిన పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు లేనియెడల పురుగుల మందులే పాయాసం అనుకోని ఆత్మహత్యలకు పాల్పడడం ఖాయమని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి నష్టపోయిన పంటలను గుర్తించి అట్టి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ న్యాల్కల్ మండలం చాల్కి గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌసియా బేగం, C/O మొహమ్మద్ మహాబూబ్ అనారోగ్య సమస్య రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.చికిత్స నిమిత్తం (250,000 /-) రెండు లక్షల యాభై వేల రూపాయలుఖర్చు వస్తుంది అని వైద్యులు తెలుపడంతో బాధితురాలికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సంప్రదించగా తక్షణమే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ మరియు రోడ్లు&భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాకారంతో బాధితురాలు మొహమ్మద్ గౌసియా బేగం గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద (250,000 /-)రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసి ని విడుదల చేయించారు,ఈ ఎల్ఓసి ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడు మొహమ్మద్ గౌసియా బేగం, C/O మొహమ్మద్ మహాబూబ్ కుటుంబ సభ్యులకు కీ అందించారు.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,సత్వార్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మాజీ వైస్ యం.పి.పి.రాములు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షులు జి.కిరణ్ కుమార్ గౌడ్,సీనియర్ నాయకులు భీమయ్య,వెంకట్ రెడ్డి, అశ్విన్ పాటిల్,ప్రతాప్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో న్యాల్కల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముహమ్మద్ యూనుస్ జహీరాబాద్ తమ బృందంతో చేరుకుని, మాజీ రాష్ట్ర మంత్రి మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ ఎంపీ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ లను జహీరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఇన్చార్జి క్యాంప్ ఆఫీస్ శుక్లా వర్ధన్ రెడ్డితో కలిసి న్యాల్కల్ మండల నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తును అందజేశారు. జడ్పిటిసి అభ్యర్థి ప్రకటిస్తే మండల ప్రజలను సేవలందిస్తానని ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సంగారెడ్డి ఉపాధ్యక్షుడు ముహమ్మద్ ముల్తానీ, జహీరాబాద్ మున్సిపల్ మాజీ సభ్యుడు ముహమ్మద్ ముయిజుద్దీన్, జహీరాబాద్ మున్సిపల్ మాజీ సభ్యుడు హఫీజ్ మహ్మద్ అక్బర్ హోగేలి, కాంగ్రెస్ జహీరాబాద్ మండల అడహాక్ కమిటీ అధ్యక్షుడు రాంలు యాదవ్, మహ్మద్ ఇనాయత్ అలీ మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ అయూబ్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని నిర్వహించిన
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా ఏ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ అధ్యక్షతన న్యాలకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా||చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నావారు,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినవారు మీ మండల అధ్యక్షులు తెలియజేసిన వెంటనే వారు మండలంలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులను పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా వారి పేర్లను ఇంచార్జ్ డా౹౹చంద్రశేఖర్ ద్వారా జిల్లా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది.మరియు కచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రతి గ్రామంలో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, నాయకులకు వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి పిఏసిఎస్ ఛైర్మెన్ సిద్దిలింగయ్య ఏ.యం.సి.వైస్ ఛైర్మెన్ తురుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ చంద్రప్ప మాజీ ఎంపీపీ రత్నం కాంగ్రెస్ నాయకులు మాక్సూద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు..
జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన భక్తులు మహా రాష్ట్రలోని తుల్జాపూర్ భవానీమాత ఆలయా నికి పాదయాత్రగా తరలివెళ్తున్నారు. వీరికి న్యాల్కల్ మండలంలోని మల్లి గ్రామ మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి స్థానిక నాయకు లతో కలిసి శుక్రవారం స్వాగతం పలికి జాతీయ రహదారిపై పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు విట్టల్, దత్తు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర
ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.
ఝరాసంగం : మన దేశంలో దసరా పండుగను ధనిక-బీద తేడా లేకుండా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన ప్రఖ్యాత శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అమ్మవారి పై ఉన్న భక్తితో కళ్లకు గంతలు కట్టి, కేవలం ఒక గంట పది నిమిషాల వ్యవధిలో మట్టితో మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. తన మదిలో తలచుకున్న అమ్మవారి రూపాన్ని ప్రతిష్టాత్మకంగా మలిచినట్లు తెలిపారు. “ప్రతి కళాకారుడి మదిలో రకరకాల కళారూపాలు దాగి ఉంటాయి. మనిషి ఏ విషయం పై ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయన్నారు. విశ్వాసం, నమ్మకం ఉంటే ఏ పని సాధ్యమే. భగవంతుని కరుణ ఉంటే విజయవంతం అవుతాం” అని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేడు న్యాల్కల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయులకు ఒక ఘనమైన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయుల అంకితభావం, కృషి, మరియు మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి అమూల్యమైన సేవలను గౌరవించి, గుర్తించారు.ఈ స్మరణీయ సందర్భంలో టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ సమీయుద్దీన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు చేసిన కృషికి, అంకితభావానికి గాను సత్కారం జరుగుతున్నందుకు నేను హృదయపూర్వక ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులను గౌరవించడం మాత్రమే కాకుండా, యువ ఉపాధ్యాయుల తరం మరింత జ్వాలంతమైన ఆవేశంతో అంకితభావంతో తమ సేవలను కొనసాగించేందుకు ప్రేరణనిస్తాయి. ఇంత అర్థవంతంగా గౌరవప్రదంగా ఈ వేడుకను నిర్వహించడం మా మండలానికి నిజంగా గర్వకారణమని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ న్యాల్కల్ జి. శ్రీనివాస్ ఎంఆర్ఓ న్యాల్కల్ ప్రభు ఎంఈఓ న్యాల్కల్ మారుతి రాథోడ్ మీర్జాపూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాజ్ కుమార్ మామిడి ప్రధానోపాధ్యాయలు చంద్రకళ వివిధ పాఠశాల ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామా మాజి సర్పంచ్ వీర్శెట్టి పాటిల్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు వారి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని మనోధైర్యని కలగజేశారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి ,మాజి సర్పంచ్ మాజి ఎంపీటీసీలు చంద్రన్న పటేల్, వెంకట్ శశి వర్ధన్ రెడ్డి,నాగన్న సయీద్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
న్యాల్కల్ మండల్ మల్టీ గ్రాము లోని హనుమాన్ మందిరం లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని దర్శించుకున్న కోలన్ నరసింహ రెడ్డి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతీ కురుమ దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కోలన్ నరసింహ రెడ్డి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతీ కురుమ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సిద్ధారెడ్డి బీఎస్పీ బీదర్ జిల్లా అధ్యక్షుడు యోహాన్ డిసౌజా మాజీ ఎంపీటీసీ జగన్నాథ్ గ్రామ పెద్దలు అర్జున్ బీరప్ప హనుమాన్ మందిర్ గణేష్ యూత్ సభ్యులు గణేష్ యోగేష్ జగన్నాథ్ సిద్దు భక్తులు తదితరులు పాల్గొన్నారు,
ఈ విషయాన్ని తెలుసుకున్న న్యాల్కల్ తహశీల్దార్ ప్రభు ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావు బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. వారిని తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. అంతేకాకుండా, ఆహారం, కొంత నగదు సహాయం అందజేసి ఆదుకున్నారు
గురుకుల బాలుర కళాశాలలో ఎస్సీ విద్యార్థులకు 10 సీట్లు ఖాళీలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల న్యాల్కల్ ప్రస్తుతం దిగ్వాల్ నందుగల జిఎంఆర్ పాఠశాల ఆవరణలో నడుస్తున్నది. ఇం దులో రెగ్యులర్ కోర్సుఅయిన ఎంపీసీ నందు ఎస్సీ విద్యార్థు లకు 10 ఖాళీలు కలవు. అదేవిదంగా ఓకేషనల్ కోర్సు అయి నటువంటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులలో 20 ఖాళీలు ఎస్సీ విద్యార్థులకు మాత్రమేమాత్రమే కలవు. కావున ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ దృవపత్రాలతో కళాశాలలో ప్రదాన ఆచార్యులకు కలసి ప్రవేశం పొందవలసిందిగా ప్రి న్సిపల్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని విద్యార్థులు సోమ, మంగళవారాలలో ఒరిజినల్ టీసీ, కుల, ఆదాయ పత్రాలతోవచ్చి ప్రవేశము పొందాలని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి సోమవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మినుము, పెసర, సోయా పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. వర్షం నీరు పంట పొలాల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.