ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం అధికారులు తనిఖీ.

ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం అధికారులు తనిఖీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రంలో వివిధ ఎరువులు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ టీం సబ్ ఇన్స్పెక్టర్ పాటిల్ క్రాంతి కుమార్ మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం యూరియా నిల్వల గురించి సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది ,
యూరియా ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు అమ్మవలెను, ఎరువుల నిల్వ మరియు ధరల వివరాలను స్టాక్ బోర్డు మీద రోజు వారిగా పొందుపర్చాలని సూచించారు.
అధిక ధరలకు అమ్మిన యెడల సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధున్ని ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు.

రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధున్ని ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ఎస్.కె గఫాషా( 80) అనే వృద్ధుడు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై గాయాలతో పడి ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి 108కు సమాచారం ఇవ్వడంతో అట్టి అంబులెన్స్ లో వృద్దున్ని చికిత్స నిమిత్తం వేములవాడ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం వృద్ధుడు మాత్రల కోసం మెడికల్ షాప్ కు వెళుతుండగా ఏమి జరిగిందో తెలువదు కానీ రోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నాడని వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి గణేష్ నాయక్, పైలట్ తోట నరేందర్, గ్రామస్తులు ఉన్నారు.

యూరియా కోసం బిఆర్ఎస్ ధర్నా – కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసి పరిషత్..

లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసీ పరిషత్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని లింగగూడెం మండల పరిషత్ పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు మాట్లాడుతూ పాఠశాల దుస్థితి శిథిలావస్థకు చేరి ఉన్నదని ఈ యొక్క పాఠశాల ను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అలాగే మండలంలోని వివిధ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి గుత్తేదారులు అసంపూర్తిగా పనులు చేశారని వాటినన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండెకట్ల మహేందర్ ఉపాధ్యక్షులు ఇసం లెనిన్ కోశాధికారి అరేం సందీప్ దొర మండల కార్యదర్శి ఇసం శివాజీ సలహాదారులు పెండేకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సిర్గాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రైతుల ధర్నా…

సిర్గాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రైతుల ధర్నా…

◆:-ముఖ్య అతిథిలుగా హాజరైన సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్…

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు,

◆:- నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* …

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నల్లవాగు ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల నీళ్ళు వదులుతూ ప్రజల మన్ననలు పొందాలని చూస్తే ఎవ్వరు పిక్చోలు లేరు అని డిమాండ్ చేశారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టు పైన మీ ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేశారు తెలపాలి
నల్లవాగు ప్రాజెక్టుకు మీరు ఎలాంటి రిపేర్లు చెయ్యలేదు నిధులు గాని మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ వారి వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్నారు మీరు. కాలువలు మరమ్మత్తులు గాని పూడిక తీయడం గాని చేసింది మా బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలోనని ఉన్న నీటిని అన్నారు. వ్యవసాయదారులకి అందించకుండా కాలయాపన చేసింది మీరు అని ఎద్దేవ్య చేశారు రైతులకు నీళ్లు ఇవ్వాలని మా పంటలు ఎండిపోయిన నష్టపోయే ప్రమాదం ఉందని ముందుకు వచ్చేసరికి ప్రజలు తిరగబడతారని ఉద్దేశంతో నేడు వచ్చి నీరు విడుదల చేస్తున్నావ్ కానీ మీరు నల్లవాగు ప్రాజెక్టు పైన ఇలాంటి నిధులు మంజూరు చేయలేదు ఇలాంటి పనులు చేయలేదు.కానీ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారూ.. కానీ ఇప్పటికైనా మీరు రైతులకు కనీసం యూరియా కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులను తప్పు దోవ పట్టించడం మానుకొని వాళ్లకు అందించాల్సిన యూరియా గాని నల్లవాకు ప్రాజెక్ట్ పైన కుడికాలువ ఎడమకలవల నీళ్లను గాని సకాలంలో అందిస్తూ అభివృద్ధికి పాటుపడేలా తప్ప మందిపై బురద జలగం మానుకోవాలని ఎద్దేవా చేశారు.

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల వైద్య శిబిరం…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు, టాబ్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, రోహిణి, నిహారిక, పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరి ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని వినాయక చవతి పండగ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడారు.రసాయన రంగులు అద్దిన విగ్రహాలను వాడొద్దని వాటి వల్ల నీరు కలుషితమై అటు వ్యవసాయానికి,ప్రజలు అనునిత్యం తాగే నీళ్లు చెరువు నుండి డ్యామ్లనుండి అలాగే గంగనుండి సేకరించి మిషన్ భగీరథ ద్వారా నీటిని మన ఇంటికి పంపుల ద్వారా అందిస్తున్నారు.కాబట్టి ఇప్పటికే మనం ఎన్నో మందులు లేని జబ్బులతో సతమవుతాం అవుతున్నామని,ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి గురై జబ్బులు వస్తాయని ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ గణేష్ మండపాలలో మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని తెలియజేశారు.అలాగే తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైభవం కోసం వైభోగం కోసం హంగులు ఆర్ బాటల కోసం పెద్ద పెద్ద ప్యారో ప్లాస్టో విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని పాడు చేయద్దని దిశా నిర్దేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. ఏదో పనిమీద వేరే ఊరి వెళ్ళినప్పుడు తాడి చెట్టు అంత ఎత్తున విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూచాయిగా దానికి ఎంత అయింది అని అడిగినప్పుడు 2,50,000 అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఎంపీడీవో స్పందించి ఇదే డబ్బులు మీరు పెదా,నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత పంచి వారి కుటుంబ పోషణకు ఉపయోగపడాలని అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ డబ్బులు డైవర్ట్ చేయమని సలహా ఇచ్చారన్నారు.ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తాండూర్ మండల ప్రజలు కూడా ఈరోజు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తాండూర్ మండలం ఆటో కార్మికులని,అధ్యక్షులని అభినందించారు. కార్యక్రమము తనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు కొత్తగా వచ్చిన తాసిల్దార్ ని,ఎంపీడీవో ని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.అదేవిధంగా హబీబ్ పాష మాట్లాడుతూ.. పార్కింగ్ స్థలాలు,ఆటో భవన్ నిర్మాణం కోసం ఆటో కార్మికులకు ఒక 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మార్వోకి ,ఎంపిడిఓకి తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ కి ,మాదారం ఎస్సై సౌజన్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆటో కార్మికులకి, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆటోమాలి,తీర్మాన కమిటీ సభ్యులు నీలపల్లి మల్లేష్,అచ్చులాపూర్ ఆటో కార్మికులు చందు,విజయ్ చింతల లచ్చన్న,కుచ్చుల సంతోష్,చంద్రవెల్లి నాగేష్,బట్టి తిరుపతి,తంగళ్ళపల్లి డ్రాగన్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T164829.319.wav?_=1

 

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిమండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డిహాజరై వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత రైతులను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేసిందని తెలిపారు.రైతులకు ఎరువులు సమయానికి అందకపోవడం వల్ల పంట నష్టాలు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకువచ్చి, ఎరువుల సరఫరా నిరవధికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి మండల రెవెన్యూ అధికారి గారికి ఈ విషయాన్ని తెలియజేసాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరాం,” అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.అలాగే, గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రైతుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ జిల్లా ఉపధ్యక్షుడు బొడ నరసిహ్మ పట్టణ అధ్యక్షులు బబిదేవ్ జిల్లా కాన్సిల్ సభ్యులు కిష్టారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు రహ్మతులా, pacs వైస్ చైర్మన్ శ్యాంసుందర్, గoగధర్,మండల ప్రధాన కార్యదర్శులు బచలకుర శ్రీశైలం,శ్రీను,ముదిరాజ్ నప శివ, ఉపాదేక్షులు బాలకృష్ణ, రాజశేఖర్, పానుగంటిశివ,మంద రజురెడ్డి, లిoగారెడ్డి,నాగరాజు,సురేష్ గౌడ్, వెంకటేష్, వినయ్ రెడ్డి, అంజనేయులు,అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం డిమాండ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-93-1.wav?_=2

నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వం

.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి….

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్

యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా మలహలరావు మండలం లోని కొయ్యూరు గ్రామంలోని ఆదివాసి గిరిజన కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది 60 కుటుంబాలు ఉన్న నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నాం నిరుపేదలైన ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వాయిస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఆ కాలనీవాసులను మందలించగా మాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ కాలనీ వెనుకబడిపోతుందని తక్షణమే సర్వే నిర్వహించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా అధికారులకు ఆదేశించాలని లేనియెడల నిరుపేదలను సమీకరించి ఆందోళనలో పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ దళితులకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి కూడా ఇల్లు అచ్చిన దాకాలు కానరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లన్న సేద మల్లేష్ గొట్టం సమ్మక్క అరవండి లక్ష్మి సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-92-1.wav?_=3

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

రామాయంపేట ఆగస్ట్ 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన 400 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎం. దేవేందర్ గారు పంపిణీ ప్రారంభించారు.

Clay Ganesha Distribution

ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను అందజేస్తోందని కమిషనర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తదనంతరం మిగిలిన విగ్రహాలను మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులకు వార్డు అధికారులు, మహిళా రిసోర్స్ పర్సన్‌ల సమక్షంలో పంపిణీ పూర్తి చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.

రామాయంపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-91.wav?_=4

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Freshers Party at Ramayampet Junior College.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

*జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T162411.931-1.wav?_=5

*జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 25:

 

సోమవారం చిత్తూరులోని హోటల్ భాస్కర(ఎన్
పి యస్)లో నిర్వహించిన చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బాబు ని, లీడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు ని తుడా చైర్మన్ ఘనంగా సత్కరించారు. తిరుపతి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు బూత్ స్థాయి నాయకులను కలుపుకొని కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతనిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తుడా చైర్మన్ తెలియజేశారు.

సుధాకర్ రెడ్డికి నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-89.wav?_=6

సూరుడు సుధాకర్ రెడ్డి కి జోహార్లు

కొండు బానేష్ సి పి ఐ తాండూరు మండల కార్యదర్శి *

మంచిర్యాల ఆగస్ట్ 25 నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కమ్యూనిస్టు దిగ్గజం భారత విప్లవోద్యమానికి తీరని నష్టం సిపిఐ అగ్ర నేత. మాజీ సిపిఐ ప్రధాన కార్యదర్శి. మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం భారత విప్లవోద్యమానికి తీరని నష్టదాయకమని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్టు అని జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను సవాళ్లను 20 సంవత్సరాల ముందే వాటి ప్రమాదాలు పర్య వస నాలను పసిగట్టి పార్టీ శ్రేణులను సమరశీల పోరాటాల వైపు నడుపుతూ భారత విప్లవోద్యమానికి ఉరకలు పెట్టించారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం పరిధిలోని సురవరం సుధాకర్ రెడ్డి అమ్మమ్మ గ్రామమైనకొండ్రావు పల్లిలో జన్మించాడని. అలంపూర్ తాలూకా పరిధిలోని కంచుపాడు స్వగ్రామంలో బాల్యం విద్య కర్నూలు జిల్లాలో విద్యను కొనసాగిస్తూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) లో చేరి విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగించిన సురవరం సుధాకర్ రెడ్డి అంచలంచలుగా ఎదుగుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా.
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా విద్య వైద్య ఉపాధి హక్కులకై ఉద్యమించి భారత విద్యార్థి యువతను ఏకం చేశా డని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ రథసారథిగా సిపిఐ నిర్మాణాన్ని పటిష్ట పరుస్తూ పాలకుల విధానాలపై సమర శంఖం పూరించాడని 1971లో సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా పని చేశారని 1985. 1989. 1994. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని 2004 లో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారని. కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పని చేయడంతో పాటు అనేక పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా పని చేశారని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ. 2012 మార్చి 31న పాట్నాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహాసభలలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మూడు పర్యాయాలు 2019 వరకు విశేష సేవలు అందించాలని రాజేశ్వరరావు తర్వాత సిపిఐ జాతీయ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సురవరం సుధాకర్ రెడ్డి అనేక ప్రపంచ దేశాలు పర్యటిస్తూ విప్లవ సిద్ధాంతాలను అంశాలను శోధించి కమ్యూనిస్టు మహానేతగా ఎదిగాడని సురవరం సుధాకర్ రెడ్డి వామపక్ష ఐక్యత కోసం పరితపిస్తూ మామపక్ష ఐక్య ఉద్యమాన్ని నిర్మించారని సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని. జిల్లాలో కరువు సమస్య ప్రాజెక్టుల సాధన. జల వివాదాల పరిష్కారం లాంటి అనేక సున్నిత అంశాలను కూడా సాధించి పెట్టారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సురవరం పాత్ర మరువలేనిదని ఆయన మృతి యావత్ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సామాజిక లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు తీరని నష్టమని సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కంకణా బద్దులు కావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
భయ్యా మొగిలి గోలేటి బ్రాంచి ఏఐటియుసి ఉపాధ్యక్షులు.
వాసాల నాగరాజు సిపిఐ తాండూర్ మండల ఆర్గనైజరీ సెక్రటరీ.
పట్టి శంకర్ సిపిఐ తాండూరు మండల కోశాధికారి.
కొండు సాయికుమార్ సిపిఐ చంద్ర పల్లి గ్రామ కార్యదర్శి.
కుర్సింగ తిరుపతి సిపిఐ 3 ఇంక్లైన్ గ్రామ కార్యదర్శి.
కంబాల చందు. కంబాల రాజయ్య. ఇందారపు పోషం. ముత్తె శంకర్. కొండు రాజేశం. గో గర్ల దుర్గయ్య. రాగుల రామ్ సాయి. నసిరుద్దీన్. తదితరులు పాల్గొన్నారు

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161734.060-1.wav?_=7

 

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ చౌరస్తాలో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వలన స్థానికులకు చాలా పెద్దగా భారం పడుతున్నది కావున
కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురి కార్మికులు మాట్లాడుతూ, వలస వచ్చినా కార్మికులు మేము మాట్లాడిన పనికి వాళ్ళు చానా తక్కువ ధరకు మాట్లాడి మాకు పనులు లేకుండా చేస్తున్నారు ఎందుకో మరి వాళ్లకు మా మీద కోపం మేము కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్నదే మా ఉద్దేశం వాళ్లు కూడా మాతో కలిసి పని చేస్తే వాళ్లకు మంచి జీవనోపాధి ఉంటది మాకు స్థానిక యూనియన్ నిర్ణయించిన ఉపాధి ఉంటది. వాళ్లు రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిండ్రు అని, మా స్థానిక యూనియన్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం నడవాలని కోరారు. కావున కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని, మా జీవనోపాధి పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉందనీ అన్నారు. అయితే, సరైన రీతిలో పనులు లేకపోవడం, తగిన అవకాశాలు కల్పించకపోవడం వలన మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాల నుండి వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ఐక్యంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మా సమస్యలను గమనించి తక్షణమే పరిష్కారం చూపకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల అసోసియేషన్ నేతలు అధ్యక్షులు సమీర్, జన్ను సునీల్, ఉపాధ్యక్షులు ఫిరోజ్, ఫయాజ్, తాజ్ ఫిరోజ్, అయూబ్, జలీల్, చెన్నూరి కిషోర్, రాజేందర్, నాసం హరీష్, సాదిక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-88-1.wav?_=8

నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులను ఆదేశించారు.
ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్తు సరఫరాకు, మైకు ఏర్పాట్లుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. లూజు విద్యుత్తు వైర్లు వాడరాదని, ఎంసిబి వేయాలని, వేలాడే విద్యుత్తు తీగల నుండి వైర్లు ఏర్పాటు ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మండపాల వద్ద వ్యర్థాలు వేసేందుకు అనువుగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్తు తీగల క్రింద విగ్రహాలు ఏర్పాటు వల్ల విద్యుత్తు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన ఉత్సవాలు జరగాలని అన్నారు. నిమజ్జన రోజున అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో. పాటు మహాదేవపూర్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబా ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ సేవలు వినియోగించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాలలో నిమజ్జనానికి నీటి వనరులను గుర్తించాలని, నిమజ్జనం చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ శోభా యాత్ర సందర్భంగా క్రమ సంఖ్యలో వెళ్ళడానికి అనువుగా నంబర్లు కేటాయించాలన్నారు. మండపాల ఏర్పాటును పోలీస్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా రహదారుల పై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో గతంలో కూడా సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగాయని, ఈ దఫా అదే స్ఫూర్తితో మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్తు, క్రేన్లు, మంచినీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=9

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

భాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివాళులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-87.wav?_=10

 

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

 

దామెర మండలంలోని కొగిల్ వాయ్ గ్రామానికి చెందిన జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి కొండి మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా దశదినకరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్,మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారయణ రావు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్,మాజీ మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు,గంకిడి బూచి రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T155542.794.wav?_=11

 

*ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..

*టిడిఆర్ బాండ్లు అర్హులైన వారికి ఇస్తున్నాం..

*గ్రామాలనుంచి వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలి..

*శెట్టిపల్లి భూముల సమస్య త్వరలో పరిస్కారం…

*ఆదాయం పెంపుదలకు కొత్త లే అవుట్స్ ఏర్పాటు..

*పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ..

తిరుపతి(నేటిధాత్రి)ఆగస్టు 25 :

 

ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.
సోమవారం ఉదయం తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ ,తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారుతుడా టవర్స్ , ప్లాట్స్ , దుకాణాల పై వచ్చే అదాయ, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వి.సి., జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. టౌన్ షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్ లను వినియోగించాలని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణా రెడ్డి, శ్యాంసుందర్, ఈ.ఈ.లు రవీంద్ర,తులసి కుమార్, గోమతి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154921.524.wav?_=12

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి బస్సులు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ఎంత అవసరం ఉంటాయి అలాంటి వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ గద్దెనింకినంక విద్యార్థులకు ఎందుకు గుర్తురారని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఇకనైనా విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్రంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్,సాయి,విఘ్నేష్,ప్రదీప్,చారి,వైష్ణవి,మానస, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version