మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,.

మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,

కేసముద్రం/ నేటి దాత్రి

 

రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని జనవిజ్ఞాన వేదిక కేసముద్రం మండల అధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్, ప్రధాన కార్యదర్శి బండారు నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.

వారు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్( పి ఓ పి) విగ్రహాలను నదులు, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఆ విగ్రహాల్లో వాడే కెమికల్ రంగులు నీటిని కలుషితం చేసి, చేపలు మరియు జలచరాల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నాయి. చివరికి ఇది మనిషి ఆరోగ్యానికే హానికరమవుతోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మట్టితో తయారు చేసిన విగ్రహాల ప్రాముఖ్యతను వివరించారు. మట్టి విగ్రహాలు నీటిలో కరిగిపోవడం వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదని, మట్టి తిరిగి నేలలో కలిసిపోయి భూమి సారాన్ని పెంచుతుందని తెలిపారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఇది ఉపయోగకరమని, స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మట్టి విగ్రహాల వాడకం సహకరిస్తుందని అన్నారు.

ప్రజలందరూ పర్యావరణ హిత దృక్పథంతో ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలనీ, శుభ్రమైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో భాగస్వాములు కావాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని వినాయక చవతి పండగ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడారు.రసాయన రంగులు అద్దిన విగ్రహాలను వాడొద్దని వాటి వల్ల నీరు కలుషితమై అటు వ్యవసాయానికి,ప్రజలు అనునిత్యం తాగే నీళ్లు చెరువు నుండి డ్యామ్లనుండి అలాగే గంగనుండి సేకరించి మిషన్ భగీరథ ద్వారా నీటిని మన ఇంటికి పంపుల ద్వారా అందిస్తున్నారు.కాబట్టి ఇప్పటికే మనం ఎన్నో మందులు లేని జబ్బులతో సతమవుతాం అవుతున్నామని,ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి గురై జబ్బులు వస్తాయని ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ గణేష్ మండపాలలో మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని తెలియజేశారు.అలాగే తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైభవం కోసం వైభోగం కోసం హంగులు ఆర్ బాటల కోసం పెద్ద పెద్ద ప్యారో ప్లాస్టో విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని పాడు చేయద్దని దిశా నిర్దేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. ఏదో పనిమీద వేరే ఊరి వెళ్ళినప్పుడు తాడి చెట్టు అంత ఎత్తున విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూచాయిగా దానికి ఎంత అయింది అని అడిగినప్పుడు 2,50,000 అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఎంపీడీవో స్పందించి ఇదే డబ్బులు మీరు పెదా,నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత పంచి వారి కుటుంబ పోషణకు ఉపయోగపడాలని అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ డబ్బులు డైవర్ట్ చేయమని సలహా ఇచ్చారన్నారు.ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తాండూర్ మండల ప్రజలు కూడా ఈరోజు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తాండూర్ మండలం ఆటో కార్మికులని,అధ్యక్షులని అభినందించారు. కార్యక్రమము తనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు కొత్తగా వచ్చిన తాసిల్దార్ ని,ఎంపీడీవో ని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.అదేవిధంగా హబీబ్ పాష మాట్లాడుతూ.. పార్కింగ్ స్థలాలు,ఆటో భవన్ నిర్మాణం కోసం ఆటో కార్మికులకు ఒక 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మార్వోకి ,ఎంపిడిఓకి తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ కి ,మాదారం ఎస్సై సౌజన్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆటో కార్మికులకి, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆటోమాలి,తీర్మాన కమిటీ సభ్యులు నీలపల్లి మల్లేష్,అచ్చులాపూర్ ఆటో కార్మికులు చందు,విజయ్ చింతల లచ్చన్న,కుచ్చుల సంతోష్,చంద్రవెల్లి నాగేష్,బట్టి తిరుపతి,తంగళ్ళపల్లి డ్రాగన్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి ఎస్సై జాడి శ్రీధర్

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి

ఎస్సై జాడి శ్రీధర్

జైపూర్,నేటి ధాత్రి:

 

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా,జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలని జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.
https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు,విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,ఏ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు,కమిటీ సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు,విగ్రహం ప్రతిష్టించే రోజు,నిమజ్జనం చేసే తేదీ సమయం,ప్రదేశం,ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు.అన్ని వివరాలు మండప నిర్వహకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు,వాలంటీర్ల వివరాలు,ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాల నమోదుకి సంబంధించి ఏవైనా సందేహాలుంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని,శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 డయల్ 112 ను సంప్రదించాలని తెలియజేశారు.మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించే వారు సామరస్యపూర్వక వాతావరణం లో , శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ కి సహకరించాలని కోరారు.
ఇంతకు మునుపు వినాయక మండపం ఏర్పాటు చేసినటువంటి,ఎలాంటి వివాదాస్పదం కాని ప్రదేశంలో మాత్రమే మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని, విద్యుతు ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,స్త్రీలకు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన క్యూలైన్లు నిర్వహించి వారిని గౌరవించాలని,వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండపాల నిర్వహకులకు ఎస్సై శ్రీధర్ సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version