న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోండి…

న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోండి

రోడ్లపై మద్యం తాగి వాహనం నడిపితే జైలు పాలె

డీజేలు పెట్టినా చట్ట ప్రకారం కేసులు తప్పవు

తాండూర్ సీఐ దేవయ్య

తాండూరు నేటి ధాత్రి :

 

మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలో గల ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ…
నూతన సంవత్సర వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక చేశారు.డిసెంబర్ 31 రాత్రి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోందని సీఐ దేవయ్య తెలిపారు.ముఖ్యంగా యువత ఉత్సాహం పేరుతో చేసే విన్యాసాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి:

మీ పిల్లలను నూతన సంవత్సర వేడుకల్లో ఎటు బయటకు పంపకుండా మీ యొక్క పర్యవేక్షణలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనికోరారు.అలా కాకుండా అత్యుత్సాహంతో రోడ్లపైకి వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

మద్యం తాగి వాహనం నడిపితే అంతే జైలు పాలె

డిసెంబర్ 31 సాయంత్రం నుంచే పట్టణంలోని ప్రధాన రహదారులు,కూడళ్ల వద్ద నిరంతర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సిఐ స్పష్టం చేశారు.మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించకుండా అక్కడికక్కడే వాహనాలను జప్తు చేస్తామని,డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.

డీజేలకు నో పర్మిషన్ రోడ్లపై రచ్చ వద్దు

పట్టణ పరిధిలో ఎటువంటి డీజే సౌండ్ సిస్టమ్స్‌ కు అనుమతి లేదని అన్నారు.అధిక శబ్దాలతో ఇరుగుపొరుగు వారికి, వృద్ధులకు,రోగులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.బహిరంగ ప్రదేశాల్లో,రహదారుల పైన మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని,అటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.

రేసింగ్‌లు చేస్తే క్రిమినల్ కేసులు

యువత బైక్‌లపై రేసింగ్‌లు చేయడం, సైలెన్సర్లు తొలగించి అతి వేగంగా ప్రయాణించడం వంటివి చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ దేవయ్య తెలిపారు.న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని,చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి…

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి

వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించం – ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఓదెల మండలంలో నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని,మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది.ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినా, మీ న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మకూడదు.బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామని,మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఎవరైన ఈ నియమాలను అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ కు మండల ప్రజలు సహకరించాలని కోరారు.2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని పోత్కపల్లి పోలీస్ పోలీసు విజ్ఞప్తి చేస్తోంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, నిరంతర పెట్రోలింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి..

నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

◆-: ఝరాసంగం ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రజలు, యువత నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించుకోవడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే తమ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని ఝరాసంగం ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి వేడుకలకు అనుమతి లేదని ర్యాలీల పై పూర్తిగా నిషేధం ఉందని అన్నారు నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించడం, అనుమతి లేకుండా పార్టీలను ఏర్పాటు చేయడం, డీజేలు, భారీ సౌండ్ తో శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి చర్యలు చట్టరీత్యా నిషేధించబడినవని స్పష్టం చేశారు.

ఈ నిషేధాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీలు ఉంటాయన్నారు. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని తమ ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రజల క్షేమమే పోలీసుల ప్రధాన ధ్యేయమని, యువత క్షేమమే సమాజ భవిష్యత్తని భావించి ఈ సూచనలు జారీ చేయడం జరుగుతుందన్నారు. 

న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి..

న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి
ఎస్సై బోరు గల అశోక్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపు కోవాలని ఎస్సై బోరు గల అశోక్ అన్నా రు. శనివారం విలేకరులతో మాట్లా డుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మొగుళ్ళపల్లి మండలంలోఆవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ప్రజల భద్రత శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించు కోవడం ప్రతి ఒక్కరికి హాక్కేననిఅయితే ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై తిరగరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్..

 న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్.. 350 మంది అరెస్ట్, 40 ఆయుధాలు స్వాధీనం

 

నూతన సంవత్సర వేడుకల ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 150 మందిని అరెస్ట్ చేసి, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం..ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ ఆఘాత్’ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నేడు (డిసెంబర్ 27) ప్రకటించిన ఈ ఆపరేషన్‌లో దక్షిణ ఈశాన్య జిల్లాలోని హాట్‌స్పాట్‌లపై రాత్రివేళ దాడులు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version