శ్రీ ఆదర్శవాణిలో మాదక ద్రవ్యాలపై అవగాహన
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండల కేంద్రంలో గల శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో మాదక ద్రవ్యాలపై ఎస్సై రావుల రణధీర్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దుగ్గొండి బ్రాంచ్ శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్ లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం సమాజంలో ఆన్ లైన్ మోసాలు, డేటా హాకింగ్, ఫేక్ అకౌంట్ వంటి సైబర్ నేరాల గురించి వివరించామన్నారు.రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రతినెల ఒక క్లాస్ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.మొబైల్ ఫోన్లో వస్తున్న ఫేక్ మెసేజ్లను ఇతరులకు షేర్ చేయకూడదుని తెలిపారు.అకౌంట్లో డబ్బులు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ జరిగినట్లయితే వెంటనే 1930 నెంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ మారక ద్రవ్యాలు, పాను,గుట్కా గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో అనుమానాస్పదంగా అనవసరమైన లింకులు,పాస్ వర్డ్ మొబైల్ ఫోన్ లో వస్తున్నాయని అటువంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కవిత బిక్షపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.