ప్రైవేటు స్కూళ్లలో దోపిడీ.. పాఠశాలల్లో జోరుగా పుస్తకాలు, యూనిఫామ్‌ విక్రయాలు

[5:30 pm, 22/05/2026] +91 99890 79788: ప్రైవేటు స్కూళ్లలో దోపిడీ.. పాఠశాలల్లో జోరుగా పుస్తకాలు, యూనిఫామ్‌ విక్రయాలు

జహీరాబాద్ నేటి దాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్‌లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఏకంగా స్కూళ్లల్లోనే స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. బుక్స్‌ మాత్రమే కాదు.. యూనిఫాం, టై, బెల్టులు తమ వద్దనే కొనాలని అంటున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫాం, టై, బెల్టుల అమ్మకాలతో పాఠశాలల దుకాణాలను మరిపిస్తున్నాయి. ప్రైవేటు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందించాల్సిన యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు స్టడీ మెటీరియల్‌, అదీ ఇదీ అంటూ వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిబంధనలను భేఖాతరు చేస్తున్నా సంబంధిత అధికారులు పాఠశాలల వైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది.

అధిక ఫీజులు.. వసతులు కరువు…

నియోజవర్గంలోని ఆయా మండలాల్లో ప్రైaజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో సామర్థ్యానికి మించి ఇరుకు గదుల్లో 30 నుంచి 50 వరకు విద్యార్థులను కూర్చొబెట్టి పాఠ్యాంశాలు బోధిస్తుండటంతో పాఠ్యాంశాలు అర్థమయ్యేదెలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరో వైపు కొన్ని పాఠశాలలో వేలాది మంది విద్యార్థులుంటే టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు పదుల సంఖ్యలో ఉండటంతో క్యూలో నిలబడి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

షాపులుగా మారిన పాఠశాలలు..

పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచే ప్రైవేటు పాఠశాలలు షాపులుగా మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. పాఠశాల ప్రారంభం నుంచి విద్యార్థుల స్టడీ మెటీరియల్‌ కొనాలనే ఉపాధ్యాయుల ఒత్తిడితో తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతన్నారు. ప్రారంభంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలతో పాఠ్యాంశాలు మొదలుపెట్టాల్సిన ఉపాధ్యా యులు టై, బెల్టులు, యూనిఫాం, షూ, స్టడీ మెటీరియల్‌ తప్పనిసరని చెప్పటంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఆర్థికభారంతో సతమతమవుతున్నారు.

అధిక ఫీజుల నియంత్రణపై అధికారుల పట్టింపేది ?

 

కూలీ, నాలీ పనులు చేసుకొని పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. అధిక ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి సారించి నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
[5:30 pm, 22/05/2026] +91 99890 79788: Enda

భూసార పరీక్షలే రైతుకు మార్గదర్శకం..!

భూసార పరీక్షలే రైతుకు మార్గదర్శకం..!

జహీరాబాద్ నేటి దాత్రి:

ఝరాసంగం: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా రసాయన ఎరువుల వినియోగం చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి, న్యాల్ కల్ మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ సూచించారు. బుధవారం ముంగి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, నకిలీ పత్తి విత్తనాల విక్రయిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. నిషేధిత “హెచ్లో” పత్తి విత్తనాలను కొనొద్దని తెలిపారు. యూరియా కొనుగోలు కోసం యూరియా యాప్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. విజయకుమార్, విజయలక్ష్మి చెరకు సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఏఈఓ లు సాయిలు, సన్నిధి రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, మాధవి, రమేష్ పాటిల్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మహిళల అదృశ్యం..

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మహిళల అదృశ్యం..

జహీరాబాద్ నేటి దాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటనలు కలకలం సృష్టించాయి. జహీరాబాద్ మండలం హోతి(బి) గ్రామానికి చెందిన షరీఫా బేగం ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శివ్వంపేట మండలం మగ్ధుంపూర్కు చెందిన మహేశ్వరి చర్చికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

శాన్విక పవర్‌కు గోల్డ్ మెడల్

అవధూత దత్త పీఠం గణపతి సచ్చితానంద స్వామి చేతుల గోల్డ్ మెడల్ బహుమతి

బంజారా ముద్దుబిడ్డ శాన్విక పవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కర్ణాటక మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చితానంద స్వామి చేతుల మీదగా శ్రీమత్ భగవద్గీత రెసిటేషన్ ఎగ్జామ్ లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెందిన ఐదవ తరగతి బాలిక , బంజారా ముద్దుబిడ్డ శాన్విక పవర్ తండ్రి పేరు వినయ్ పవర్ , NHRC సంగారెడ్డి జిల్లా చైర్మన్ కూతురు భగవద్గీత చూడకుండా మొత్తం పుస్తకాన్ని చదివింది ఎ క్కడ ఏ శ్లోకం అడిగినా కంఠస్థగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సాన్విక పవర్ కు గోల్డ్ మెడల్ బహుమతిగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు హిందువులు విద్యార్థి విద్యార్థులు భగవద్గీత తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం మైనార్టీ సోదరులు ఏ విధంగా ఖురాన్ చదువుతారు , మన క్రైస్తవ సోదరులు సంబంధించిన బైబిల్ చదువుతారు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు మీ ఇంట్లో తప్పనిసరిగా భగవద్గీత చదవాలి ప్రతి ఇంట్లో భగవద్గీత ప్రతి పూజ మందిరంలో ఉండాలి ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.

బీరప్ప స్వామి-కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా

బీరప్ప స్వామి-కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్ మండల కేంద్రంలోని డప్పూర్ గ్రామ శివారులో ఆదివారం, మే 3, 2026న శ్రీ బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం కురుమ సంఘాల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు కలశాలతో ఊరేగింపులో పాల్గొనగా, డోలు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ మహోత్సవం కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని స్థానికులు తెలిపారు.

108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్…

108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి

మండల కేంద్రంలో గ్రామ గ్రామానికి సేవలందిస్తున్న 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్, భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ తో కలిసి 108 వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి. అనంతరం 108 వాహనంలో ఉండే పరికరాలు, మందులలభ్యత,బీపి అపరేటర్,ఆక్సిజన్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈఎంటి, పైలెట్లు నిత్యం 108 వాహనానికి అందుబాటులో ఉండే వచ్చిన ఎమర్జెన్సీ కాలనీ లిఫ్ట్ చేసి అతి త్వరలోనే రోగులను ప్రభుత్వ హాస్పటల్ కి చేరవేర్చే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఈఎంటి బట్టా.సుమలత, పుల్లయ్య, పైలెట్ గాడిపల్లి సాయి, సాంబశివరావు పాల్గొన్నారు.

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి…

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి
. కబ్జాలను తొలగించండి
.అమీన్పూర్ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఈర్ల వెంకటేష్

నేటి ధాత్రి, పాటన్ చేరు :

కృష్ణారెడ్డిపేట 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు జరుగుతున్నాయి అంటూ పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట రెవెన్యూ సర్వేనెంబర్ 164 రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి. అని ప్రధానంగా మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ కబ్జాకు పాల్పడినట్టు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అమీన్పూర్ తహసిల్దార్ ఆర్డర్ నెంబరు బి /413/2023 ప్రకారం కబ్జాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు… ఇప్పటికైనా 164 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమాలను తొలగించి విలువైన ప్రభుత్వములను కాపాడాలని కబ్జాదారులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ అన్నారు ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం పాఠశాలలు ఆసుపత్రులు ఏర్పాటు కోసం కాకుండా బెల్ట్ షాపుల మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ఎంతో బాధాకరమని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు బెల్ట్ షాపులకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్న ఘనత మాజీ ఎంపీపీ ఈర్ల దేవానందుదేనని,ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ రకమైన కబ్జాలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వ భూములలో నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కోరారు

నిమ్జ్‌ నిరీక్షణకు తొలగిన తెర….!

నిమ్జ్‌ నిరీక్షణకు తొలగిన తెర….!

◆”-: రూ:10628 కోట్ల పెట్టుబడులతో మౌలిక వసతులు

◆”-: పలు కంపెనీలకు 1186 ఎకరాల భూముల కేటాయింపు

◆”-: తొలి దశలో..”కంపెనీల ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపనలు”..!

◆”-: కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, నిర్మలా జగ్గారెడ్డిల చొరవతో చురుగ్గా పనులు పరిశ్రమల ఏర్పాటుతో వేలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఊపొందుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం

◆-: నిమ్జ్‌ ప్రాజెక్టు ఏర్పాట్లపై “(నేటి ధాత్రి)” ప్రత్యేక కథనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్, పలు పరిశ్రమల ఏర్పాటు కోసం 201355.. 51 . 49 మేర కేంద్ర పెట్టుబడులతో ఏర్పాటు చేసిన “జాతీయ పెట్టు బడులు ఉత్పాదకమండలి” (నిమ్జ్‌) ప్రాజెక్టు ఏర్పాటుకు 14 సంవత్సరాల అనంతరం ఎట్టకేలకు తెరపడింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ల చొరవతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పనులు చక చక కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్‌ ప్రాజెక్టు పనుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్, ఝరాసంఘం మండలా ల్లోని 17 గ్రామాల్లో.. దాదాపు 12600 ఎకరాల్లో పలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేపట్టింది.ఈ నెల మార్చ్ 2న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, విశాలాక్షి, జహీరాబాద్ ఆర్థిఓ దేవుజా, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, పరిశ్రమల యాజమాన్యంతో..”పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన” తదితర అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సేకరించిన నిమ్జ్‌ భూముల్లో సర్వే చేపట్టి, హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రసక్తే లేదని, పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

శరవేగంగా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం..

ఈ పాటికే పలు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ముమ్మురంగా పనులను చేపట్టింది. తొలి విడతగా న్యాల్ కల్, ఝరాసంఘం మండలాల్లో 3500లను గుర్తించిన భూముల్లో 3245 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు మార్చ్ తొలి వారంలో కసరత్తు చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, డీఎస్పీ, తహసిల్దార్లు, సీఐ, పోలీస్ బృందం రక్షణలో స్థానిక భూ నిర్వాసితులతో చర్చించి ఈ పాటికే సేకరించిన భూముల్లో సర్వే చేపట్టి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్తు, సీసీ రోడ్లు, నీటి సౌకర్యం, కార్మికుల కోసం షెడ్ల ఏర్పాట్లు, తదితర పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

1186 ఎకరాల్లో.. రూ:10628 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు..

తొలిదశ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారంలో భాగంగా అధికార యం త్రాంగం పలు పరిశ్రమల ఏర్పాటుకు 1186 ఎకరాలను కేటాయిం చింది. కేటాయించిన భూముల్లో “హ్యుందాయ్” (కార్ల పరిశ్రమ) కంపెనీ ఏర్పాటు కోసం కంపెనీ యాజమాన్యం ఇటీవలే కేటాయించిన భూము లను పరిశీలించింది. 511ఎకరాల్లో రూ:1000 కోట్లతో ఈవీఎం టెక్నాలజీ సంస్థ ఈ పాటికే ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా 675 ఎకరాల్లో రూ.8528 కోట్లతో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. రూ:2100 కోట్లతో ఎలక్ట్రానిక్ కార్ల తయారీకి ఈ వాటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ప్రాజెక్టుల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసి పూర్తిచేరినట్లు తెలుస్తోంది.

హద్దురాళ్లను తొలగిస్తే చర్యలు, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం..

పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టి హద్దురాళ్లను ఏర్పాటు చేసింది. మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగిస్తే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అధికార బృందానికి ఆదేశించారు. నిమ్స్ ఆధీనంలోని భూముల్లో రైతులు సాగుచేసిన పంట లకు నష్టం కలిగించకూడదని, తప్పనిసరిగా పంటలకు నష్టం వాటిల్లితే సంబంధిత భూ.నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్ స్థానిక అధికార బృందానికి ఆదేశించినట్లు సమాచారం.

జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు..

జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేశారు. మద్యం, గంజాయి, పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, 6వ వార్డులోని బాబా నగర్ కాలనీలో సీసీటీవీ కెమెరాలు మరియు ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు.సాయంత్రం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జహీరాబాద్ రూరల్ ఎస్ఐ శ్రీ కాశీనాథ్ మరియు సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ సీసీటీవీ కెమెరాలు, ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు.బాబా నగర్ నాయకులు మరియు యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సర్పంచ్ జగదాంబ రంజాన్ సందర్భంగా మసీదు కమిటీకి రూ.11,000 అందజేత…

సర్పంచ్ జగదాంబ రంజాన్ సందర్భంగా మసీదు కమిటీకి రూ.11,000 అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్ గ్రామ సర్పంచ్ జగదాంబ, పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకున ముస్లిం సోదరులకు స్థానిక మసీదు కమిటీకి రూ.11,000 నగదును అందజేశారు. ఎన్నికల సమయంలో విజయదశమి, క్రిస్మస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, రంజాన్ వంటి పండుగలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా సహాయం అందించిన జగదాంబ, తాజాగా రంజాన్ పండుగకు కూడా చేయూతనిస్తూ తన మాట నిలబెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.

గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….

గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పలు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కూలిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనులు మంగళవారం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.

పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ఎం రాజ్….

పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ఎం రాజ్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం రాజ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, విద్యార్థుల చదువుతున్న తీరు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలో సీఆర్పీ రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం: రైతుల ఆనందోత్సాహాలు…

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం: రైతుల ఆనందోత్సాహాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ చక్కెర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీని క్రషింగ్ ప్రారంభానికి సిద్ధం చేస్తూ యంత్రాలకు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించిన యాజమాన్యం, త్వరలో క్రషింగ్ ప్రారంభిస్తామని తెలిపింది. ఫ్యాక్టరీ పునఃప్రారంభంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గంగాపూర్ గ్రామ ప్రజలకు రేషన్ దుకాణం లేక తీవ్ర ఇబ్బందులు…

గంగాపూర్ గ్రామ ప్రజలకు రేషన్ దుకాణం లేక తీవ్ర ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండల పరిధిలోని గంగాపూర్ గ్రామం కొత్త పంచాయతీగా ఏర్పడి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ, ఇప్పటివరకు గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులను పొందడానికి గ్రామస్థులు సమీపంలోని టేకూర్, ధర్మపూర్ తదితర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.రేషన్ సరుకులు తీసుకురావడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు కూడా సరైన విధంగా లేకపోవడంతో కొందరు ప్రజలు రోజంతా సమయం వెచ్చించి రేషన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చాలా మంది ప్రజలు తమకు లభించాల్సిన రేషన్ సరుకులను కూడా సకాలంలో పొందలేకపోతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గంగాపూర్ గ్రామం పంచాయతీగా ఏర్పడిన తర్వాత కూడా మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం సకాలంలో అందుతుందని వారు చెబుతున్నారు.కాబట్టి సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి గంగాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా రేషన్ దుకాణం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

చేనిగేపల్లిలో భారీ వర్షం, ఈదురుగాలులతో బీభత్సం: విద్యుత్ సరఫరా నిలిచిపోయింది :

చేనిగేపల్లిలో భారీ వర్షం, ఈదురుగాలులతో బీభత్సం: విద్యుత్ సరఫరా నిలిచిపోయింది :

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చేనిగేపల్లి గ్రామంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వానతో బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారిపై పడిపోయాయి, కొన్ని కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై చెట్లు, విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన స్తంభాలు, చెట్లను తొలగించే పనులు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

లైలతుల్ ఖాదర్ రాత్రిను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు….

లైలతుల్ ఖాదర్ రాత్రిను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలోని అలంగిరి జామియా మసీదులో రంజాన్ మాసం 27వ తేదీని లైలతుల్ ఖద్ర్ అంటారు. అదే రోజు, వారు ఖురాన్ పారాయణం పూర్తి చేసిన రోజున మసీదు నాయకులను పూలమాలలు మరియు శాలువాలతో సత్కరించి ఘనంగా జరుపుకున్నారు.వారు రాత్రంతా మేల్కొని దేవుడిని ప్రార్థిస్తూ, దేశంలో మరియు గ్రామంలోని ప్రజలందరి ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పవిత్ర రంజాన్ మాసంలో ఒక నెల పాటు కఠినమైన ఉపవాసాలు పాటించిన తర్వాత, గ్రామ పెద్దలు ఈ రోజు పండుగ జరుపుకునే ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు గ్రామస్తులు మరియు మసీదు పెద్దలు పేర్కొన్నారు. ముస్లింలు తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఈద్-ఉల్-ఫితర్‌ను సంతోషంగా జరుపుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, రైతుల ఉత్సాహం

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం: రైతుల ఆనందోత్సాహాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ చక్కెర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీని క్రషింగ్ ప్రారంభానికి సిద్ధం చేస్తూ యంత్రాలకు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించిన యాజమాన్యం, త్వరలో క్రషింగ్ ప్రారంభిస్తామని తెలిపింది. ఫ్యాక్టరీ పునఃప్రారంభంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు సాయంత్రం సంగారెడ్డి జిల్లా పారామెడిక్స్ ఆర్.ఎం. పి , పి.ఎం .పి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనారిటీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి…

మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి…

జహీరాబాద్ నతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మునిసిపాలిటీలోని వార్డులను శానిటైజ్ చేయడానికి కొత్తగా నియమితులైన ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ ఒక దరఖాస్తును సమర్పించారు, ఎందుకంటే కోహీర్ మునిసిపాలిటీలో ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ దీనిపై దృష్టి పెట్టడం లేదని, ప్రజల నుండి చెత్తను సేకరించడానికి ఏడుగురు సిబ్బంది సరిపోరని వారు అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయానికి ట్రాక్టర్ల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు కొన్ని వార్డులలో మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేకపోవడం వల్ల తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version