నూతన సర్పంచ్ మాజీ మంత్రి హరీష్ రావుతో జహీరాబాద్‌లో భేటీ

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన నూతన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును బుధవారము ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా రాజకీయ పరిస్థితుల గురించి, ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు రాలేదని గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినా నూతన సర్పంచ్ తదితర అంశాలపై హరీష్ రావుకు వివరించారు. తమ గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పలు ప్రజా సమస్యలను ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి హరీష్ రావును సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గ్రామ నాయకులు మరియు సర్పంచ్ మరియు పార్టీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ పత్రాల పంపిణీ

ఉచిత కరెంట్ పత్రాన్ని అందచేసిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో బాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ పత్రాన్ని అందచేసిన గ్రామ పెద్దలు…వినియోగధారులకు సంక్రాంతి పండుగ శుభకాంక్షలు తెలిపిన ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన రేవంత్ సర్కార్…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, ఉపసర్పంచ్ మంగళి దత్తు,వార్డు సభ్యులు వై నగేష్,చాకలి మాణయ్య,మొగులయ్య, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు, గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, శేరి సంగమేష్,రామయ్య,జర్నయ్య, కాశీనాథ్, హరి,పాపయ్య,సంజీవులు హెల్పర్, ముజీబ్,తుకారం,సుకుమార్,పాండు,బీరప్ప, శేఖర్,లింగరాజ్ మహిళలు ఈశ్వరమ్మ,లక్ష్మి,అనసుజ తదితరులు పాల్గొన్నారు..

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నారాయణాఖేడ్ నియోజకవర్గంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ గారి స్వగృహంలో సంక్రాంతి పండుగ సందర్బంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్,జీత్తు శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అప్పారావు శెట్కార్ కలిసి కైట్లను ఆవిష్కరించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, చైనా మంజాను వినియోగించకూడదని, ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ పద్ధతుల్లోనే పండుగను జరుపుకోవాలని సూచించారు. అలాగే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, సాంప్రదాయ విలువలపై వివరించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పండుగలతో అనుబంధాలు బలపడతాయి: మోటే ధర్మారావు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి..

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమైందని ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతులు దింపాలని సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరాలని ఈ ఏడాది పొడుగునా ఇంటింటా సిరులు కాంతులు విరిసిల్లాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భోగి, సంక్రాంతి కనుమ పండుగలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అని ఆయన తెలిపారు. కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలని కోరారు.
పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు.
పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

భారత సంస్కృతికి సంక్రాంతి ప్రతీక: చిత్తూరు ఎంపీ

*సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భారత దేశం…

*ప్రకృతిని ఆరాధించే పండుగే సంక్రాంతి…

*ఆచార వ్యవహారాలను ఆరాధించే గొప్ప సియం చంద్రబాబు నాయుడు…

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…

*తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

చిత్తూరు (నేటిధాత్రి:

 

 

సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం ప్రతీక అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనమన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకుంటూ.. “సంక్రాంతి” పండుగ వైశిష్ట్యాన్ని భావితరాలకు తెలియజేస్తున్న
స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఏ.పి. సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు,
తెలుగు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ మూడు రోజుల సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సంక్రాంతి అందరిలోనూ నూతన వెలుగులు తీసుకొస్తుందనీ ఆయన కాంక్షించారు.
మానవునిలో నూతన ఉత్తేజాన్ని నింపేవి పండుగలన్నారు.ఆధ్యాత్మికంగాను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని ఈ పండులు ప్రతిబింబిస్తాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.

ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్…

ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ను జంగవానిగూడెం గ్రామ సర్పంచ్ గొంది సోనీ రాజు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్‌ఐ రాజ్‌కుమార్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పండుగ వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జంగవానిగూడెం ఉప సర్పంచ్ అలెం మహేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సారంగపాణి, దారం భూపాల్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్‌రోలర్ చారి ఇతర గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version