డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు, యువత కీలకం…

డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు, యువత కీలకం

గుండాల సిఐ లోడిగ రవీందర్

గుండాల,నేటిదాత్రి:

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు మంగళవారం
నషా ముక్తా భారత్ అభియాన్ ఐదేళ్ల పూర్తి సందర్భంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా గుండాల ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల నందు సామూహిక ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సిఐ లోడిగ రవీందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి, ముఖ్యంగా ప్రతి పోలీసు, యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ అలవాటు వ్యసనంగా మరి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం, సమాజం మొత్తాన్ని దెబ్బతీస్తుందని యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆన్నారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, యువత సైబర్ వారియర్గా పనిచేస్తున్నారు అని ఇకనుండి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు ప్రజలంతా పాటుపడాలని కోరారు.
మాదకద్రవ్యాల నివారణలో పోలీసు ప్రజా భాగస్వామ్యం కీలకమని సి ఐ రవీందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కాలేజ్ ప్రిన్సిపాల్ నారాయణ నాయక్,వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు…

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

రోడ్డు భద్రతపై మందమర్రి పోలీసుల క్రియాశీలక అడుగులు: యువతతో ‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ ఒక ముఖ్యమైన అవగాహన సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా యాపల్, అంగడి బజార్, మేదరి బస్తి ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారి (ఎన్.హెచ్)రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలు నాలుగు నెలల్లోనే నాలుగు-ఐదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సదస్సును యాపల్ ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది.

అవగాహన అంశాలు:

ఈ సదస్సులో పోలీసులు రహదారి భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, తప్పనిసరిగా సీట్‌బెల్ట్ మరియు హెల్మెట్ వాడకం గురించి వీడియోలు, ఛాయాచిత్రాల (ఫోటోల) ద్వారా ప్రజలకు వివరించారు.

యువతకు ప్రత్యేక సూచనలు:

పిల్లలకు వయస్సు పూర్తి కాకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పక పాటించాలని, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని అధికారులు తెలిపారు.

‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు:

ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించడానికి, ప్రమాదాల నివారణకు కృషి చేయడానికి యాపల్ ప్రాంతంలో కొంతమంది యువతతో పోలీసులు ఒక ‘రోడ్డు భద్రతా కమిటీ’ని ఏర్పాటు చేశారు.

అందులో ముఖ్యులుగా అబ్బాస్, వనం నరుసయ్య, వెంకటరెడ్డి, సాంబమూర్తి, రాచర్ల రవి, రాజేశ్ చోట్టన్, రామ, సుజాత, సంగత్రి సంతోష్, అంజయ్య లైన్‌మెన్, భూపెల్లి కానుకయ్య, శ్రీనివాసు ఈ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

డి.సి.పి. ప్రసంగం:

కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డి.సి.పి. మాట్లాడుతూ, రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏ.సి.పి., మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, సి.ఐ., ఎస్.ఐ.లను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు “రోడ్డు సరిగా లేక యాక్సిడెంట్ అయింది” అనడం లేదా మద్యం సేవించి నడిపిన వ్యక్తిని పట్టుకుంటే, “ప్రభుత్వమే వైన్ షాపులు బంద్ చేయించొచ్చు కదా” అంటూ చేసే వితండవాదం సరికాదని డి.సి.పి. స్పష్టం చేశారు. ఇటువంటి వితండవాద ధోరణిని మార్చడానికి, ప్రజల్లో బాధ్యత పెంచడానికి ఈ అవగాహన సదస్సులు ఉద్దేశించబడ్డాయని ఆయన వివరించారు.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏ.సి.పి. రవికుమార్, మందమర్రి సి.ఐ. శశిధర్, ట్రాఫిక్ ఎస్.ఐ. రంజిత్, ఎస్.ఐ. రాజశేఖర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ) ప్రతినిధులు, మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version