సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి….

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి.

బాలానగర్ ఎస్సై లెనిన్.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

రానున్న సంక్రాంతి పండగ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ప్రజలు ఊరెళ్ళితే తమ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఎస్సై లెనిన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు బలంగా మూసివేయాలన్నారు. ఇంట్లోనే నగదును, బంగారం, వెండి నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలన్నారు. రాత్రి వేళలో ఇంటిముందు లైట్లు వెలిగించాలని, “పండగకి ఊరికి వెళ్తున్నాం” అని సోషల్ మీడియాలో పెట్టకూడదన్నారు. ఇంటిముందు చెట్ల పొదలు ఉంచరాదన్నారు. ఇంటికి కాపలా వాచ్ మెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ఇంటి తాళాలను పూల కుండీలలో, మ్యాట్ కింద భద్రపరచరాదన్నారు. పొరుగింటి వారికి తమ ఇంటిపై నిఘా పెట్టాలని సూచనలు ఇవ్వాలన్నారు. అద్దె ఉన్న యజమానులు ఖాళీగా ఉన్న ఇండ్లపై నిగా పెట్టాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

: ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

 

శీతాకాలం కావడంతో సాధారణంగా గీజర్లు వాడకం పెరిగిపోయింది. అయితే.. వీటిని ఉపయోగించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన గీజర్ పేలుడు ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

ఇంటర్నెట్ డెస్క్: చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రిక్ గీజర్లను(Electric Geyser) వాడుతుంటారు. ఇవి మనకు వేడి నీటిని అందిస్తున్నప్పటికీ.. వీటి నుంచి ముప్పు వాటిల్లే అవకాశాలూ ఎక్కువే. గతంలో ఢిల్లీలో ఓ మహిళ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఏపీలోని తాడిపత్రిలో గీజర్ పేలడంతో సుమారు 8 మంది గాయపడ్డారు. ఇలా గీజర్లను ఉపయోగించడం తెలియక చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గీజర్ల వాడకంపై తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం…
ఎలక్ట్రిక్ గీజర్లలో ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా చాలా మంది చిన్న లీకేజే కదా అని నిర్లక్ష్యం తీసుకుంటారు. ఇది పేలుడుకు దారితీసే అవకాశముంది.

గీజర్ పేలడానికి మరో కారణం అధిక పీడనం. గీజర్ థర్మోస్టాట్ సెన్సార్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది. నీరు వేడికావడం నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరాక.. ఈ సెన్సార్ గీజర్‌కు విద్యుత్‌ను నిలిపేస్తుంది. ఈ సంకేతంతో పవర్ ఆఫ్ చేయాలి.చాలా మంది రాత్రంతా గీజర్లను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల నీరు చాలా వేడిగా మారుతుంది. దీనివల్ల పీడనం ఎక్కువై.. గీజర్ పేలిపోయే ఛాన్స్ ఉంది.

గీజర్లో నీరు లేనప్పుడు దానిని ఆన్ చేయవద్దు. ఇది గీజర్ వేగంగా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల పెద్ద ప్రమాదానికీ దారితీయవచ్చు.

గీజర్లలో అమర్చిన ప్రెజర్ వాల్వ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. లేదంటే ఈ వాల్వ్ దెబ్బతినడం వల్ల పీడనం ఎక్కువై గీజర్ పేలుడుకు కారణమవుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version