వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే రేవూరి.

వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
గురువారం పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మాచబోయిన ఓదెమ్మకి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వీల్ చైర్ ని అందించి వృద్ధిరాలితో కాసేపు ముచ్చటించి వారి ఆరోగ్య బాబోగుల గురించి తెలుసుకొని వృద్ధురాలికి ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమం లో నాగారం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బిక్షపతి,యూత్ అధ్యక్షులు మాచబోయిన అజయ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు,అల్లం రఘు నారాయణ,బొమ్మకంటి చంద్రమౌళి,చందుపట్ల రాఘవ రెడ్డి,పర్నెం మల్లారెడ్డి,కొత్తపల్లి రవి,బొచ్చు సంపత్,బొచ్చు మోహన్,కొక్కిరాల తిరుపతి రావు,మడికొండ చంగల్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ సభ్యులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డ్ విద్యానగర్ ఏరియాలో 4.75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 92 మీటర్ల సిసి రోడ్డు పనులకు గురువారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి లు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 17వ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల నిధులతో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు.బడ్జెట్ లేని కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఇకనుండి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయించారని త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రవీందర్, వెంకటేష్ కిష్టయ్య, రాజయ్య, కళ్యాణ్, కనకరాజు, వేణు, రమేష్, విజయ, పుష్ప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు రాజ్యాధికారం రావాలంటే పోరాటం తప్పదు.

బీసీలకు రాజ్యాధికారం రావాలంటే పోరాటం తప్పదు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్

పరకాల నేటిధాత్రి
బీసీలకు రాజ్యాధికారం రావాలంటే పోరాటం తప్పదని బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇంచార్జి ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ అన్నారు.గురువారం రోజున మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మనమంతా ఏకతాటిపై ఉండి ఏకం కావలసిన అవసరం ఉందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మన బీసీల సత్తా చాటాలని మల్లేశం గౌడ్ అన్నారు.అనంతరం గ్రామకమిటిని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా కోడెల సతీష్,ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీధర్ కాసగాని సాయికుమార్,ప్రధాన కార్యదర్శి చిర్ర హరీష్,కార్యదర్శులు రాస రాజేష్,ఎండి.హుస్సేన్ కోశాధికారి గోపరాజు లింగస్వామి,కార్యవర్గ సభ్యులుగా దొమ్మటి భద్రయ్య, చిర్ర భద్రయ్య ల్,ఏదునూరి లింగయ్య,దానం ఓదెలు,కొయ్యల అనిల్ కుమార్,కొయ్యలరమేష్,తడక పూర్ణచందర్,కొక్కుల శ్రీనివాస్,దొమ్మటి రమేష్,చిర్ర రాజయ్య,చిర్ర సాంబయ్య,కోడల భాస్కర్,కోడల రాజేందర్,ఎలగందుల విష్ణు,చిర్ర వివేక్ వర్ధన్,తడక శ్రీనివాస్,చిర్ర ప్రశాంత్,గాజర్ల యల్లేశ్వర్ బీసీ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ స్పీకర్ గారిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

అసెంబ్లీ స్పీకర్ గారిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

అసెంబ్లీ స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అభ్యర్థించిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి
తెలంగాణ జన సమితి
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ రాష్ట్రంలోబీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత భద్రత కల్పించాలని తెలంగాణ
జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష డిమాండ్ చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు మాట్లాడారు
తెలంగాణలోబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని వారు కోరారుతెలంగాణ జనసమితి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం పార్లమెంట్ లో చట్టంచేసి తొమ్మిదవ షెడ్యూల్ ఈసమావేశంలో పిక్కిలి బాలయ్యశాంతారామ్ నాయక్
కె రమేష్. తదితరులు ఉన్నారు

బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు..

బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుక

నిజాంపేట, నేటి ధాత్రి

మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుకను మెదక్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. మావు రం రాజు మాట్లాడుతూ నాపై ప్రేమాభిమానాలు చూపి నాకు దీవెనలు అందించిన తిరుపతి రెడ్డి అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, బిఆర్ఎస్వి రాష్ట ఉపాధ్యక్షుడు పడాల సతీష్,ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్.కూర్తివాడ మాజీ సర్పంచ్ శ్రీను.బిఆర్ఎస్వి మెదక్ జిల్లా నాయకులు గంజి నవీన్.గోపీని సాయి. పంపరి నగేష్, సంగు స్వామి, మల్లేశం , వంశీ ,శివ, మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలి..

కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలి

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

ఈనెల 5నుండి వార్డుల కమిటీలు ఏర్పాటుచేయాలనీ పిలుపు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T143008.262.wav?_=1

పరకాల నేటిధాత్రి

420 దొంగ హామీలిచ్చి కాంగ్రెస్‌ గద్దెనెక్కిందని ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.గురువారం పరకాలలో పట్టణ బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని,ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన బిఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు.పార్టీ కోసం పనిచేసే వారికే అవకాశాలు పార్టీ కల్పిస్తుందని పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు.బిఆర్ఎస్ అధికారంలో ఉండగా పదవులు అనుభవించి మోసం చేసి పార్టీ మారిన ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకునేదిలేదని స్పష్టం చేశారు.ఈ నెల 5తేదీ నుండి పరకాల పట్టణంలో వార్డుల వారిగా సమావేశాలు నిర్వహించి 5 రోజుల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని సీనియర్ నాయకులకు ఆదేశించారు.అనంతరం పట్టణ కమిటీ ఎన్నిక ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.కమిటీల ఏర్పాటుకు ఇంచార్జీలుగా పరకాల మాజీ ఎంపీపీ నేతాని శ్రీనివాస్ రెడ్డి,సంగెం మండల మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి,నడికుడ మండల మాజీ రైతుబంధు కన్వీనర్ సూదాటి వెంకటేశ్వర రావు,దామెర మండల పార్టీ అధ్యక్షులు గండు రాము మరియు పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే నియమించారు.పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేసే విధంగా కమిటీల ఏర్పాటు ఉండాలన్నారు.

పార్టీలో అవకాశాలు రాని నాయకులు,కార్యకర్తలు నిరాశ చెందవద్దని,పార్టీ అందరికి సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు.కాంగ్రెస్ అక్రమ కేసులకు,బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని మీకు అండగా ఎల్లపుడు నేను ఉంటానని రాబోయే రోజులు బిఆర్ఎస్ వే అన్నారు.బేషజమ్యాలకు వెళ్లకుండా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,మాజీ ప్రజాప్రతినిధులు,యూత్ నాయకులు,మాజీ మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు,సొసైటీ చైర్మన్లు,డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

నా చివరి శ్వాస వరకు భూపాలపల్లి ప్రజలతోనే..

నా చివరి శ్వాస వరకు భూపాలపల్లి ప్రజలతోనే

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మాజీ స్పీకర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్చారి అంబేద్కర్ విగ్రహానికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలవేసి బిసి బీసీలకు న్యాయం జరగాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ నా చివరి శ్వాస వరకు భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలతోని కలిసి ఉంటారని అన్నారు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T125812.349.wav?_=2

తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి రాష్ట్రాన్ని కెసిఆర్ నాయకత్వంలో సాధించడం జరిగింది అనంతరం 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి నేను ఎమ్మెల్యేగా భూపాలపల్లి నియోజకవర్గంలో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి కెసిఆర్ నాకు స్పీకర్ పదవిని ఇవ్వడం జరిగింది దానితో భూపాలపల్లి నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశాను అనంతరం జిల్లా ఏర్పాట్ల కూడా నా వంతు కృషిచేసి ప్రొఫెసర్ జయశంకర్ పేరుమీద జయశంకర్ నూతన జిల్లాను తీసుకురావడం జరిగింది నియోజకవర్గం లోని అనేక గ్రామాలలో పర్యటించి పల్లెనిధులు చేసి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాను కావున నా అభిమానులు కార్యకర్తలు ప్రజలు భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు నా చివరి శాస వరకు భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలతోని ఉంటాను ప్రతి నెలలో రెండు రోజులు నియోజకవర్గంలోని ఉంటాను ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని అన్నారు ఈ కార్యక్రమంలో సిరికొండ అభిమానులు పాల్గొన్నారు

బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు..

బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు

ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేనాగరాజు కృతజ్ఞతలు తెలిపిన మంద రిషిత్ కుటుంబ సభ్యులు.

*రూ. 7,00,000/-ల LOC వారి కుటుంబసభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T125256.326.wav?_=3

వర్దన్నపేట (నేటిధాత్రి ):

వర్ధన్నపేట నియోజకవరం వర్ధన్నపేట మండల పరిధి లోని చెన్నారం గ్రామానికి చెందిన మంద నాగరాజు కుమారుడు మంద రిషిత్ 3సం. చెవ్వు సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరతో కోటి ప్రభుత్వ ENT ఆస్పత్రికి లో చికిత్స కోసం బాధిత కుటుంబానికి రూ. 7,00,000/-ల (7లక్షల రూపాయల LOC ) కాపీని నేడు హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు బాధిత కుటుంబ సభ్యులు అందజేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు…
నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులు మంద నాగరాజు, కొమురమ్మ ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న, ఓబీసీ జనరల్ సెక్రటరీ ఉప్పరపల్లి యాదగిరి, మండల యూత్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, బర్ల సతీష్, మాజీ గ్రామ సర్పంచ్ సింధం లక్ష్మి నారాయణ, కల్లెపు రాజు, తో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….

రాష్ట్ర బిఆర్ఎస్ నాయకుడు షేక్ ఫరీద్ మాజీ మంత్రి.

రాష్ట్ర బిఆర్ఎస్ నాయకుడు షేక్ ఫరీద్ మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T123507.346.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ – రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు మరియు రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు ఆల్ హజ్ షేక్ ఫరిద్రుద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్, యునైటెడ్ డిస్ట్రిక్ట్ మెదక్ శివకుమార్ తో కలిసి పవిత్ర హజ్ చేసిన తర్వాత మాజీ రాష్ట్ర మంత్రి మరియు ఎమ్మెల్యే సిద్దిపేట టి. హరీష్ రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, హరీష్ రావు నాయకులతో వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మరికొందరు కూడా పాల్గొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ షేక్ సజావుద్దీన్,

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T123025.410.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంతో పాటు వివిధ గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ షేక్ సజావుద్దీన్ సూచించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో చెరువును వాగులు, వంకల దగ్గర పిల్లలు కాని పెద్దలు గాని వెళ్లొద్దని అలాగే గ్రామాలలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని రోడ్డు వెంబడి ఉన్న కల్వర్టు దగ్గర నీరు ప్రవహించేటప్పుడు బండ్లతో దాటే ప్రయత్నం చేయరాదని ఆయన ప్రజలకు సూచించారు.

ఎంపీ భరత్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*ఎంపీ భరత్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 29:

సినీ హీరో.., హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు.., విశాఖపట్టణం పార్లమెంటు సభ్యులు
భరత్ కి. చిత్తూరు పార్లమెంటు సభ్యులు, తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు సహచర ఎంపీలతో కలిసి బుధవారం ఢిల్లీలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని.., ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నట్లు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి ,

పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన , శాంతమ్మ రాములు కు చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం లబ్దిదారుల తో కలిసి భూమిపూజ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

వెల్దండ/ నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామ బీఆర్ఎస్ నాయకుడు గండికోట రాజు ఆధ్వర్యంలో.. బుధవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.. కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు కోసం రోడ్డు తవ్వి కంకర పరిచారని నెలలు గడుస్తున్నా… బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో కంకర రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.

శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

*శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 29:

చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాతృమూర్తి కీ!!శే!! లక్ష్మి భారతి ఇటీవల వైకుంఠ ప్రాప్తి పొందారు. బుధవారం పులివర్తి వారి పల్లిలోని వారి స్వగృహమునందు జరిగిన శుభ స్వీకరణ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాతృమూర్తి లక్ష్మి భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. లక్ష్మి భారతి అమ్మ
ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పల్ల రాజేశ్వర్ రెడ్డి సహకారం తో ఇందిరమ్మ ఇండ్లు..

పల్ల రాజేశ్వర్ రెడ్డి సహకారం తో ఇందిరమ్మ ఇండ్లు

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల మండలంలో కడవెరుగు గ్రామంలో జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు కొమ్ముల యాదమ్మ మంజూరు అయినా ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి ,గదరాజు నరసింహులు, లింగము మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన బి ఆర్ ఎస్ పట్టణ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు గారి , ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గాను ₹3,39,500 విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది.
లబ్ధిదారుల వివరాలు:-అల్లిపూర్ కి చెందిన పళ్ళ్లి లలిత ₹.55,500/-,గిరి శంకర్ ₹.33,000/-,మొహమ్మద్ ఇస్మాయిల్ ₹.60,000/- రాం నగర్ కి చెందిన మొహమ్మద్ సాధక్ గారికి ₹.29,500/- రాచన్నపేట్ కి చెందిన మర్వెళ్ళ్లి వెంకట్టయ్య ₹.19,000/- ఏపీ హెచ్ బి కాలనీ కి చెందిన సోమ్ శేఖర్ ₹.11,500/- రంజోల్ కి చెందిన కొత్త కళావతి ₹.11,500/-, మంగలి అంబిక ₹.9,000/- ఆర్య నగర్ కి చెందిన నిశ్రత్ ఫాతిమా ₹.13,500/-, హోతి కె కి చెందిన బుష్ర బేగం ₹.60,000/- పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.16,000/-మాణిక్ ప్రభు స్ట్రీట్ కి చెందిన కంది రాం రెడ్డి ₹.21,000/- ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి హజ్ కమిటీ మెంబర్ మొహమ్మద్ యూసఫ్ ,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల ,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్య ముదిరాజ్,గణేష్ ,ప్రభు ,శంకర్ పటేల్ ,దీపక్,ప్రవీణ్ మెస్సీ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ:-

పాల్గొన్న వరంగల్ మరియు హన్మకొండ లీగల్ సెల్ సభ్యులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

బుధవారం రోజున  తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ పిలుపు మేరకు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఒక గర్వకారణమైన మరియు ప్రాముఖ్యతగల ఘట్టంగా, “సాంవిధానిక సవాళ్లు: దృక్కోణాలు & దారులు” అనే శీర్షికతో జరగనున్న జాతీయ సదస్సు పోస్టర్‌ను హన్మకొండ ఉమ్మడి జిల్లా కోర్ట్ లోనీ డాక్టర్ బి . ఆర్ అంబేద్కర్ హాల్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సామంతుల శ్రీనివాస ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 2న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ ఏ ఐ సి సి లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ సింఘ్వి ఆధ్వర్యంలో జరగనున్న రాజ్యాంగ సవాళ్లు పై జాతీయ సదస్సు ను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గ,తో పాటు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ కోకొండ రమేష్, రాష్ట్ర కన్వీనర్లు ముదసిర్ అహ్మద్ కయ్యుమ్,పోషిని రవీందర్, రాజోజు వేణుగోపాల్,కునూరు రంజిత్ గౌడ్, రాష్ట్ర వైస్ చైర్మన్లు నల్ల మహాత్మా, , నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్,తో పాటు సీనియర్ నాయకులు తోట రాజ్ కుమార్, పసుల యాక స్వామి,, గునిగంటి శ్రీనివాస్, రఘుపతి, హరి హర కుమార్, అరుణ్ ప్రసాద్, సూరం నరసింహ స్వామి, దయాన్ శ్రీనివాసన్, శ్రీనాథ్, గంప వినోద్ కుమార్, మహేందర్, రాజు, శ్రీరామ్ నాయక్, బిక్షపతి, సదానందం,  రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం

దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

ఎమ్మార్వో,ఎంపిడిఓ కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి పనిచేస్తున్నారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో తహశీల్దార్ రాజేశ్వర్ రావు,ఎంపిడిఓ అరుంధతి,ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు బుదవారం మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.

Congress ranks meet MRO, MPDO

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుక్క రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తూన్నా ప్రజా నాయకుడు దొంతి మాధవ రెడ్డి అని అన్నారు. పేదోళ్ళ సొంతింటి కల నెరవేర్చేందుకుగాను ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నియోజకవర్గంలో రేషన్ కార్డ్ ఇవ్వలేదని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇంచ్చిందన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూన్నా ఘనత రాష్ట్ర ప్రభుత్వందే అని పేర్కొన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్, ఉపాధ్యక్షులు నల్ల వెంకటయ్య, కామ శోభన్ బాబు,కోశాధికారి జంగిలీ రవి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మ లక్ష్మయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఎంపిటిసి సభ్యులు బొల్లపెల్లి రాము,నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగం శివాజీ,గిన్నె స్వామి, విరాట్, రాజేశ్వర్ రావు,తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ…

భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ

జైపూర్,నేటి ధాత్రి:

భీమారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల కార్యచరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే మండల అధ్యక్షుడు కాసెట్టి నాగేశ్వర్ రావ్ ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి,భీమారం మండల ఎన్నికల కన్వీనర్ మాడెం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్,కొమ్ము దుషాంత్,కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్,దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్,మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version