భీమారం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్,సీఐ నవీన్ తో కలిసి భీమారం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్బంగా డీసీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలిచడంతో పాటు,స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు,స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు,గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది కి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,పోలీస్ స్టేషన్ రికార్డ్ లను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై డిసీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను ఎస్సై రాజేందర్ ని అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని,మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
