జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి.సర్పంచ్ ఆకుల రవి కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్యనారాయణ పని స్థలాన్ని సందర్శించి నీటి నిల్వలను పెంపొందించడం కోసం తీసే కాలువలను త్రవ్వే పనులను ఉపాధి హామీ పథకం క్రింద ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కూలీలతో చర్చ గోష్టి జరిపి, రోజువారి కూలి 307 రూపాయలు వచ్చుటకు త్రవ్వవలసిన ప్రభుత్వ నిర్దేశిత కొలతలను గురించి,పనిచేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ,ఏపీవో,టెక్నికల్ అసిస్టెంట్,పంచాయతి కార్యదర్శి,ఫీల్డ్ అసిస్టెంట్,సర్పంచ్ రవికుమార్,ఉప సర్పంచ్ సంధ్యారాణి,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, పారదర్శక పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలు ( మురికి కాలువలు, తాగునీరు, విద్యుత్), పారిశుధ్యం, మరియు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ కట్టుబడి ఉన్నామని. గ్రామ సభలు, ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరిస్తూ, కార్యక్రమాలతో ఆదర్శ గ్రామాలుగా మార్చడమే నా లక్ష్యం అని అన్నారు. ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి రెండు గ్రామాలు ఉండగా ఒకటి తుమ్మనపల్లి రెండవది కె. సంఘం గ్రామం ఉంది అదేవిధంగా మంగళవారం కె. సంఘం గ్రామంలో మురికి కాలువలు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు గ్రామాన్ని అభివృద్ధి దిశగా దూసుకెళ్లించి, సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరిస్తానని తెలిపారు.తాగునీరు, మురుగు పనులు, యువతకు అవకాశాలు కల్పించి గ్రామాన్ని మార్పు చూసేలా పనిచేస్తానని అన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించగా, వాటిని పరిష్కరిస్తానని వారు తెలిపారు. కే.సంఘం గ్రామంలో మాట ఇచ్చిన ప్రకారం రోడ్ల పనులను ప్రారంభించారు పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి సంఘం కి పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపిటిసి నవాజ్ రెడ్డి తదితరులు ఉన్నారు,
77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి విక్రాంత్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ప్రతాపరెడ్డి షరీఫ్ పటేల్ ఖదీర్ చాంద్ పాష ఆశప్ప రమేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం
నేటి ధాత్రి అయినవోలు:-
సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి భవాని మాత దేవాలయ సమీపంలోని మురికి కాలువలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. పెళ్లి కానీ యువతికి పుట్టిన శిశువు అయి ఉండొచ్చని, శిశువుకు అవయవాల లోపంతోనే చనిపోయి ఉండొచ్చని స్థానికులు అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ గోపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు.
శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం
పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్
శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.
శాయంపేట మండల కేంద్రంలో మరియు పలు గ్రామాల్లో వీధి కుక్కలకు వింత రోగం సోకిం దని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ వీధికి వెళ్లిన కుక్కలకు చర్మము ఊడి నల్లటి మచ్చలతో దర్శనమి స్తున్నాయి దద్దుర్లు లేచి దుర దతో కుక్కలకు పుండ్లు నీరు కారడంతో ఈగలు దోమలు వాలి ఇండ్లలోకి వస్తున్నాయని కుక్కలకు సోకిన ఎలర్జీ చర్మ రోగం మనుషులకు సోకే ప్రమా దం ఉందని ప్రజలు భయభ్రాం తులకు గురవు తున్నారు.
గ్రామపంచాయతీ పరిధిలో అధిక శాతం వీధి కుక్కలకు చర్మవ్యాధి సోకింది, పలు గ్రామాల్లో గుంపులు గుంపులు గా స్వేరవిహారం చేస్తున్నాయి. తీవ్రమైన చర్మ వ్యాధికి సోకి కుక్కలు మృత్యువాత పడు తున్నాయి వ్యాధిన బారిన పడిన కుక్కలు, మరొక్క కుక్కలు కలిసి ఆహారాన్ని తిన్న, వేరొక ద్రవపదార్థాలను తీసుకుంటే వాటికి కూడా వ్యాధి సోకుతున్నట్లు స్థానికు లు చెబుతున్నారు. అవి సంచ రించే ప్రాంతాల్లో దమ్ము, ధూళి గాలి తాకిన జనాలకు ఈ వ్యాధి వ్యాపిస్తుందని కొందరు భయపడు తున్నారు.పరిస్థితి విష మిం చిన పశు వైద్యాధి కారులు, పంచాయతీ అధికా రులు ప్రజాప్రతినిధులు పట్టిం చుకున్న దాఖనాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ అధికారులు, పారిశుద్ధ్యం, శానిటైజర్ పై ప్రత్యేక చొరవ చూపాలని కుక్కలకు పశు వైద్య అధికారులు సూచనలు సలహాలతో నివారణ చర్యలు చేపట్టి, ప్రజల ఆరోగ్యం కాపా డాలని మండల ప్రజలు కోరు తున్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చే వారి జీవన ప్రయాణ మెరుగుపరచడానికి తెలంగా ణ ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మా ణాన్ని అమలు చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన సొంతింటి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి తగిన సహాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు చర్చించారు. శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావలసిన ఇసుక మొరం వాటిపై ప్రభుత్వ అధికారులు చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక రవాణా పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వ నిబంధనలు అనుగు ణంగా సరఫరా వ్యవస్థను నిమిత్తం ఇసుక తరలించే వాహనాలకు లైసెన్సు కలిగి ఉండి కూపన్ల సహాయంతో సరఫరా చేయాలి ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మకూడదని తెలియజేశారు ఇట్టి నియమా లను పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సీఐ రంజిత్ రావు ,ఎస్సై పరమేశ్వర్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణిచంద్ర , గ్రామపంచాయతీ కార్య దర్శి అధికారులు పాల్గొ న్నారు.
శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామ స్తులు ఎదురుచూస్తున్నారు మండలానికి రావాలంటే చుట్టూ గ్రామాలు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ఏటా అధికా రులు ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతుందని ప్రజలు వాపోతున్నారు.
ఈసారైనా నెరవేరేనా!
గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రాజకీయ నాయకులు గ్రామ నాయకులు వేడుకున్న పట్టించుకోకపోవ డం కాని తర్వాత అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజ లు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ముందున్న లక్ష్యం కాబట్టి ఈసారి తమ కల నెరవేరుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు దశాబ్దాల తరబడి ఎదుర్కొం టున్న తమ సమస్యకు పరి ష్కారం చూపాలని నేరేడుపల్లి చలివాగు బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు
చుట్టూ తిరిగి వెళుతున్నాం
నేరేడుపల్లి,పత్తిపాక రహ దారిపైబ్రిడ్జికి మోక్షం కలిగే నా!.
ఇబ్బంది పడుతున్న రైతన్నలు.
శాయంపేటమండలం పత్తిపాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు మోక్షం ఎప్పు డెప్పుడా అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మండలానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడిన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయాల పార్టీలు నాయ కులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం ఆ తర్వాత విస్మరిం చడం పరిపాటిగా మారింది. పత్తిపాక,నేరేడుపల్లె గ్రామానికి రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నా రు మండల గ్రామానికి అతి సమీపంగా ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు ఇబ్బందులు గురవు తున్నారు గత ప్రభుత్వం రోడ్డు మార్గము వాగు దాక వేసి కరెంటు అన్ని ఏర్పా టు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కుని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పుడైనా పూర్తి చేయాలి
ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూపులు మిగిలాయి ఈసారి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని, ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.
Local Election Buzz
కూడగట్టుకుంటున్న మద్దతు
సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు
నేతల చుట్టూ చెక్కర్లు.
సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.
Local Election Buzz
ఓటరు జాబితా ప్రచురణ
ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.
ఝరాసంగం(జహీరాబాద్): మండల కేంద్రంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివే శారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఓ పక్క కూలిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలతో భవన యజమాని కూల్చివేత పనులు ప్రారంభించారు. కొన్ని ఏళ్ల పాటు ఓ వైపు కుటుం బం నివాసం ఉండటంతో పాటు అప్పట్లో పోలీస్ స్టేషన్, ఆ తర్వాత బీసీ సంక్షేమ వసతి గృహం కొనసాగింది. అనంతరం సినిమా ప్రదర్శనల తోపాటు ప్రైవేటు కార్యాలయం ఏర్పాటు చేశారు.
జహీరాబాద్ మండలం లోని తుంకుంట గ్రామం లో ఆదివారం పంచాయతీ కి సంబంధం లేని వ్యక్తి పంచాయతీ కార్యాలయం లో కార్యదర్శి కుర్చీలో కూర్చున్న కొత్త వ్యక్తి కనిపించడం తో గ్రామ ప్రజలు ఆ వ్యక్తి ని నిలదీశారు. దింతో ఆయన నేను కంది మండలం కు చెందిన పంచాయతీ కార్యదర్శి ని అని చెప్పడం తో నీకు మా పంచాయతీ లో నీకు ఏమి పని ఉంది అని అగ్రహం వ్యక్తం చేశారు. దింతో ఆయన మా స్నేహితుడికి సహాయం చేయడానికి వచ్చాను మీరు మీ స్నేహితుడికి సహాయం చేయరా అని ప్రశ్నించారు.
వెంటనే జహీరాబాద్ ఎంపిడిఓ మహేందర్ రెడ్ది కి గ్రామస్తులు సమాచారం తెలుపడం తో ఆయన వెంటనే మీరు అక్కడి నుండి రండి అనగానే వారు వెనుదిరిగి వచ్చారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయి వారం రోజులు గడిచిన మా గ్రామానికి ఇంతవరకు గ్రామ కార్యదర్శి ని నియమించకపోవడంతో మా సమస్య లు ఎవరికి చెప్పాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు గ్రామ కార్యదర్శి గా నియమించాలి అని కోరారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తుంకుంట పంచాయతీ కార్యదర్శి బీరప్ప సస్పెండ్ అయినట్లు తెలిసింది వివరాలకు వెళితే తుంకుంట గ్రామం లో కోర్టు పరిధిలో ఉన్న భూమి తప్పదు తీర్మానాలు చేసిన విషయం లో ఆయన సస్పెండ్ అయినట్లు అనుకుంటున్నారు. ఈ సస్పెండ్ గత 17 వ తేదీ న అయినప్పటికీ అధికారులు ఇట్టి విషయం లో అధికారికంగా తెలుపడం లో ఆలస్యం చేస్తుండడడంతో పలు అనుమానాలకు అవకాశం కనిపిస్తుంది. వారం రోజులు గడించిన ఇప్పటివరకు తుంకుంట గ్రామానికి కూడా కనీసం ఇంచార్జి గా పంచాయతీ కార్యదర్శి ని నియమించాకపోవడం ఏమిటని అనుకుంటున్నారు.
*జాతరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.
ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే..
తిరుపతి రూరల్(నేటి ధాత్రి)
తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని తిరుమల నగర్ పంచాయతీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా గంగమ్మ జాతరను నిర్వహించారుజాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు . జాతరలో అమ్మవారికి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగ జాతరకు విచ్చేసిన ప్రజలను, భక్తులను ఆప్యాయంగా పలకరించారు. ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మర్యాదపూర్వకంగా గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండల నేరెళ్ల గ్రామపంచాయతీలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్. మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన. రైతు భరోసా. గ్రామంలో రైతులందరికీ సక్రమంగా పడుతుందా. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల.దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని. తరతరాలుగా పంటలు సాగు చేస్తూ జీవనోపాధి.పొందుతున్న రైతులకు రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత. అధికారులకు.సూచించారు అలాగే మండలంలో రైతులు. ఎలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నేను రైతులను దృష్టిలో ఉంచుకొని వచ్చాను తప్ప అధికారికంగా కాదు దయచేసి ప్రజలు గమనించాలి. ఈయన వెంట ఏ ఎం సి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింహ గౌడ్. ఆరేపల్లి బాలు. రైతులు నాయకులు తదితరులు ఉన్నారు
◆ పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి
◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు
◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20
◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.
సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.
Elections
పంచాయతీ గుర్తులివే..
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.
సర్పంచ్ గుర్తులు:
ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్టు, స్పానర్(పానా), చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్రికెట్ బ్యాటర్, పడవ, బిస్కెట్, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్, క్రికెట్ వికెట్లు
రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.
చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతరావు
నేటిధాత్రి చర్ల
shine junior college
చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి అని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆద్వర్యంలో పంచాయతీ సెక్రటరీ సురేష్ కు వినతిపత్రం అందజేశారు మండల కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో వుంచుకొని ముందుగానే సైడ్ డ్రెయిన్ లను శుభ్రం చేయాలి అని రోడ్డు కి ఇరువైపులా వున్న పిచ్చి మొక్కలను తొలగించాలి అని అదేవిధంగా దోమల మందు పిచికారి చేయాలి అని వీధి దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి అని రోడ్లమీద నిలువ నీరు లేకుండా చూడాలి అని తెలియచేశారు సానుకూలంగా స్పందించిన పంచాయతీ సెక్రటరీ సురేష్ సమస్యలను తొందర్లోనే పరిస్కరిస్తము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ డివిజన్ యువజన నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరంట్ల వేంకటేశ్వరరావు ఎస్సి సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము మహిళా ఉపాధ్యక్షురాలు కొప్పుల సౌజన్య టౌన్ కార్యదర్శి గాధంసెట్టి కిషోర్ యువజన నాయకులు తడికల బుల్లెబాయ్ ఎన్నామూరి సృజన్ గంపల రమేష్ మైప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వైఫల్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజలపై సత్సంబంధాలు మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీని పలువురు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అధికారుల సమక్షంలో నిర్వహించారు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ 6 వేల మంది సర్వేయర్లను నియమించి ప్రజల భూ సమస్యలను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎంపీఓ తిరుపతి బాపూరావు, ఎస్సై జాడి శ్రీధర్, పంచాయతీ సెక్రెటరీ సురేష్ ఇతర సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ సమక్షంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారులు తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని,వెహికిల్ అలవెన్సులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వేంకటేశ్వర రావు,బెల్లంపల్లి ఇంచార్జీ డి ఎల్ పి ఓ సఫ్తర్ అలీ,జైపూర్,చెన్నూరు, బెల్లంపల్లి మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు,అజ్మత్ అలీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.