కాళేశ్వరం పుష్కరాలకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులు

కాళేశ్వరం పుష్కరాలకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులు

నర్సంపేట, నేటిధాత్రి:

కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నర్సంపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీ తెలిపారు.బస్సులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, 7 గంటలకు నర్సంపేట నుంచి బయలుదేరుతాయి. పెద్దలకు టికెట్ ధర రూ.330, పిల్లలకు రూ.190గా నిర్ణయించారు.భక్తులు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని వినియోగించుకుని సౌకర్యవంతంగా ప్రయాణించాలని డిపో మేనేజర్ కోరారు.

గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కాకుండా ముందస్తు చర్యలు

గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కాకుండా ముందస్తు చర్యలు

గ్రామంలోని ఇండ్లలో ఎలక్ట్రికల్ ద్వారా వినియోగించుకుని వస్తువులకు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేందుకు గాను నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీర వస్త్రం నాయక్ ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. గ్రామంలో ప్రజలు గృహాలలో వినియోగించుకున్న విద్యుత్ మోతాదులో వచ్చే విధంగా చంద్రయ్యపల్లి, బుచ్చి నాయక్ తండలో ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఉన్న ఎర్తులు నీటిని పోయించారు. ట్రాన్స్ఫార్మర్ల ఎర్తులు వద్ద సరిపడ నీరు పోయడం ద్వారా విద్యుత్ సరఫరా మోతాదును మించి ఉండదని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ విద్యుత్ హెల్పర్ భూషనబోయిన రమేష్, గ్రామపంచాయతీ సిబ్బంది ఎల్లయ్య, ప్రజా ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.

గుండంపల్లి మల్లాపూర్ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన అధికారులు

గుండంపల్లి మల్లాపూర్ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన అధికారులు
మల్లాపూర్ మే 22 నేటి దాత్రి

గుండంపల్లి – మల్లాపూర్ మధ్యలో పి ఆర్ రోడ్డుకు సంబంధించిన డిమార్కేషన్ ఎన్యుమరేషన్ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య , పి ఆర్ ఏ ఈ రాఘసుధ ఫారెస్ట్ ఆఫీసర్ సాయిరామ్ , వీడీసీ గంగాధర్, రాజేందర్ , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.” దీనికి సహకరించిన జువ్వాడి నర్సింగారావు, కృష్ణారావు కి ఫారెస్ట్ అధికారులకు గుండంపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధి పనులపై సర్పంచ్ తనిఖీలు

ఉపాధి హామీ పనులలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీలు.. కూలీలతో ముఖాముఖి.

సర్పంచ్ మందుల నాగయ్య

కోదాడ, నేటి ధాత్రి:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను గురువారం గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి. ప్రదేశానికి వెళ్లి జరుగుతున్న పనులతీరును సర్పంచ్ నాగయ్య పరిశీలించారు. పనులకు వస్తున్న కూలీల వివరాలు, వారి హాజరు పట్టికలను (మస్టర్ రోల్)ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కల్పించాల్సిన మౌలిక వసతులు, కొలతల ప్రకారం పని జరుగుతుందో లేదో అని నిషితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ డిపిఓ, గ్రామపంచాయతీ సెక్రటరీ, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

18 ఏళ్ల తాగునీటి సమస్యకు పరిష్కారం

18 ఏళ్ల సమస్యకు ముగింపు.

అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి సౌకర్యం.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామ అంగన్వాడీ కేంద్రానికి గత 18 సంవత్సరాలుగా తాగునీటి సౌకర్యం లేక చిన్నారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. పలు సమావేశాల్లో చర్చించినప్పటికీ పరిష్కారం కాలేదు.
ముగ్గురు సర్పంచులు, నలుగురు కార్యదర్శులు మారినా సమస్య అలాగే కొనసాగింది. అయితే తాజాగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కురుమన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ చొరవ తీసుకొని కేవలం మూడు రోజుల వ్యవధిలోనే.. సుమారు 100 మీటర్ల దూరం నుంచి కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రానికి నీటి సౌకర్యం కల్పించారు.
దీంతో అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ.. సర్పంచ్, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.

పోషణ్ ప్రక్వాడలో భాగం గా గ్రాడ్యువేషన్ డేలో పాల్గొన్న సర్పంచ్

పోషణ్ ప్రక్వాడలో భాగం గా గ్రాడ్యువేషన్ డేలో పాల్గొన్న సర్పంచ్

శాయంపేట నేటిధాత్రి:

https://youtu.be/iVSPrhfij-c?si=_VgaYXCaPXGo-Jdm

శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామంలోని అంగ న్వాడీకేంద్రంలో పోషణ్ పక్వా డ కార్యక్రమాల సందర్భంగా గ్రాడ్యువేషన్ డే నిర్వహించా రు. ఈ సందర్భంగా 5 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఫ్రీ స్కూల్ సర్టి ఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్కుక్కలసరోజన హాజరై పిల్లలకు సర్టిఫికెట్లు అంద జేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పుణ్యవతి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యానికి పోష కాహారం ఎంతో ముఖ్యమని, గర్భిణీ స్త్రీల నుంచి పుట్టిన పిల్లల వరకు సరైన పోషణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం పిల్లలకు యూనిఫారాలను పంపిణీచేశారు.ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, ఫ్రీ స్కూల్ ట్రైనర్ రిజ్వనా, హైస్కూల్ హెడ్ మాస్టర్ రమేష్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సదాకర్, చలి వాగు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి సెక్టార్ టీచర్లు మరియు ఆయాలు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.

రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.

గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై గోపాల్ రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి:

https://youtu.be/iVSPrhfij-c?si=giteFfPTjGxZfb2m

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ. ఆరైవ్-ఆలైవ్ నినాదంతో రోడ్డు ప్రమాదాలు నివారణ హెల్మెట్, సీట్ బెల్ట్, ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రజలు వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడంలేదని రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలు రక్షించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాల వీధిన పడుతున్నాయని ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్ళింది మొదలు ఇంటికి వచ్చేవరకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ. స్థానిక పోలీస్ సిబ్బంది గ్రామస్తులు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత నియమ అంశాల తెలియజేస్తూ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. మితిమీరిన వేగంతో వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలకు యువతకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వర్క్ ఇన్స్పెక్టర్ ఈసి, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులు, మహిళలు గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల ఆశయాలు సమాజానికి దిక్సూచి…

మహనీయుల ఆశయాలు సమాజానికి దిక్సూచి

* మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మొగులపల్లి

నేటి ధాత్రి మహాత్మ

జ్యోతిరావు మహనీయుల సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పూలే మహిళల విద్య కుల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాలే నేటి ప్రజా నికానికి దిక్సూచి అని మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ అన్నారు గ్రామపంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని న అవసరం సమాజంలో ఉందన్నారు అట్టడుగు వర్గాలకు సమాన న్యాయం అందాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమని నమ్మి ఆ దిశగా పోరాడిన మహనీయులు పోలే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి మా బిందు కోటేశ్వరరావు వార్డు సభ్యులు చిలుకమారి శ్రీనివాస్ హర్షం మహేష్ బండారి కుమార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యా తరాజు రమేష్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ టౌన్ గుడిమళ్ల రమేష్ పడిదల నర్సింగరావు సెక్రెటరీ నరేష్ పాల్గొన్నారు

తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్లను సన్మానించిన సర్పంచ్ తౌటం లక్ష్మి.

తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్లను సన్మానించిన సర్పంచ్ తౌటం లక్ష్మి.

చిట్యాల,నేటిదాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంనికి నూతనంగా నియమితులైన *తహశీల్ధార్ *తూకుంట్ల వసంతరావును మరియు డిటి ముధవత్ అనిల్ ని శాలువా కప్పి మర్యాదగా కలిసిన స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య .ఈ సంధర్బంగా వారు మా గ్రామ పంచాయతీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. మరియు ప్రభుత్వ పథకాల అమలులో మీకు మా గ్రామ పంచాయతీ నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇస్తు,మీ పదవీకాలం విజయవంతంగా ఉండాలని, మీరు మంచి సేవలందించాలని కోరారు.వీరితో పాటు 4 వ వార్డు సభ్యుడు *తౌటం నవీన్ *కూడా పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది…

ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది

సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి .

https://youtu.be/ooGYBXQUVCQ?si=Ud2sEweSdzGvIV7u

 

ప్రైమరీ స్కూల్ బిజ్వరం మండల ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి న నామ్ దే వ్ పదవి విరమణ వేడుకలలో సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలాస శంకర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తి గొప్పది అన్నారు. 37ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికి నామ్‌దేవ్ విద్యార్థులకు విద్యా బోధ సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శేఖర్ గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ సంఘాలు కెసి వెంకటేష్, రాములు, నరేష్ రాంనాయక్,రాజలింగం,
పాఠశాల ఛైర్మన్,రాములమ్మ, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,తధితరులు పాల్గొన్నారు

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన…

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన
మల్లాపూర్ మార్చి 4 నేటి ధాత్రి

మొగిలిపేట గ్రామంలో గోదావరి పుష్కరాలలో భాగంగా మొగిలిపేట తీరంలో పుష్కర ఘాట్ పరిశీలన నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి రాములు మల్లాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. మొగిలిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య , వార్డు సభ్యులు తిప్పని మునీందర్ గ్రామ ప్రజలు దరిపెల్లి అశోక్. మాసుల బుచ్చి రెడ్డి. నైనేని రాజేందర్ పాల్గొనడం జరిగింది

బెల్లాపూర్ ఆశ్రమం నుంచి పాదయాత్ర హద్నూర్ చేరిక, భక్తితో స్వాగతం

బెల్లాపూర్ ఆశ్రమం నుంచి పాదయాత్ర హద్నూర్ చేరిక, భక్తితో స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్ర, పల్లకీసేవ జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల హద్నూర్ గ్రామానికి చేరుకుంది. మార్చి 5న జరగనున్న 47వ వార్షిక అమరతిథి సందర్భంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు నిండుకుండలతో ఘన స్వాగతం పలికి, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి ఆశ్రమంలో భజనలు, కీర్తనలు, ప్రవచనాలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ పాదయాత్ర భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.

జిర్లపల్లి లో ఘనంగా హొలీ సంబరాలు…

జిర్లపల్లి లో ఘనంగా హొలీ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామంలో కులమతాలకు అతీతంగా,.పార్టీలకు అతీతంగా ఉదయం నుండి హొలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. స్థానిక ప్రజాప్రతినిధులు యూవకులు రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హొలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు హొలీ సంబరాలు జరుపుకుంటున్నారు.. ఈ హొలీ
సంబరాల్లో గ్రామ నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పోసుకుంటూ స్థానిక యూవకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ ఐక్యత, ఆనందం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయాలను పాటించారు.హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు,

హోలీ పండుగ శుభాకాంక్షలు

రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరీ శివమణి హోలీ సందర్భంగా చిన్న పిల్లలకు రంగుల ప్యాకెట్లు పంచి, ఆహ్వాదంగా పండుగను నిర్వహించారు.

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నూతన గ్రామ సర్పంచ్…

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నూతన గ్రామ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ హోలీ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ ఆనందం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ మన జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందించే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ప్రజలతో కలిసి ప్రతి ఆనంద క్షణాన్ని పంచుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్…

మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్.

మొగుళ్లపల్లి నేటి ధాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మురికి కాలువలో చెత్త పేరుకుపోవడం వర్షాల పట్ల దోమలు వ్యాప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత కోసం సర్పంచి చొరవ తీసుకొని చెత్తను మట్టిని తొలగింపు చేశారు గత రెండు మూడు రోజుల్లో గ్రామ సర్పంచ్ చాట్ల రవీందర్ విజయ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయించి గ్రామ వీధుల్లో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేర్కొన్న చెత్త చెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు దోమల నివారణ గురించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఊరు మొత్తం స్ప్రే చేయించారు గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు తాగునీటి సరఫరా మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం గ్రామ సర్పంచ్ గా నా బాధ్యత అని తెలిపారు ఆయన వెంట వార్డు సభ్యులు ఏలేటి మధుకర్ రెడ్డి గుడిమల్ల జయసుధ రమేష్ చెక్క నరేష్ చెక్క వెంకటేష్ పాల్గొన్నారు

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు…

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ గ్రామపంచాయతీ రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మల్గి మెకానిక్ కిష్టన్నలతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ట్యాంకుల పనితీరును తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ట్యాంకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, వేసవిలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా వినియోగించాలని గ్రామస్థులకు సూచించారు.

మర్రిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామంలో కుడుతాల రాజు,రంపీస రాజేశ్వర్ రావులకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుంట రాజుకుమార్ తో కలిసి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాప రెడ్డి,వార్డ్ మెంబర్ గాజు శివాజీ,నాయకులు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,భాషబోయిన సంజీవ,పొన్నాల రాజు,గాజు రాజు,వంగ రాజేష్,సోనబోయిన కొమురయ్య,అల్లాపురం ప్రదీప్,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ పాల్గొన్నారు.

వేలాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు…

వేలాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో ప్రతిమ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.వేలాల గ్రామ ప్రజలకు సేవ చెయ్యాలని మంచి సంకల్పంతో గ్రామ సర్పంచ్ డేగ స్వప్న- నగేష్, ఉప సర్పంచ్ సుందిళ్ల రాజలింగు ఉచిత వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు.ప్రతిమ హాస్పిటల్ వైద్య సిబ్బంది 300 వందల మందికి ఉచిత ఓపి చూసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అలాగే ఉచిత పరీక్షలు నిమిత్తం 40 మందిని హాస్పటల్ కి రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,పంచాయతీ కార్యదర్శి,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.అలాగే ప్రతిమ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్,మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జనగామ నాగరాజు,సంతోష్, సదానందం,హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.

శ్రీపురంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రంగనాయక స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి సరిత రాజేష్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు కళ్యాణోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు శ్రీపురం గ్రామ సర్పంచ్ గీతా నర్సింహారెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామంలో బుధవారం సర్పంచ్ దయానంద్ పాటిల్ ఆధ్వర్యంలో 365 మంది లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం కింద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యాతరి ఏసప్ప, మొగులయ్య, బసవరాజ్, స్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version