“మా పొట్ట కొట్టొద్దు… సారు…

“మా పొట్ట కొట్టొద్దు… సారు “

“ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మిస్తే.. చచ్చిపోతాం”

 

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గుండేడు, వనమోని గూడ, గౌతాపూర్, చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి గ్రామాల మీదుగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. ఈనెల 15 రైతుల అభిప్రాయాలను అధికారులు సేకరించేందుకు గడువు పెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భూ నిర్వాసితులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న తమకు.. పిడుగు లాంటి వార్త మా జీవితాల్లో నాశనం చేస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న పొలం రోడ్డుకు పోతే తాము జీవనోపాధి కోల్పోతామన్నారు. ఒకవేళ రోడ్డును నిర్మిస్తే క్రిమిసంహారిక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని, తమకు న్యాయం చేయాలని కోరారు.

కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఉద్రిక్తత.

కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఉద్రిక్తత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణానికి చెందిన సాబేర్ చాతి నొప్పి భరించలేక వెంకటరమణ ఆసుపత్రికి రాత్రి వెళ్లగా డ్యూటీ డాక్టర్లు పరీక్షించి ఈసీజీ తీసి,కొన్ని మందులు ఇచ్చి ఇంటికి పంపించారు, ఇంటికి వెళ్లిన కాసేపటికి సాబేర్(46) కుప్పకూలిపోవడంతో మళ్లీ అతన్ని ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే సాబేర్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు, ఈసీజీ తీసినప్పుడే సమస్య చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసం వెళ్లే వాళ్ళమని వైద్యుల నిర్లక్ష్యం వల్లే సాబేర్ మృతి చెందాడంటూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రిలో మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.
వెంకట రమణ ఆసుపత్రి లో అనుభవం లేని డాక్టర్ లు ఎంబీబీఎస్ చదవకున్న వైద్యం చేస్తున్నారు అని ఇలాంటి ఆసుపత్రిని సీజ్ చేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు.

నిమ్స్ రైతుల ఆందోళన మామడ్దిలో ఉద్రిక్తత.

నిమ్స్ రైతుల ఆందోళన.. మామడ్దిలో ఉద్రిక్తత.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో
మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version