మొగిలిపేటలో గొర్రెల, మేకల ఉచిత నట్టల మందుల పంపిణీ

మొగిలిపేట గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ
మల్లాపూర్ డిసెంబర్ 30 నేటి ధాత్రి

పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 31 వరకు జరుగుతున్నటువంటి ఉచిత గొర్రెల మేకల నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో 3100 గొర్రెలకు 450 మేకలకు నట్టల మందుల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సర్పంచ్ గోల్కొండ కళా. ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్ వార్డ్ సభ్యులు ప్రణయ్ కాంగ్రెస్ నాయకులు ఎలేటి జలపతి రెడ్డి గోల్కొండ రమేష్ లైవ్ స్టాక్ ఆఫీసర్ సుజాత వెటర్నరీ అసిస్టెంట్ రవీందర్ ఆఫీస్ సబార్డినేట్ రాజేందర్ గొల్ల కుర్మా యాదవ రైతులు ముక్కెర రాజేందర్. ముక్కెర లక్ష్మీనరసయ్య . మల్లయ్య. బాస రమేష్ తదితరులు పాల్గొన్నారు

కోటిలింగేశ్వర ఆలయ నిర్మాణానికి విరాళం..

మల్లాపూర్ నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గత కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో కోటిలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి గ్రామానికి చెందిన పలువురు మహిళలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు కోటిలింగేశ్వర స్వామి ఆలయ ఏర్పాటుకు విరాళాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమారి రామగిరి వసంత మన కోటిలింగేశ్వర స్వామీ నూతన ఆలయనిర్మాణంలో భాగంగా ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ద్వారా సేకరించిన నిధులను తన వంతు విరాళంగా 150000 రూపాయలు అందించారు గ్రామ అభివృద్ధి కమిటీ దేవాలయ కమిటి మొగిలిపేట గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికమిటీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పేద దంపతుల ఇల్లు ఫోటో నిరాకరణ…

మల్లాపూర్ ఆగస్టు 29 నేటి ధాత్రి

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన ఓదెల సరోజన భర్త గజానంద్ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు కాగా వారికి ఉన్న ఇల్లు శిధిలావస్ఢలో ఉండి కూలిపోయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ద్వార తనకు నెల రోజుల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. అతను ఇల్లు నిర్మించుకొనుటకు ముగ్గుపోసి, ఫోటో క్యాప్చర్ కోసం సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, వారు ఫోటో తీయనని, నీ మీద ఫిర్యాదు ఉందని చెప్పడంతో ఆ వ్యక్తి విస్తుపోయాడు గ్రామపంచాయతీ ఆవరణలోని బాధపడుతూ కూర్చున్నాడు దీనిపై అధికారులు స్పందించి విచారణ చేపట్టి పేదవారు అయినా గజానందు దంపతులకు ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని
కోరుతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version