పోలీసుల సేవలు త్యాగాలు చిరస్మరణీయం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, అవి సమాజానికి నిత్య స్పూర్తిదాయకమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ కరే తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్ఛగా,భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితం అన్నారు.
అమరులైన పోలీస్ వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే వారి సేవలు ఎనలేనివి అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారు”అని ప్రశంసించారు.ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి,సమాజ శాంతి భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు.అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అమర వీరుల కుటుంబాలకు బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.తర్వాత రక్త దానం చేసిన పోలీస్ అధికారులకు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డీఎస్పీ సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ పోలీస్ అధికారులు, జిల్లా అటవీశాఖ అధికారి,అమరవీరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.
