మున్సిపల్ చైర్మన్ వార్డు లో మంచి నీటి ఎద్దడి  పట్టి oచుకొని మున్సిపల్ డి ఇ…

మున్సిపల్ చైర్మన్ వార్డు లో మంచి నీటి ఎద్దడి  పట్టి oచుకొని మున్సిపల్ డి ఇ

వనపర్తి నేటిదాత్రి

వనపర్తి 33 వ వార్డ్ మున్సిపల్ చైర్మన్ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మీడిదొడ్డి రమేష్ కూల్చి న షాపు దగ్గర లగిశెట్టి చంద్ర శేఖర్ సెల్ 70 13 89 47 82 తెలిపారు వారం రోజుల నుండి నల్లా ల నుండి మంచి నీళ్లు రావడం లేదని ఆయన తెలిపారు ఎండాకాలం లో మంచి నీళ్ళు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ అధికారులకు తెలిపిన నీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు 33 వ వార్డులో నీటి సమస్య తీర్చ కుంటే మునిసిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేగా రెడ్డి ఫిర్యాదు చేస్తామని చంద్రశేఖర్ చెప్పారు మున్సిపల్ చైర్మన్ వార్డులో మంచి నీటి ఎద్దడి ఉంటే వనపర్తి లో మిగతా వార్డుల పరిస్థితి ఏంటని అయన ఆందోళన వ్యక్తం చేశారు వనపర్తి లో నీటి ఎద్దడి పై మున్సిపల్ చైర్మన్ కమీషనర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు పదవులు రాజకీయం శాస్వతంము కాదని విలువలు ముఖ్యం శేఖర్ అన్నారు

అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా…

అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా
మెట్ పల్లి ఏప్రిల్ 7 నేటి దాత్రి

మెట్పల్లి పట్టణంలోని వెల్లుల రోడ్డు హనుమాన్ నగర్ కాలనీ బచ్పన్ స్కూల్ దగ్గర వివరాలకు వెళ్తే మెట్పల్లిలోనే కళానగర్ ఎలా అభివృద్ధి చెందిందో హనుమాన్ నగర్ కాలనీ ఏడవ వార్డు దినదిన అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ బిల్డర్ల వాళ్లకు అడ్డగా మారి ప్లాట్స్ కొంటూ అమ్ముతూ ఇండ్లు కొంటూ అమ్ముతూ డ్రైనేజీలు లేక డ్రైనేజీలు ఇష్టం వచ్చినట్టు వాళ్ల ఇస్తాను సారం చేసుకుంటూ పోతున్నారు సామాన్య జనాలకు ఇబ్బందిగా మారి అధికారులు చూచి చూడనట్టు వదిలేయడం వల్ల హనుమాన్ నగర్ బచ్పన్ స్కూల్ దగ్గర మున్సిపల్ అధికారులు డ్రైనేజీ తవ్వి పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది అయి అనారోగ్యం పాలవుతున్నారు ఎండాకాలం కాలనీవాసులకు చెరువులు తలపిస్తున్నాయి దోమలు మురుగునీరు వాసన భరించలేక

సతమతమవుతున్నారు ఎండాకాలమే ఇలా ఉంటే వర్షాకాలం ఏ విధంగా ఉంటదో అని కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా వచ్చి ఏదో చేసిన మా అంటే చేసినాము అనే విధంగా చేసి వెళ్తున్నారు ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ వెంట తిరుగుతున్నారు, ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించుకుంటున్నాం.

నలభై డివిజన్ ప్రజలను కుక్కల, కోతుల బారి నుండి కాపాడండి- పైడిపల్లి రాజు

నలభై డివిజన్ ప్రజలను కుక్కల, కోతుల బారి నుండి కాపాడండి- పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ నగరంలోని నలభై డివిజన్ హనుమాన్ నగర్, తిరుమల నగర్ ప్రజలను కుక్కల కోతుల బెడద నుండి కాపాడాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రోజున నలభై డివిజన్లో బ్లూ బెల్ స్కూల్ వద్ద జరిగిన ప్రజాపాలన వార్డు సభలో కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ వార్డు ఆఫీసర్ స్రవంతి, సిఓ పద్మ, జవాన్ సంజీవ్ లకు సిపిఐ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ నలభైవ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, తిరుమల నగర్ ప్రజలు వీధి కుక్కల ఆగడాలు భరించలేకపోతున్నారని, కోతుల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్న పిల్లలను స్కూలుకు పంపించే సమయంలో కోతులు బ్యాగులు గుంజుతూ మనుషులపైకే వస్తున్నాయని, కుక్కలు స్కూల్ పిల్లలకు టిఫిన్ ఇచ్చే సమయంలో వెంటపడుతున్నాయని చిన్న పిల్లల పైకి వస్తున్నాయని దీంతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు. వీధి కుక్కలు, కోతులు దాడి చేయడం వల్ల గతంలో హనుమాన్ నగర్ లొ ఒక వ్యక్తి మరణించారని అయినా అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. కుక్కల, కోతుల దాడుల వల్ల అనేక రకాలుగా ప్రజలు గాయాలపాలై హాస్పిటల్ లో వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారని, పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనo చేయడానికి ఇంటికి వచ్చే వారిని ఇంట్లోకి రానీయకుండా ఇంటి పైన కోతులు ఉండడం వల్ల భోజనం చేయలేని పరిస్థితి కరీంనగర్లో దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు కుక్కల, కోతుల నుండి ప్రజలను కాపాడాలని లేనిపక్షంలో ప్రజల చేత ఆందోళనలు చేస్తామని పైడిపల్లి రాజు హెచ్చరించారు. ఈవినతి పత్రం సమర్పించిన వారిలో బొడ్ల ప్రభాకర్, భగవాన్ రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

జంక్షన్ పై నిర్లక్ష్యం తగునా..

జంక్షన్ పై నిర్లక్ష్యం తగునా..

పట్టించుకోని పాలకులు, మున్సిపల్ అధికారులు

యధావిది స్థితిలోనే వాటర్ ఫౌంటెన్

పరకాల,నేటిధాత్రి

పట్టణ సుందరీకరణలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రస్తుతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయింది.నెలలుగా ఫౌంటెన్ పనిచేయకపోయినా అధికారులు,పాలకులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పట్టణ అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ఈరోజు పనికిరాని స్థితిలో ఉండటం స్థానికులను నిరాశకు గురి చేస్తోంది.పట్టణం మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రాంతం ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతం.ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.ప్రారంభంలో కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన ఫౌంటెన్ ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం ఫౌంటెన్ చుట్టూ చెత్త పేరుకుపోవడంతో ఆ ప్రాంతం అందాన్ని కోల్పోయింది.ఫౌంటెన్ పనిచేయకపోవడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం కూడా నిర్లక్ష్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన నిర్మాణాలు కూడా తప్పుపట్టే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.పట్టణ సుందరీకరణకు ప్రతీకగా నిలవాల్సిన ఫౌంటెన్ ఇలా నిలిచిపోవడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు.ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన పనులు ఇలాగే నిర్లక్ష్యానికి గురికావడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు ఉపయోగపడేలా,పట్టణానికి అందాన్ని తీసుకురావాల్సిన ఈ ఫౌంటెన్ ఇప్పుడు వ్యర్థంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పట్టణ అభివృద్ధి గురించి మాటలు చెప్పే నాయకులు, ఇలాంటి సమస్యలపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా నాయకులు ముందుకు రావడం లేదని అంటున్నారు.అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న ఈ ఫౌంటెన్ పట్టణానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండాల్సింది.కానీ నిర్వహణ లోపంతో అది ఇప్పుడు నిలిచిపోయి నిర్లక్ష్యానికి గురైంది.ఫౌంటెన్ పునరుద్ధరణ కోసం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫౌంటెన్‌ను తిరిగి పనిచేసేలా చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.పట్టణ అభివృద్ధి పనులు కేవలం ప్రారంభం చేయడం మాత్రమే కాకుండా వాటి నిర్వహణ కూడా ముఖ్యమని గుర్తించాలన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకుని పట్టణ సుందరీకరణ పనులు సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.లేకపోతే ఇలాంటి అభివృద్ధి పనులు కేవలం ప్రదర్శనకే పరిమితమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు..

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు

క్లీనింగ్ పట్ల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డు వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి, మురికి నీరు ఒకే దగ్గర ఉండటం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో మురికి నీరు ఉండటం వలన దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్రమైన పడుతుంటే వాటిని శుద్ధి చేసేందుకు గాని 4 రోజుల నుండి మున్సిపాలిటీ జేసిబి అడుగుతుంటే, ఆయిల్ మార్పించాలని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిఅంటున్నారని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పని ఏం ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు అవసరైన పనులను నిర్లక్ష్యంగా వ్యవహరించకూడా పనులు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

రోడ్డు వేశారు నీరు మరిచారు..

రోడ్డు వేశారు నీరు మరిచారు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ పక్కన ప్రధాన రహదారి నుండి మార్కెట్ రోడ్డు ప్రధాన రహదారి వరకు, గాంధీనగర్ లో కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు కానీ రోడ్లు వేసిన తర్వాత రోడ్డు బలంగా పటిష్టంగా కావడానికి కనీసం 10 నుంచి 15 రోజుల వరకు నీరు పట్టాలి కానీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఒక్కసారి మాత్రమే ఆ రోడ్డుకు నీరు పట్టారు సంబంధిత శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తి నట్టుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణాలు చేపట్టి ఇలా గాలికి వదిలేస్తే ప్రజాధనం వృధా అవుతుంది అని రోడ్డు నిర్మాణాలు పటిష్టత కోల్పోయి త్వరగా రోడ్లు చెడిపోతాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా…

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా?

 

బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హిస్టోరియన్ నేహా వర్మానీ 130 ఏళ్ల క్రితం నాటి మహారాజుల డిన్నర్ మెనూను బయటపెట్టారు. మెనూకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1897 జనవరి 31వ తేదీన బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం. ఆ డిన్నర్‌లో ఇద్దరు మహారాజులు కేవలం ఫ్రెంచ్ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు.

వరంగల్‌లో దట్టమైన పొగమంచు….

వరంగల్‌లో దట్టమైన పొగమంచు.

100 ఫీట్ల రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పైపులు

పైపులు తొలగించండి మేడం.. మున్సిపల్ కమిషనర్ కు స్థానికుల విన్నపం

నేటిధాత్రి, వరంగల్:

 

వరంగల్ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసిన వేళ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై మధ్యలో నిలిచిపోయిన పైపులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుమధ్యలోనే ఉన్న ఈ పైపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొగమంచు కారణంగా రోడ్డుపై స్పష్టత తగ్గిన పరిస్థితుల్లో పైపులు ఎక్కడున్నాయో తెలియక వాహనాలు అటువైపు దాటేందుకు ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళ స్కూల్‌కు వెళ్లే చిన్నారులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఉద్యోగులకు తీసుకెళ్లే వాహనాలు, చిరు వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డుకు మధ్యలో ఎలాంటి డివైడర్ లేకపోవడం, పైగా ఈ పైపులు అలాగే ఉండిపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదం కారణంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న పైపులను వెంటనే తొలగించి, భద్రత కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!

గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!

ఆరు నెలలుగా పట్టించుకోని మేయర్–అధికారులు?

మేడారం జాతర సందర్భంగా స్పందించాలంటున్న వాహనదారులు

వరంగల్, నేటిధాత్రి:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రోడ్డు పరిస్థితి నగర పాలన తీరుకు అద్దం పడుతోంది.నగర మేయర్ స్వయంగా ఎన్నికైన 29వ డివిజన్ పరిధిలోకి వచ్చే వరంగల్ పోతన నగర్ నుంచి హంటర్ రోడ్డుకు వెళ్లే మార్గం పూర్తిగా అధ్వాన్నంగా మారి, నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.గత ఆరు నెలలుగా కొన్ని పత్రికల్లో ఈ రోడ్డు సమస్యపై వార్తలు వచ్చినప్పటికీ, నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ముఖ్యంగా మేడారం మహాజాతర నేపథ్యంలో ఈ రోడ్డుమీదుగా భక్తులు, వాహనాలు భారీగా ప్రయాణించనున్న నేపథ్యంలో, ప్రమాదాలకు ఆస్కారం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీసం తాత్కాలికంగైనా మొరం పోసి రోడ్డు సరిచేసి, భక్తులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సజావుగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.“గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే ఇలాంటి దయనీయ స్థితిలో రోడ్డు ఉంటే, మిగతా డివిజన్ల పరిస్థితి ఏమిటి?” అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి విహారయాత్రలు, పర్యటనలకు వెళ్లే ప్రజాప్రతినిధులు, తమ సొంత డివిజన్‌లో కనీస రోడ్డు సౌకర్యాన్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Mayor-officials

నగర మేయర్ హోదాలో ఉండి తన డివిజన్ సమస్యలకే పరిష్కారం చూపలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందనివాహనదారులు నిలదీస్తున్నారు.నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి తక్షణమేరోడ్డుమరమ్మతులులేదానిర్మాణపనులుచేపట్టాలని,లేకపోతేప్రజాగ్రహానికిగురికావాల్సివస్తుందనివాహనదారులుహెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా,ఈ రోడ్డు సమస్యపై పెద్ద పత్రికలు, ఛానెళ్లు అని చెప్పుకునే”కొందరు”మీడియాప్రతినిధులుఒక్కవార్తకూడారాయకపోవడంపలుఅనుమానాలకుతావిస్తోంది.మేయర్‌కుఅనుకూలంగా వ్యవహరిస్తూ వార్తలను పక్కన పెట్టారాఅనేసందేహాలువ్యక్తమవుతున్నాయి.అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానిక యువత రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్చేస్తున్నా,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు…

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

పన్నులు కట్టే ప్రజలకు త్రాగునీరు కరువు..

పన్నులు కట్టే ప్రజలకు త్రాగునీరు కరువు

– మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా

– పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నా

– మంచినీటి సమస్య తీర్చే వరకు బిజెపి పోరాటం ఆగదు

– బిజెపి పట్టణ అధ్యక్షులు
దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట
భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంపై నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రజల సమస్యలపై మున్సిపల్ పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ “సిరిసిల్లలో మంచినీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోందని అన్నారు.

ఇది సహజ సమస్య కాదు… ఇది పూర్తిగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం” అన్నారు. “పన్నులు కట్టే ప్రజలకు కనీసంగా త్రాగునీరు ఇవ్వలేని మున్సిపాలిటీకి
పాలన చేసే నైతిక హక్కు లేదని మేము స్పష్టంగా చెబుతున్నామన్నారు.
“వెంటనే మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరాను అంతరాయం లేకుండా పునరుద్ధరించాలి,అలాగే పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా, సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. “ఇది రాజకీయ పోరాటం కాదు…
ఇది ప్రజల జీవన హక్కుల కోసం చేస్తున్న ఉద్యమం అని అన్నారు. “ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి మరింత బలమైన ఉద్యమాలకు తిగుతామన్నారు. “సిరిసిల్ల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ నిశ్శబ్దంగా కూర్చోదు – పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు. మునిసిపల్ కమిషనర్ ప్రత్యక్ష హామీతో రెండు రోజుల్లో పూర్తి సమస్యలు తీర్చుతామని పక్క హామీతో నిరసన విరమించామన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యాన రాంప్రసాద్, మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, మోర శ్రీహరి, పల్లికొండ నరసయ్య, కాంభోజ శ్రీధర్, అంకారపు రాజు ,చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, కొడం రవి, సూరం వినయ్, సిద్ధి దేవరాజు, ఇంజపురి మురళి కృష్ణ, గాలి శ్రీనివాస్, ఊరగొండ రాజు, కొండ ప్రతాప్,రమేష్, సుంకరి బాలకిషన్, బండారి వెంకటేశ్వర్లు, జంప రాజు,దేవరాజు,వర్ణాల శేఖర్ బాబు, వెలిశాల అభి రామారావు, కనకయ్య, మహిళా నాయకులు వేముల వైశాలి, కమటం మంజుల, మల్లీశ్వరి, లత, వనిత, తదితరులు పాల్గొన్నారు.

బ్రిడ్జి సైడ్ వాల్స్ పై కలర్ ఫుల్ పెయింటింగ్స్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T120155.747.wav?_=1

 

బ్రిడ్జి సైడ్ వాల్స్ పై కలర్ ఫుల్ పెయింటింగ్స్…! చిమ్మ చీకట్లో బ్రిడ్జి పై రహదారి..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేసి పది నెలలుగా రాకపోకలు జరుగుతున్నప్పటికీ బ్రిడ్జిపై లైటింగ్ లేకపోవడం తో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందని, దీనిని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల రాత్రి సమయాల్లో ప్రయాణికులు,పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఇరువైపులా ఇసుక ఉండటం తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, స్థానిక మున్సిపల్ సిబ్బంది చొరవ తీసుకుని బ్రిడ్జి పై ఇరువైపుల ఉన్న ఇసుకను తొలగించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఫ్లై ఓవర్ వంతెనకు ఇరువైపులా కలర్ ఫుల్ పెయింటింగ్స్ తో కళకళలాడుతున్నాయి. ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దారిన పోయే ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ, సింగరేణి, ప్రజల జీవనశైలి,జంతువులు, పక్షులు,క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడియాడినట్లు దర్శనమిస్తున్నాయి. చిత్రలేఖనాలు బాగానే ఉన్నా బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు మున్సిపల్ సిబ్బంది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలిగేలా చొరవ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

 

నెల రోజుల్లో బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలుగులోకి వస్తాయి..

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు..

క్యాతన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై విద్యుత్ దీపాలు నెల రోజుల్లో వెలుగుతాయని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారని అన్నారు. పది నెలలుగా బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఆర్ అండ్ బి అధికారులను పదేపదే అడగడం జరిగిందని,విద్యుత్ స్తంభాలకు దిమ్మెలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, నెల రోజుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు వెలిగేలా చూస్తామని తెలిపారు. ఫ్లై ఓవర్ పై రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇసుకను త్వరితగతిన తొలగిస్తామని, వాహన ప్రమాదాలు జరగకుండా చూస్తామని అన్నారు.

ఆర్కేపి లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు….

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T121102.535.wav?_=2

 

ఆర్కేపి లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు….

భూమి కాజేసింది వ్యాపారస్తుడు….టేలాలో కిరాయికి దివ్యాంగుడు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వ భూములను రక్షించే ప్రయత్నం కూడా చేయడం లేదని పుర ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పేదవారు చిన్న పూరి గుడిసె వేసుకుంటే నానా హంగామా చేసే మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు వ్యాపారస్తులు, బడా లీడర్లు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ప్రాంతం నుండి ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో గల ఓ మద్యం దుకాణం వద్ద ఓ వ్యాపారస్తుడు సర్వే నెంబర్ ఏడు లోని ప్రభుత్వ భూమిలో టేలా వేయడమే కాకుండా అట్టి టేలను ఒక దివ్యంగుడికి కిరాయికి ఇచ్చినా సరే సంబంధిత అధికారులు టేలా పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు.అట్టి టేలను శాశ్వతంగా అమర్చి దాని ముందు ప్రాంతం కాంక్రీట్ తో చదును చేస్తున్నా సరే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పుర ప్రముఖులు అంటున్నారు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటే సంబంధిత అధికారులు “మామూలు”గా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది రక్షించాలని ప్రాంత ప్రజల కోరుతున్నారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు…

మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అట్టి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అన్ని హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సర్వే నెంబర్ 7 లో గల ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లయితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాజీవ్ చౌక్ నుండి ఏరియా హాస్పిటల్ వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు పక్కనగుర్తు తెలియని వ్యక్తులు టేలా వేసుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అది ప్రభుత్వ భూమి అని తేలితే తొలగిస్తామని తెలిపారు.

అట్టి భూమి ప్రభుత్వ ఆధీనంలోకే వస్తుంది…

20వ వార్డు బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ రావు.

20వ వార్డులోని ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు పక్కన గల ప్రదేశం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని, అట్టి ప్రదేశం లో గుర్తుతెలియని వ్యక్తులు టేలా వేసి దానిని కిరాయికి ఇచ్చినట్లు మా దృష్టికి వచ్చిందని, త్వరలోనే సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు జర్నలిస్టులకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన రహదారి స్థలాన్ని కబ్జా చేయడం మరి విడ్డూరంగా ఉందని అన్నారు.

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T132306.512.wav?_=3

 

 

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు పైన ప్రవహిస్తున్న మురుగు నీరు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు వాహనదారులు కానీ మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బంది పనిచేయడం లేదు రోడ్డుపైకి వస్తున్న మురుగు నీరు ప్రవాహం నుండి కృష్ణ కాలనీ మున్సిపల్ జిఎం

కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి నుండి ప్రజలు వాహనదారులు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడింది వెంటనే జిల్లా అధికారులు స్పందించి మురుగు నీటిని తొలగించాలి అలాగే రోడ్డు పక్కన సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు….

అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు

* చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ స.నెం.195 లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం
* పంచాయతీ అనుమతులు ఉన్నాయంటా..
* నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు లేవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం
* పత్రికల్లో కథనాలకు స్పందించని కమిషనర్
* రెండు నెలలుగా యతేచ్చగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణం పనులు
* కనీసం నోటీసులు ఇవ్వని వైనం
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ పరోక్షంగా అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు
* వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి చర్యలు తీసుకోవాలి.

చేవెళ్ల,నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారు. దాంతో కార్పొరేషన్‌ అదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. అధికారుల చేతి వాటంతోనే అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ వార్డులోని సర్వే నెంబర్ 195 లో మున్సిపల్ అనుమతులు లేకుండా 2నెలలుగా ఓ ఫామ్ హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ అంశాన్ని నేటిధాత్రి వార్త పత్రిక కథనాన్ని వెలువరించింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణానికి ఎప్పుడో గతంలో 2023లో పంచాయతీ అనుమతులు తీసుకున్నారంటా అని మున్సిపల్ కమిషనర్ నిర్దారణ చేయకుండానె చెప్పారు.

2 ఏళ్ల క్రితం పంచాయతీలో తీసుకున్న అనుమతులు గడువు ముసినప్పటికీ చేవెళ్ల మున్సిపల్ గా ఏర్పడిన తర్వాత మున్సిపల్ అనుమతులు పునరుద్ధరించకుండా అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని చేవెళ్ల మున్సిపల్ అధికారులపై స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. గతంలో పంచాయతి అనుమతులు ఉన్నాయని చెపుతు, 2 నెలలుగా నిర్వీర్యామంగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణానికి మేము నోటీసులు ఇస్తామని ఇప్పుడు చెప్పటం గమనర్హం.

* నోటీసులు కూడా ఇవ్వడం లేదు..

ఈ అనధికారిక ఈ ఫామ్ హౌస్‌ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవటం అక్రమనిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉదాసీనత కనబడుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా… అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిర్మాణ పత్రాలు లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ అధికారులపై తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు.

•అధికారుల మౌనం ఎందుకో..?

ఈ ఫామ్ హౌస్ వ్యవహారంపై అప్పటి పంచాయతీ అధికారులు, ఇప్పటి మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని చెప్పే అధికారులు ఊరేళ్ళ మున్సిపల్ పరిధిలో ఫామ్ హౌస్ కడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా, మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు.ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అంగన్‌వాడీ పాఠశాలలో పాములు కనిపించడం గందరగోళానికి కారణమైంది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T131924.726.wav?_=4

 

అంగన్‌వాడీ పాఠశాలలో పాములు కనిపించడం గందరగోళానికి కారణమైంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మునిసిపల్‌లోని సికందర్‌వాడి ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడి మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ సమీపంలో జంగి ఘన్స్ మరియు డ్రెయిన్‌ల నుండి మురికి నీరు పేరుకుపోయింది, దీని కారణంగా అంగన్‌వాడి పాఠశాలలోకి ఒక విషపూరిత పాము అకస్మాత్తుగా చొరబడింది, ఇది అమాయక పిల్లలలో గందరగోళానికి దారితీసింది మరియు స్థానికులందరూ గుమిగూడారు మరియు స్థానిక యువకులు బెదిరింపుతో ఆ పామును చంపారు. మరియు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు స్థానికులు దీని గురించి అంగన్‌వాడి కార్యకర్తలు మరియు ఉన్నతాధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి ప్రభావం లేదని చెప్పారు. అమాయక పిల్లలతో పాటు, గర్భిణీ స్త్రీలు కూడా ఈ పాఠశాలకు వచ్చి వెళ్తారని ప్రజలు చెప్పారు. మరియు మురికి నీటి గుంట యొక్క లోతు చాలా లోతుగా ఉంది, పాఠశాలకు వచ్చే పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడిపోతే, అతను తన ప్రాణాలను కోల్పోతాడు. అందువల్ల, ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే, ఈ సమస్యపై దృష్టి పెట్టాలని మరియు పిల్లలు మరియు మహిళల భద్రత కోసం శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానికులు కోహిర్ మండల అంగన్‌వాడి అధికారికి విజ్ఞప్తి చేశారు.

పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T123451.911.wav?_=5

 

 

పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…

ఓపెన్ జిమ్ కు దారేది సార్లూ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 17 వ వార్డ్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇళ్ల మధ్య ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో పిచ్చి మొక్కలలో చెత్తాచెదరం చేరుకొని దోమలకు ఆవాసాలుగా మారి కాలనీవాసులు జ్వరాలు బారిన పడుతున్నారంటూ కాలనీవాసులు వాపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరగడంతో విష జ్వరాలకు నిలయంగా మారడంతో రాత్రిపూట బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరించడంతో పాటు క్రిమి కీటకాలు దోమల బెడద కూడా ఎక్కువైందని వారు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యా, డెంగి ,మలేరియా వంటి వైరల్ జ్వరాలు రాకుండా పిచ్చి మొక్కలను

తొలగించాలని మునిసిపాలిటీ అధికారులను వారు కోరుతున్నారు. ఎస్ఆర్కే పాఠశాల పక్కన గల రోడ్డు సరిగా లేదని, పాఠశాల సమీపంలో లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ ఐతే ఏర్పాటు చేశారు కానీ ఓపెన్ జిమ్ కు వెళ్ళే దారి మొత్తం పిచ్చి మొక్కలతో నిండుకు పోయిందని ,వ్యాయామం కోసం వెళ్లే వారు సైతం పిచ్చి మొక్కల ను చూసి ఓపెన్ జిమ్ కు వెళ్లలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడంతో స్థానిక నాయకులు సైతం కాలనీలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా స్థానిక మునిసిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ సమస్యలు తీర్చాలని వారు కోరుతున్నారు.

మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T125816.587.wav?_=6

 

మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత

◆:- ప్రతిరోజు ఇంతే కనబడదు పట్టించుకోలేని అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కోట్ల రూపాయలు పెట్టి మురికి కాల్వని నిర్మాణం చేసిన వాటి మీద అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ లేక నిర్లక్ష్యంగా వ్యవహరించి వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఆ మురికిని కొంచెం తమపై చిట్లించుకుంటున్న కూడా అధికారులు మాత్రం చూస్తూ వింతగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కావలసినంత పారిశుద్ధ్య కార్మికులు కార్మికులు ఉన్నప్పటికిని కొంతమంది దొరవారి దొడ్లకే పరిమితం అవుతున్నారు ప్రతిరోజు పురపాలక సంఘం అధికారులు కార్మికులకు హాజరు తీసుకుంటారు హాజరుకి అందరు వస్తారు కొద్దిసేపటికే కనుమరుగవుతారు అధికారులు ఇండ్లకు చేరుతారు తర్వాత అంతా కార్మికులు దొరల దొడ్లలో పనికి వెళ్తారు చిన్నపిల్లలను ఎత్తుకుంటారు వారి ముడ్లు కడుగుతుంటారు దొరల బట్టలు ఉతుకుతారు ఇల్లు వాకిళ్లు ఊడుస్తారు ఉద్యోగం పురపాలక సంఘం పని దొరలది ఇది జహీరాబాద్ పురపాలక సంఘం కార్మికుల దినచర్య అధికారుల నిర్లక్ష్యంతో ఏ మూల మలుపులో చూసిన విపరీతమైన చెత్త అది అక్కడే మురుగుతున్న పట్టించుకోరు వాటిని ఆసరా చేసుకొని ఊర కుక్కలు పందులు వీధి పశువులు కొండముచ్చులు విపరీతంగా పట్టణానికి వలస వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రజలపై ఎగబడి గాయపరుస్తున్నాయి ఆయన అధికారులకు పట్టింపు ఉండదు వాస్తవానికి ప్రజలకు చైతన్యం చేసే మార్గాలు అనేక ఉన్నప్పటికిని పట్టించుకునే పని లేదు రోజు ఎక్కడపడితే ప్రజలు చేత వేయాలి వేణు వెంటనే పురపాలక సంఘం కార్మికులు వీలైతే

తొలగించాలి లేకపోతే లేదు ఇది పరిస్థితి జహీరాబాద్ పురపాలక సంఘం దినచర్య నాయకులు ఎవరైనా ఏదైనా పని చెప్తే ఏదైనా సంస్కరణలు తీసుకురమ్మని చెప్తే నేరుగా వెళ్లి కార్మికులు ప్రజలతో పలాని నాయకుడు ఇలా చెప్తున్నాడు కొంచెం సక్రమంగా ఉండండి అని నాయకుల పేరు చెప్తారు తప్ప మీరు ఇలా చేయకూడదు ఇది చాలా తప్పు అధికారులు తప్పుపడుతున్నారు మీ పైన చర్యలు ఉంటాయని మాత్రం ఏ అధికారి చెప్పడు అధికారుల పూర్తిస్థాయి నిర్లక్ష్యంతో జహీరాబాద్ పట్టణమంతా మురికి తో మురికి కాలువలు నిండుకుండలాగా తయారై పొంగిపొర్లుతున్నాయి ఏ వీధిలో చూసినా విపరీతమైన దోమలు చిన్న పిల్లలు వృద్ధులు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా దోమల మందులు పిచికారి చేసేది లేనేలేదు కనీసం దోమలను పారద్రోలడానికి ఫాగింగ్ లాంటి పొగ చేసేది కూడా లేనేలేదు ప్రజలకు వ్యాధులు వస్తేనే మురికితో ముక్కుపూటలమురికితో ముక్కుపూటలు అదిరిపోతేనే అదిరిపోతేనే ఇవన్నీ మాకేం పట్టవు మాకు అడిగే వారెవరున్నారు పాలకవర్గం అయితే లేదు ప్రశ్నించినప్పుడు చూద్దాంలే ఇది జహీరాబాద్ పరిస్థితి

చేర్యాల పట్టణం పూర్తిగా జలమయం…

చేర్యాల పట్టణం పూర్తిగా జలమయం

కనబడని మున్సిపల్ అధికారులు

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల పట్టణంలో చిన్న చెరువు పెద్ద చెరువు భూకబ్జాల కారణంగా చేర్యాల పట్టణమంతా పూర్తిగా జలమయమైనది పలు కాలనీలలో ఇంటి లోపలికి నీరు వస్తున్నడంతో ప్రజలు పలువురు ఇబ్బంది పడ్డారు గాంధీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు

ఈ సందర్భంగా చేర్యాల పట్టణమంతా గాంధీ చౌరస్తా వద్ద భూకబ్జాలతో

మరియు బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం కాకుండా పూర్తిగా నెమ్మదిగా చేయడం వలన చేర్యాల సిద్దిపేట నేషనల్ హైవే పై మరియు చేర్యాల నుండి కడవేరుగు పోయే రోడ్డు కూడా పూర్తిగా మోకాళ్ళ లోతు నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరియు వాహనదారులు తమ వాహనాలు తో ఇబ్బంది పడడం కనబడినది అయినను మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది చొరవ తీసుకొని అక్రమ కట్టడాలను కూల్చకుండా కబ్జాలను ప్రోత్సహిస్తూ పలువురికి కొమ్ముకాస్తుండడం తీరుపై ప్రజలు ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తం చేస్తున్నారు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికీ చాలాసార్లు వర్షం వచ్చినప్పుడు జలమయమైన నామవాత్రపు చర్యలతో అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రెండు చెరువుల మధ్యలో ఉన్న చేర్యాల మున్సిపల్ ప్రాంతాన్ని నీటి గండాల నుండి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉన్నది అన్నారు చేర్యాల సిఐ ఎల్ శ్రీను మరియు చేర్యాల ఎస్సై నవీన్ మరియు వారి సిబ్బంది జెసిబి సహాయంతో అక్కడ ఉన్న నీటిని మళ్లించే కార్యక్రమం చేశారు కానీ శాశ్వత పరిష్కారం కొరకు ప్రజలు పట్టణవాసులు వాహనదారులు ఎదురుచూస్తున్నారు ఈ సమస్యపై అందరు పరిష్కారం కోరుకుంటున్నారు

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T132101.418.wav?_=7

 

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో కుక్కల పెడదా ఉన్నది.
రహదారి వెంబడి వెళ్లే బాటసారులను కుక్కల గుంపుగా తయారై అనేకమందిని కరవడం జరుగుతున్నది. ఇలా రోజు కరుస్తూ అనేక మందిని భయాందోళన కు గురిచేస్తూ హాస్పిటల్లో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.

 

సుమారు రెండు నెలల నుండి ఇలాంటి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతున్న, అధికారులు గాని పట్టణ నాయకులు గాని పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు మరియు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు తెలపడం జరిగినది. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు గానీ, సిబ్బంది గాని,
చర్య తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా సిరిసిల్ల పట్టణ వాసులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version