కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రాజన్న సునీల్ రావుపై ఆరోపణలను ఖండించారు

ప్రజా సేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేందర్ రావుపై అభ్యంతరంగా వ్యాఖ్యలు చేయడం తగదు- కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న

కరీంనగర్, నేటిధాత్రి:

42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న శనివారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మేయర్ సునీల్ రావు గతంలో తనపై మోపిన ఆరోపణలను ఖండిస్తూ డాక్టర్ రాజన్న తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మాజీ మేయర్ గా సునీల్ రావు ఎంత అవినీతికి పాల్పడ్డారో నగర ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలలో విమర్శలు ఆరోపణలు చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటుందని దానికి భిన్నంగా కుక్కలు పందులు అంటూ అసభ్యకరంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సునీల్ రావుకి తగదని, ప్రజా సేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేందర్ రావు కాంట్రాక్టర్ గా దోచుకున్నారని, దున్నపోతు అని మనిషిని పోల్చుతూ ఆరోపణలు చేయడం, అవినీతి అనకొండ రీతిగా అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేయడం, నేను నాఉద్యోగంలో భాగంగా గొర్రెలు అమ్ముకున్నానని అనుచిత వ్యాఖ్యలు చేసినారు, సునీల్ రావు చదువుకొని ఉంటే ఈవ్యాఖ్యలు చేసే వారు కాదని కొంత విజ్ఞతతో మాట్లాడాలని, నేను అవినీతికి పాల్పడి ఉంటే ఎప్పుడో జైలుకు వెళ్లే వాడినని, సరెండర్ కు సస్పెన్షన్కు తేడా తెలియని సునీల్ రావు ఐదు సంవత్సరాలు మేయర్ గా ఎలా ఉన్నారు అర్థం కావడంలేదని, సిమెన్ (వీర్యం) ఎలా తయారు చేస్తారు, ఎలా సప్లై చేస్తారు అనే విషయంలో కేవలం డాక్టర్లకు మాత్రమే అవగాహన ఉంటుందని తెలుసుకోవాలి, వ్యవహారం అంతా ఢిల్లీ ఎన్డిటిపి ఆధ్వర్యంలో నడుస్తుంది, దీనిపై అవగాహన లేకుండా అధ్వానంగా మాట్లాడవద్దని, నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినప్పుడు జగపతిరావు దగ్గర ఎమ్మెస్సార్ దగ్గర పొన్నం ప్రభాకర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మేయర్ అయినావు. మేయర్ పదవి ముగిసిన తర్వాత వినోద్ కుమార్ ను మోసం చేసి మళ్లీ నీరాజకీయ స్వలాభం కోసం బిజెపిలో చేరినావు, ఇప్పుడు బండి సంజయ్ ని ఏమి చేయాలనుకుంటున్నావు, బండి సంజయ్ సునీల్ రావు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నాపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. కలెక్టరేట్ హెలిపాడ్ వద్ద ఉన్న హనుమాన్ గుడి వద్ద తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు మేయర్ గా ఇలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రజల సొమ్ము దోచుకోలేదని నిరూపించదల్చుకుంటే నువ్వు కూడా తడి బట్టలతో వచ్చి హనుమాన్ గుడి వద్ద దేవుని పాదాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాజకీయంగా ఎదిగింది నువ్వైతే కష్టార్జితంతో ఉద్యోగం చేసి ఎదిగింది నేను. నేను ఎలాంటి వ్యక్తినో ఎవరి వద్ద శిష్యరికం చేశారో మీకు తెలుసు మీపని మీరు చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మంచితనమే గెలుస్తుంది తప్ప అవినీతి కాదు, నీగడీలోకి రానివ్వకుండా అందరిని బెదిరించావు. నువ్వు ఒక మేయర్ స్థానంలో ఉన్నావు కనుక నీతో పనులు అవుతాయని వచ్చిన వారిని బలహీన వర్గాలకు చెందిన వారిపై ఇంటి లోపల దొరలాగా ఉంటూ బయటికి వచ్చిన మీకోసం నేను ఏదైనా చేస్తాను ఎంతైనా చేస్తాను అంటూ రాజకీయ డ్రామా చేస్తావు. నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆర్టిఐ ద్వారా నాదగ్గర ఉన్న ఆయుధాలలో ఒక ఆయుధాన్ని ప్రయోగించినా నేను లోక్సత్తా ఎం.శ్రీనివాసు శిష్యుని వారు ఎవరికి భయపడరు అది మీకు తెలుసు నేను కేవలం చావుకు తప్ప నీపిల్ల బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరిస్తున్నాను. కలెక్టర్, మంత్రి నన్ను మళ్లీ పెద్దపెల్లికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు తెలుసుకోవాలని వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణలు చేయవలసి వస్తుందని తెలుసుకోవాలని, నన్ను ఆదరించే విషయం డివిజన్ ప్రజలు చూసుకుంటారని ఇక నుండి మీఅవినీతి చిట్టా బయట పెట్టడానికి నాదగ్గర ఆధారాలు చాలా ఉన్నాయని సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవి బయట పెడతానని హెచ్చరించారు. ఈపత్రిక విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్, మహమ్మద్ చాంద్, తదితరులు పాల్గొన్నారు.

కల్వకుర్తిలో బీజేపీ నేత హెచ్చరిక

కల్వకుర్తి జిల్లా ప్రకటిస్తే మున్సిపల్ ఎన్నికల్లో నుంచి తప్పుకుంటామన్న బిజెపి నేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో, ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆర్డీవో, సబ్ రిజిస్టర్, ఎస్ టి ఓ, ఆర్టీవో కార్యాలయా లను ఏర్పాటు చేస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేయమని బీజేపీ నేత, జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే బీజేపి లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోని కల్వకుర్తి భవిష్యత్తును మార్చాలని తల్లోజు ఆచారి విజ్ఞప్తి చేశారు.

నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తికి..

నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తికి.. ఎవరు ఎలాంటి శిక్ష వేశారో చూస్తే..

 

ఓ యువకుడు బహిరంగ ప్రదేశంలో డాల్ఫిన్ల నీటి కొలను ఎదురుగా నిలబడ్డాడు. చుట్టూ జనం ఉన్నా కూడా బహిరంగంగా సిగరెట్ వెలిగించాడు. గుప్పు గుప్పుమని పొగ ఊదుతూ సిగరెట్ తాగుతున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో జనం మధ్యలో ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తుంటారు. వారు అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అయితే చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే శిక్షణ కఠినంగా ఉంటాయి. ఇలాంటి సంఘనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తి పరిస్థితి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ములుగు పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు

గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని
మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మావోయిస్టులారా… అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T163655.510.wav?_=1

 

మావోయిస్టులారా… అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు

అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారు…

ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు

వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు

మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు

నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులు

తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవండి

మీకుమరో 4 నెలలు మాత్రమే గడువు

వచ్చేమార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతాం

వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత
సిరిసిల్ల/వేములవాడ(నేటి ధాత్రి):

 

అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ‘‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి.’’అని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మరో 4 నెలల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.

ఈరోజు సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) సహాకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఆసుపత్రి అంతా కలియ తిరిగి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్, అధికారులతో కొద్దిసేపు సమావేశమై ఆసుపత్రి అభివ్రుద్ధి, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…

కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో దేశంలోని అన్ని ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తొంది. ఆ నిధులతోనే ఆసుపత్రులు నడుస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యత్నిస్తోంది. చాలా ఆసుపత్రుల్లో సూదులు, మందులు, కాటన్ కూడా లేని పరిస్థితి ఉంటే…. నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆసుపత్రుల్లో పేదలకు పూర్తిగా వైద్య సేవలందించేందుకు యత్నిస్తున్నా. అందులో భాగంగా అల్ట్రాసౌండ్, ఈసీజీ మిషన్ వంటి ముఖ్యమైన 16 వైద్య పరికరాలను అందించాను. వేములవాడ ఆసుపత్రిలో మొత్తం రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ పరికరాలను కొనుగోలు చేశాం. దీంతోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఆసుపత్రులకు కూడా ఇదే స్థాయిలో వైద్య పరికరాలు అందిస్తున్నాం. అందుకోసం నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సహకారంతో రూ.5 కోట్ల సీఎస్సార్ నిధులను సేకరించి ఈ వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆయా ఆసుపత్రులకు అందించాం. భవిష్యత్తులో ఈ ఆసుపత్రులకు అన్ని రకాల సహాయం అందిస్తా.

యువ డాక్టర్లకు నా సూచన ఒక్కటే. డాక్టర్ల రిక్రూట్ మెంట్ కోసం కలెక్టర్ 89 వైద్య పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. యువ డాక్టర్లంతా దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు పొందాలని కోరుతున్నా. కరీంనగర్ నుండి వేములవాడ ఎంతో దూరం కూడా లేదు. ఉద్యోగాల్లో చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. మీ చదువుకు సార్ధకత, మీ తల్లిదండ్రుల రుణం తీరాలంటే పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. కరీంనగర్ సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేదలను ఆదుకుంటాం.

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ….

తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను చంపారు. పోలీసులను చంపారు. మా ప్రతాప రామక్రిష్ణను కూడా కాల్చి చంపేందుకు యత్నించారు. చావుదాకా వెళ్లొచ్చారు. జాతీయ జెండా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చంపారు. జాతీయ జెండా ఎగరేసేటోడు భారతీయుడా? నల్లజెండా ఎగరేసేటోడు భారతీయుడా? నక్సలైట్లది ఏ సిద్ధాంతం? తుపాకీ ద్వారా మీరు సాధించిందేమిటి? మీరు సాధించిందల్లా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మీరూ బలైపోయారు?

మేం బ్యాలెట్ ను నమ్ముకుని ముచ్చటగా మూడోసారి దేశ ప్రజల ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రాగలిగాం. మీరు తుపాకీ పట్టుకుని పోలీసులను, దళిత, గిరిజనులను చంపడం, మీరూ చనిపోవడం మినహా మీరు సాధించిందేమిటి? ఈ రోజు దేశంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం. దేశ సరిహద్దులో జవాను వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలి. మావోయిస్టులను తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలి. మావోయిజాన్ని అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిస్టులు లొంగిపోవాలని అమిత్ షా అవకాశమిచ్చినా వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తుపాకీతో అసలు మీరు సాధించేదేమిటి? తుపాకీ పట్టుకుంటే కక్షమించే ప్రసక్తే లేదు. కలం పట్టి చదువుకునే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు పట్టి అడవుల్లోకి పంపితే… తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు. చనిపోతున్నారు. ఎవరైనా లొంగిపోతే వాళ్లపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు.

మావోయిస్టులారా…. 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 2026 మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. అమిత్ షా మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య సాధించిందేమిటి? అర్బన్ నక్సల్స్ మాయలో పడి మీ ప్రాణాలు తీసుకోవద్దు. అర్బన్ నక్సల్స్ ఏసీల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పైరవీలు చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ కార్లలో తిరుగుతున్నారు. మీరు మాత్రం అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తుపాకీ పట్టుకుని తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి.

తుపాకీ పట్టుకుని చర్చలు జరుపుతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదు. బ్యాలెట్ ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోండి.

కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి….

కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి

హనుమకొండ జిల్లా, ఐనవోలు, నేటిధాత్రి.

ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో బుధవారం జరిగిన దుర్ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. నిన్న ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాత్రి సమయంలో ఓ ఇంటి గోడ కూలి, ఆ ఇంట్లో నిద్రిస్తున్న గద్దల సూరమ్మ (58) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ మరియు రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇళ్లను గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి పురాతన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

ఈ రోజు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లోద్దని,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని,విద్యుత్,త్రాగునీర,అంతరాయం కలగకుండా చూడాలని,రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలని,అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి చూసించారు.అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

పొన్నం ప్రభాకర్ దళిత మంత్రికి క్షమాపణ చెప్పాలి

దళిత మంత్రి అడ్లూరు లక్ష్మన్ కుమార్ ని దూషించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి -బెజ్జంకి అనిల్ మాదిగ

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ని అసభ్యపదజాలంతో దుషించిన పొన్నం ప్రభాకర్ ఇరవైనాలుగు గంటల్లోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వివేక్ తో పొన్నం ప్రభాకర్ దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు అని అహంకారంగ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వైఖరి నిరసిస్తూ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షేమాపణ చెప్పాలి లేదా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం పొన్నం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈనెల 8న జిల్లావ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం, ఈనెల 9నాడు పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అన్నారు.

 

ఈఇరవై నాలుగు గంటలు పోన్నం ప్రభాకర్ కి ఇస్తున్నాం. ఒక దళిత మంత్రిని అవమాన పరుస్తూ వివేక్ తో మాట్లాడినప్పుడు ఒక దళిత మంత్రిగా ఉండి కనీసం స్పందించలేదంటే దళిత పదం నీబతుకు తెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం మీరు ఏమి ఉపయోగపడరు అన్నది స్పష్టంగా మాకు అర్థమవుతుంది తక్షణమే పొన్నం ప్రభాకర్ మాటలను ఒక మంత్రిగా మీరు స్పందించాల్సిన బాధ్యత మీమీద కూడా ఉంది అని మేము వివేక్ కూడా గుర్తు చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బోయిని కొమురయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, దండు అంజయ్య మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, రేపాక బాబు మాదిగ, అలువాల సంపత్ మాదిగ, కనకం నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

మహేష్ పై దాడి చేసిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదు…

మహేష్ పై దాడి చేసిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదు.

యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

 

పంచకం మహేష్ యాదవ్ కుటుంబం పై దౌర్జన్యంగా దాడి చేయించిన పులి అంజిరెడ్డి తిరుపతిరెడ్డి కి ప్రజల సమక్షంలో పతనం తప్పదని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు.చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్ యాదవ సంఘం నాయకులతో కలిసి మాట్లాడుతూ మండలంలోని కాలువ పల్లి గ్రామానికి చెందిన పంచిక స్రవంతి మహేష్ యాదవ్ ల కుటుంబంపై దౌర్జన్యంగా దాడి చేయించి గాయపరిచిన మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,కాల్వపల్లి సర్పంచ్ అంజిరెడ్డిలు పంచిక మహేష్ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా మహేష్ కు తెలియజేయకుండా తెల్లారేసరికి అక్రమంగా దేవాలయ నిర్మాణం చేపట్టగా ఇదేమిటని మర్యాదపూర్వకంగా అడుగగా వారిపై దాడి చేయించడం పులి అంజిరెడ్డి కుటుంబానికి ఆప్రజాస్వామ్యమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ మండిపడ్డారు. పంచకం మహేష్ యాదవ్ బిజెపి పార్టీ నుండి రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షతో ఆ ఊరి నుండి మహేష్ ను వెల్లగొట్టాలని నీచమైన ఆలోచనలతో పులి కుటుంబం మహేష్ ను రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక దౌర్జన్యంగా దాడులకు, బెదిరింపులకు పాల్పడుతూ నీచమైన ఆలోచనలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వదిలిపెట్టదన్నారు.ఇప్పటికైనా మహేష్ కుటుంబం పట్ల మీ నీచ రాజకీయాలు మానుకోకపోతే కాల్వపల్లికి గ్రామానికి రాష్ట్రంలోని యాదవులమందరం ఏకమై నీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాములు యాదవ్, కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్, జంగా కొమురయ్య, చంద్రశేఖర్, సతీష్, శ్రీశైలం, సంపత్, దిలీప్,యాదవులు తదితరులు పాల్గొన్నారు.

కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌..

కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

 

 

తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు‌‌‌ భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డిలకి ముసళ్ల పండగ‌‌‌‌‌ ముందుందని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు‌‌‌ భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)లకి ముసళ్ల పండగ‌‌‌‌‌ ముందుందని హెచ్చరించారు. రవికుమార్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబును కోరుతామని అన్నారు. దొంగ దొరికితే వారితో సెటిల్‌మెంట్ చేస్తారా.. ?? అని ఫైర్ అయ్యారు. దొంగలందరూ దొంగతనం చేసి కరుణాకర్ రెడ్డి, జగన్‌ దగ్గరకు పోతే సెటిల్‌మెంట్ చేస్తారని ఆరోపించారు భాను ప్రకాష్ రెడ్డి.
రవికుమార్ దొంగతనం చేస్తుంటే పట్టుకుంది భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్నప్పుడేనని.. ఆ కేసు రాజీ చేసుకుంది కూడా ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు‌‌‌. ఇప్పుడు తనకేం తెలియదు అన్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సెటిల్‌మెంట్ రూ. 40కోట్లకు జరిగిందా.. రూ.400 కోట్లకు జరిగిందా ‌అనేది తేలుస్తామని హెచ్చరించారు భాను ప్రకాష్ రెడ్డి.రూ. 40కోట్ల శ్రీవారి ఆస్తులు కాపాడితే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి పరకామణి దొంగతనం విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. దొంగ దొరికితే లోక్ అదాలత్‌లో భూమన కరుణాకర్ రెడ్డి ఎలా కాంప్రమైజ్ చేస్తారని నిలదీశారు.‌‌ మరో రెండు రోజుల్లో శ్రీవారి పరకామణి దొంగతనానికి గురించిన సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. స్వామీ వారికంటే మనం గొప్ప వాళ్లమా అని ప్రశ్నించారు. అలాగే స్విమ్స్ మెడికల్ షాపుల్లో అవినీతికి పాల్పడి శ్రీవారి డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేసిన సరిపోతుందని తెలిపారు‌‌. జైలుకెళ్లడానికి భూమన కరుణాకర్ రెడ్డి అండ్ కో ఉత్సాహంగా ఉన్నారని భాను ప్రకాష్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు…

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్తూర్ శివారులో గల నారింజ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు ముఖ్యంగా వరద నీటి ఉద్రితిని నిరంతరం పర్వేక్షించాలని అధికారులను అదేశంచారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల లో నివాసముండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని నీళ్లలో ఉన్న కరెంటు పోల్స్ ను తాకడం మరియు దగ్గర నుండి వెళ్లడం చేయరాదని పొంగి పొర్లే వాగులు వంకలను చూడటానికి వెళ్లకూడదని జలాశయాలు నిండుకుండల మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పొంగిపోరిలే వాగులను దాటడానికి

 

 

ప్రయత్నించకూడదని అన్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా నియోజవర్గం లో పర్యటిస్తూ వివిధ శాఖల అధికారులను తగిన సూచనలను చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని పలు శాఖల అధికారులను ఆదేశించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారితో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ మాజి పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మాజి సర్పంచ్ లు కరణ్ రాజ్ జగదీష్ శంకర్ కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ అరుణ్ పాప్ నాథ్ భీమ్ రావు రాథోడ్ నవీన్ తేజ శశి వర్ధన్ రెడ్డి బి ఆర్ ఎస్వీ నాయకులు ఫయాజ్ గ్రామ నాయకులు యేసు అతీఫ్ రౌఫ్ రాజు శివరాజ్ తదితరులు ఉన్నారు ..

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.

హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

చిట్యాల మండలం లోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్ పై ఆగస్టు 15న జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్, ఆయన భార్యపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం పూర్తిగా బలహీనత రాజకీయాలు అని నేతలు విమర్శించారు. ఇలాంటి దాడులు ప్రజలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేవని, దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.

 

దాడికి వెనుక ఉన్న పులి తిరుపతి రెడ్డి – పులి అంజిరెడ్డి గ్యాంగ్.

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ –
ఈ దాడి వెనుక తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డి అనుచరులే ఉన్నారని స్పష్టమవుతోంది. వారే కుట్ర పన్ని, తమ అనుచరులను ప్రేరేపించి బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్, ఆయన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు.

తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లాభాల కోసం గ్రామంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ధైర్యం లేక భయపడి ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అనుచరులు గ్రామ ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కడమే తమ రాజకీయ విధానంగా మార్చుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఇకపై పనిచేయవని, ప్రజలు వారిని తిప్పికొడతారని నేతలు స్పష్టం చేశారు.

నిషిధర్ రెడ్డి గారి హెచ్చరిక

“గ్రామాల్లో బీజేపీకి విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ఈ పెరుగుతున్న శక్తిని తట్టుకోలేక ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తాత్కాలిక లాభాల కోసం పార్టీలను మార్చే వారు కాదు. వారు దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే నిజమైన యోధులు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీలను చిన్న పిల్లలు ఆట వస్తువులు మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరుడిగా మారి మా కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం ప్రజలు బహిరంగంగా గమనిస్తున్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా తన అనుచరులను అణగదొక్కే రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరం. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వహించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడమే ఆయన రాజకీయమైపోయింది.
ఇకనైనా మా కార్యకర్తలపై దాడులు జరిగితే బీజేపీ అస్సలు ఊరుకోదు. ప్రజాపరంగా, చట్టపరంగా గట్టి సమాధానం ఇస్తాం. ఇది మా చివరి హెచ్చరిక – ఖబర్దార్!” అని నిషిధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవికిరణ్
మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్టేకుమట్ల మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చక్క నరసయ్య బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అశోక్ చారి బిస్కుల రవి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఖండించిన గుడికందుల రమేశ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T153438.935.wav?_=2

 

మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఖండించిన గుడికందుల రమేశ్

మందమర్రి నేటి ధాత్రి

 

 

మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని సామాజిక ఉద్యమకారుడు గుడికందుల రమేశ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మందమర్రిలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులందరికీ ఏ ప్రాతంలోనైన వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. గో బ్యాక్ నినాదం వెనుక ఎదో కుట్ర ఉంటుదని, కాబట్టి ప్రజలు, యువకులు, విద్యార్థులు భాగస్వాములై నష్టపోవద్దని సూచించారు. తెలుగాణ ప్రాంతం గంగా, జమున, తెహజీబ్ కు ప్రతీక అన్నారు. ఇక్కడ కులం, మతం, ప్రాంతం అనే వైరుధ్యాలు, వైషమ్యాలు లేవన్నారు. ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొని ఆదిరించిన గొప్ప సరస్కతి, చరిత్ర కలిగిన నేల తెలంగాణ అన్నారు….

వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T165113.038.wav?_=3

వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.

అధికారులతో కలిసి వాగులు,లో లెవల్ కాజ్ వేలు,వరద ఉధృతిని పరిశీలన

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు.
వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలసి నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే ను,నల్లబెల్లి మండలంలోని లేంకాలపెల్లి నందిగామ గ్రామాల మధ్య కాజ్ వే,నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి రెడ్ అలర్ట్ గా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో,లో లెవెల్ కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు. చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని,విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువల్ని దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలకు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు రవిచంద్రారెడ్డి, ఎంపీడీవోలు,పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-4.wav?_=4

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు

మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

అర్ధరాత్రి కుండపోత వర్షం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-3.wav?_=5

అర్ధరాత్రి కుండపోత వర్షం.

#లో లెవెల్ బ్రిడ్జిలపై పొంగిపొర్లుతున్న వరద నీరు.

#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.

#మత్తడి దూకుతున్న పలు చెరువులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.

Flood water overflowing

అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

డబుల్ సెంచరీ కొట్టి తీరుతా..

డబుల్ సెంచరీ కొట్టి తీరుతా.. ఇంగ్లండ్‌కు సూర్యవంశీ వార్నింగ్!

ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

14 ఏళ్ల వయసులోనే స్టార్‌డమ్ సంపాదించాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19లో ఆడుతూ వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాటర్.. ఐపీఎల్-2025తో ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యవంశీ.. 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 252 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది పాత రికార్డులకు పాతర వేశాడు. అక్కడితో ఆగని వైభవ్.. ఇంగ్లండ్ టూర్‌లో భారత అండర్-19 జట్టుకు ఆడుతూ 52 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. 10 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్యవంశీ.. 78 బంతుల్లో 143 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అలాంటోడు ప్రత్యర్థులకు మరోమారు హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ వైభవ్ ఏమన్నాడంటే..

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

 

 

 

 

 

 

 

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

 

 

పల్నాడు జిల్లా: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో.. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్‌లను విసిరిపడేశారు. అంతేకాకుండా, అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. పిచ్చి వేశాలు వేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. బారికేడ్‌లు తొలగింపుపై మండిపడిన డీఎస్పీ అంబటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

 

 

కాగా.. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో ఆందోళనకర పరిస్థితులు కనిపించాయి. సత్తెన్నపల్లి పట్నంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి అంబటి హల్‌చల్ చేశారు. బారికేడ్లను ఎత్తివేసి వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి బారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

 

KL Rahul:నేటి ధాత్రి:

 

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్ట్‌లో థ్రిల్లింగ్ నాక్‌తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.

ఇది కదా కావాల్సింది..

ఇంగ్లండ్ లయన్స్‌తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్‌నెస్, మైండ్‌సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version