గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు, త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
అలాగే, శాంతి–భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యత: నూతన ఎస్సై శ్రీధర్

శాంతి భద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత..

ఆర్కేపీ నూతన ఎస్సై జె శ్రీధర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని రామకృష్ణాపూర్ పట్టణానికి నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జె శ్రీధర్ అన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి సాధారణ బదిలీపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జె శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్కేపీలో విధులు నిర్వహించిన భూమేష్ భూపాలపల్లి కి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం పోలీస్ స్టేషన్ కు ఎప్పుడైనా రావచ్చని హామీ ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రజలు, ప్రజా ప్రతినిదులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version