ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం
గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కేబుల్ వైర్ల వ్యవహారంపై మరోసారి హైకోర్టులో విచారణ..
ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
శ్రీ కృష్ణజన్మాష్టమి పర్వదినాన రామాంతపూర్ శోభాయాత్రలో జరిగిన విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో..హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్‌ను పరిశీలిస్తూ, ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించటం శోచనీయమని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికింది. కేబుల్ వైర్ల పునరుద్ధరణకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ నాగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అనంతరం ప్రభుత్వ అధికారులు కేబుల్ వైర్లను కట్ చేయడంతో టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ మరోసారి హైకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరపనుంది.
రామంతపూర్‌లో ఇటీవల చోటు చేసుకున్న విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో హైకోర్టు వైర్లు తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. కేబుల్‌లలో విద్యుత్ ప్రసారం జరగదని.. ప్రమాదానికి కేబుల్ వైర్లు కారణం కానే కాదని స్పష్టంచేశారు. వీటి తొలగింపుతో లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో వైపు,ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రాణనష్టం ఘటనను సీరియస్‌గా తీసుకున్న కమిషన్, బాధిత కుటుంబాలకు పరిహారంపై, ప్రమాదానికి దారితీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, విద్యుత్ శాఖను కూడా భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేబుల్ తొలగింపు విషయంలో హైకోర్టు కూడా స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్ల పునరుద్ధరణ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజల ప్రాణాలు పోతుంటే కేబుళ్ల అవసరం ఏమిటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యతను విస్మరించి ప్రజల భద్రత ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని పూర్తిగా తప్పుపట్టింది.
అయితే, అధికార అనుమతులతోనే కేబుళ్లు అమర్చామని.. ప్రతి స్తంభానికి ప్రభుత్వానికి రూ.1100 చొప్పున మొత్తం రూ.21కోట్లు చెల్లించామని భారతి ఎయిర్‌టెల్ వాదిస్తోంది. చెల్లింపుల వివరాలను గత విచారణలోనే హైకోర్టులో నివేదించింది. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం అప్పటికప్పుడు కేబుల్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వం నిబంధనను పట్టించుకోని కారణంగా తమ కస్టమర్లు అసౌకర్యానికి గురయ్యారని విన్నవించింది. డాక్టర్లు, న్యాయవాదులు, మీడియా, వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు– ఇంటర్నెట్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ తరఫున న్యాయవాది వాదిస్తూ, ఒకే స్తంభానికి అనధికారికంగా అనేక కేబుళ్లు అమర్చారని, ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందని పేర్కొన్నారు. దీంతో, జస్టిస్ నాగేశ్ భీమపాక పునరుద్ధరణపై తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. అన్ని పక్షాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించిన అనంతరం మాత్రమే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు.
మరో సినిమా చేయకుండా చేశారు.. హైకోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో
తమిళ ఆగ్ర నటుడు రవి మోహన్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
తమిళ ఆగ్ర నటుడు రవి మోహన్ (Ravi Mohan) మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిర్ణీత సమయంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేయనందుకు రూ.9 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా నిర్మాణ సంస్థను ఆదేశించాలని హీరో రవి మోహన్ మద్రాస్ హైకోర్టు (Madras High Court ) లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. కోవైకి చెందిన బాబీ టచ్ గోల్డ్ యూనివర్స్ (Bobby Touch Gold Universal Private Limited) అనే నిర్మాణ సంస్థ తనతో రెండు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. అయితే.. ఆ అగ్రిమెంట్ మేరకు చిత్ర నిర్మాణాలు ప్రారంభించని కారణంగా తన 80 రోజుల డేట్స్ వృథా అయ్యాయని, నేను మరో సినిమా చిత్రీకరణలో పాల్గొనకుండా జరిగిందన్నారు. అంతేగాక అదే సమయంలో అనేక సినిమాలు చేజారాయని, దాంతో.. తనకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని రూ. కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ రవి మోహన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ న్యాయమూర్తి అబ్దుల్ ఖుద్దూస్ (Justice Abdul Quddhose) సమక్షంలో విచారణకు రాగా ఈ పిటిషన్ విచారణకు అనర్హమైనదని, తమ మధ్యఒప్పందాన్ని ఉల్లంఘించి హీరో రవి మోహన్ పరాశక్తి (Parasakthi) సినిమాలో నటించారని నిర్మాణ సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.
హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు.. విషయం ఏంటంటే..
పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.
చెన్నై: పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay)కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది. తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలనసభ అధ్యక్షుడు పచ్చయప్పన్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో… తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్‌గా పనిచేస్తుందన్నారు.
ఈ సభ జెండాను ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.నిర్ధిష్ట రంగులు వినియోగించే హక్కు తమ సభకు మాత్రమే ఉందన్నారు. కానీ, నటుడు విజయ్ 2024లో ప్రారంభించిన టీవీకే జెండాలో ఎరుపు, పసుపు రంగులున్నాయని, అందువల్ల టీవీకే జెండాలోని రంగులు తొలగించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తి… ట్రేడ్ మార్క్ సర్టిపికెట్ సరుకులకు మాత్రమే వర్తిస్తుంది,
రాజకీయ పార్టీల జెండాలకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు. ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ సరుకులకు మాత్రమే కాకుండా సేవలకు వర్తిస్తుందని, స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్ట్‌లకు కూడా ఈ సర్టిఫికేట్ వర్తిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. అనంతరం న్యాయమూర్తి, ఈ పిటిషన్‌పై టీవీకే అధ్యక్షుడు విజయ్ అఫిడివిట్ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసి, విచారణ వాయిదావేశారు.
నటుడు దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం
రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడిగా ఉన్న హీరో దర్శన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము ఏకీభవించలేమని చెప్పింది. బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలపాలని నింధుతుడి తరపు లాయర్ ను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడుగా ఉన్న దర్శన్కు గతేడాది అక్టోబర్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా డిసెంబర్ 13న కర్నాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్‌డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్‌డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఎస్‌డీపీవోలందరూ ఒకే ఫార్మాట్‌లో నివేదికలు ఎలా సమర్పించారని ప్రశ్నించింది. కొన్ని జిల్లాల నివేదికలపై సంబంధిత జిల్లాల నోడల్ అధికారుల సంతకాలు లేవని, వారి బదులు ఇతర అధికారులు సంతకాలు చేశారని తెలిపింది. మంగళవారం ఓ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా విజయవాడ మూడవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఒక సీసీ కెమెరా మాత్రమే ఉన్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేసింది. అయితే, స్టేషన్‌ను వ్యక్తిగతంగా తనిఖీ చేసి ఠాణా మొత్తం కవర్ అయ్యేలా సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సర్టిఫై చేస్తూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. పరస్పర భిన్న నివేదికల నేపథ్యంలో ఎస్‌డీపీవోలు సమర్పించిన నివేదికల వాస్తవికతను తేల్చేందుకు అడ్వొకేట్ కమిటీని ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలీసుస్టేషన్లలో పర్యటించి రాణాలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ మొత్తం కనిపించేలా ఏర్పాటు చేశారా?లేదా? తదితర అంశాలపై కమిటీ నుంచి నివేదిక కోరతామని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేయలేదో వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ)ని ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఆ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యోగేష్ 2022లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పల్నాడుజిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారంటూ కటారు నాగరాజు గతేడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీకెమెరాల ఏర్పాటు జరగలేదన్నారు. రాష్ట్రంలో 1392 పోలీసుస్టేషన్లు ఉండగా, 1001 పోలీసుస్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్‌పలు ఉన్న అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో బోర్ వేస్తుండగా ఆపివేసిన దళితులు..
100 కు దయల్ చేసిన దళితులు.. బోర్ వెల్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలింపు.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
గీసుకొండ మండలంలోని గొర్రెకుంట దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 భూమిలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టే క్రమంలో వెంటనే గ్రహించిన (ఎస్సి – సి) మాల దళిత కులస్తులు హైకోర్టును ఆశ్రయించారు.కాగా పిర్యాదులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దళితులకు కాకుండా మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని స్టే ఆర్డర్ జారీచేసింది.ఐనప్పటికీ హైకోర్టు ఆర్థర్ ను ధిక్కరిస్తూ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సదరు కాంట్రాక్టర్ గురువారం పనులను ప్రారంభించేందుకు గాను ముందుగా రెండు బోర్ వెల్ వాహనాలతో బోర్లు వేయడం ప్రారంభించారు. వెంటనే గమనించిన దళిత మాల కులస్తులు పోలీస్ 100 కు సమాచారం ఇచ్చి పనులను ఆపే ప్రయత్నం చేశారు. దళితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు
Dalit land.
బోర్ వెల్ వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గొర్రెకుంట దళిత మాల కులస్తులు బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ లు మాట్లాడుతూ గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామంలో గల సర్వే నెంబర్ 55 భూమిలో గత డెబ్బై ఏండ్ల క్రితం నుండి మా దళితులు వ్యవసాయం సాగుచేసుకునేవారని అన్నారు.కాల క్రమేణా మూడు దశాబ్దాలకు నిరుపేదలమైన మా దళితమాల కులస్తులకు పునరావాసం లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో అదే సర్వే నెంబర్ 55 భూమిలో దళితుల అవాసాల కోసం ఇండ్ల నిర్మాణాలు చేపట్టుకోవడానికి ఆనాటి అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు.మాల దళితులకు కేటాయించిన భూమిలో నిర్మాణాలు చెప్పటాలని కొందరు వ్యక్తులు పన్నాగాలు పన్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే భూమిని అక్రమంగా స్వాదీనం చేసుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టారని అవేదన వ్యక్తం చేశారు.మాల దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను సంబంధిత విద్యుత్ సంస్థకు,అధికారులకు అందించామని ఐనప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ టీఎస్ 08 ఇ.పి 1974 , టీఎస్ 16 ఇపి 7413 గల బోర్ వెల్ వాహనాలతో అక్రమంగా బోర్లు వేస్తున్నారని ఆరోపించారు.వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 100 కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోర్ వెల్ పనులను ఆపివేసి వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారని బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ తెలిపారు.కాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎంపీడీసీఎల్ ఎస్ఈ లకు పిర్యాదులు చేయనున్నట్లు అలాగే గీసుకొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 గల ప్రభుత్వ భూమిని దళితులకే కేటాయించాలని
Dalit land.
ఈ సందర్భంగా బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్,మద్దెల క్రాంతి కుమార్,బందెల రణధీర్,బందెల అరుణ్,బందెల రాజశేఖర్,బందెల వంశీ,బందెల రమేష్,సిరిమిల్ల శరత్ చంద్ర, కొత్త శివశంకర్ పలువురు దళితులు కోరారు.
హైకోర్టు ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..
సొసైటి చైర్మన్ ను సన్మానించిన పలువురు నాయకులు..
నర్సంపేట,నేటిధాత్రి:
వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవీకాలం గత మూడు నెలల క్రితం ముగియడంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణ చేయలేకపోయిన ప్రభుత్వం మరల అదే పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన సుకినే రాజేశ్వర్ రావు మాత్రం భాద్యతలు ఇవ్వలేదు.దీంతో నర్సంపేట డివిజన్ పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సొసైటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వీరి వాదనలు విన్న హైకోర్టు మరల బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర,జిల్లా సహకార అధికారులకు ఉత్తర్వుల జారీ చేసింది. కాగా గురువారం సుకినే రాజేశ్వర్ రావు ఇంచార్జీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ నాచినపల్లి వ్యవసాయ సహకార సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ రైతులకు అందుబాటులో ఎరువులను అందించే విషయంలో ముందుంటామన్నారు. రైతులకు సంబంధించి క్రాఫ్ లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో సి. గ్రేడ్ ఉన్న సహకార సంఘాన్ని ఏ. గ్రేడ్ కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.డైరెక్టర్ల సహకారంతో రైతుల సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని రాజేశ్వర్ రావు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ రావు ను మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి చంద్రమౌళి, మాజీ చైర్మన్ గుడిపల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు గొర్రె జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బొరాల లింగయ్య తిమ్మంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రె జనార్దన్ రెడ్డి,నా చినపల్లి గ్రామ అధ్యక్షులు నర్రా రంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నల్ల శ్యాంసుందర్ రెడ్డి, గొసంగి పురుషోత్తం, మెరుగు రాజు, తుమ్మలపెల్లి సదానందం, హనుమకొండ లలిత బాబు, సాంబయ్య,సురావు సంజీవరావు, మోకిడే ప్రభాకర్, నరహరి భాస్కర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.
సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధా, అనిల్ కుమార్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర పాల్గొన్నారు.
-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ టికెట్ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.
ఒక సివిల్ తగాదా లో హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దానిని అమలు చెయ్యకుండా పిటిషనర్ల మీదనే కేసు నమోదు చేసిన విషయంలో గౌరవ హైకోర్టు మిల్స్ కాలనీ సిఐ వెంకట రత్నం మరియు ఎస్ ఐ శ్రీకాంత్ లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే ఏలుకుర్తి వాల్మీకి మరియు వారి కుటుంబ సభ్యులు తమకున్న ఫోర్ట్ వరంగల్ లో గల దూపకుంట లో సర్వే నెంబర్ 1263 (పాతది) 740 (కొత్తది) లో 2- 00 ఎకరాల భూమి కలదు. ఇట్టి భూమి పైకి బత్తుల సంపత్ కుమార్ మరియు కొందరు వచ్చి ఆక్రమించే ప్రయత్నం చెయ్యడం వలన సీనియర్ సివిల్ జడ్జి, వరంగల్ కోర్టు లో బత్తుల సంపత్ మరియు అతని కుమారునిపై సివిల్ దావా వెయ్యడం జరిగింది, ఇందులో గౌరవ కోర్టు వారు వాల్మీకి వాళ్లకు ఇంట్రిమ్ జంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐనా బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు భూమి పైకి దౌర్జన్యంగా రావడం వలన వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు వారు కింది కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను అమలు చెయ్యమని మిల్స్ కాలనీ పోలీస్ లను ఆదేశించింది. ఇట్టి విషయాన్ని వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ దృష్టికి తీసుక పోయారు, కానీ ఇంతలో మళ్ళీ బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు మళ్ళీ భూమి మీదకు వచ్చి దౌర్జన్యం చెయ్యగా వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ గారిని ఆశ్రయించారు, కానీ సిఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా బత్తుల సంపత్ ఇచ్చిన దరఖాస్తు మీద వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంలో వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు మళ్ళీ గౌరవ హైకోర్టు ను ఆశ్రయించి పోలీసుల పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు, గౌరవ హైకోర్టు తేదీ 24-01-2025 నాడు మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేస్తూ ఈ నెల 21 తారీకున వ్యక్తిగతంగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.