గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుకాణాన్ని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ముందుగా వారు స్టాక్ బోర్డును పరిశీలించి 616 యూరియా బ్యాగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని రైతులు అధైర్య పడద్దని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటాయని వారు తెలియజేయడం జరిగింది వారితో పాటు డి ఏ ఓ బాబురావు ఎం ఏ ఓ ఐలయ్య ఎమ్మార్వో మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో భాస్కర్ గణపురం మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి పాల్గొనడం జరిగింది

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో బుర్రకాయలగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రాలను, తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూము తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో ముకాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా నాణ్యత పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు వీలైనంత తొందరగా గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సత్వరం పనులు పూర్తి అయ్యేలా పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ పిడిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారని అడిగి తెలుసుకుని ఇసుక ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాల్వపల్లి నుండి ఇసుక తెస్తున్నట్లు పిడి తెలిపారు.
అనంతరం ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పశువుల చికిత్స కు వచ్చిన రైతులతో వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందులు స్టాకు ఉంచాలని, పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయాలని సూచించారు. పశు సంపదను కాపాడుకోవాలని తెలిపారు. అవసరమైన మందుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ డిడిని సూచించారు. ఈ సందర్భంగా గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు జిల్లా కాలెక్టర్ కు గొర్రె పిల్లను బహుకరించారు వ్యాధులతో బాధ పడే ప్రజలు వైద్యుల సలహాలు, సూచనలతో మేరకు క్రమం తప్పక మందులు వాడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.శుక్రవారం గణపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలకు వచ్చిన ప్రజలతో సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ పేరేంటి అని గట్టయ్యను అడిగి తెలుసుకుని ఏమి సమస్య ఉంది, వైద్యులు మంచిగా చూశారా లేదా మందులు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ అనే మహిళతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తేలు కుట్టినందున వైద్య సేవలకు వచ్చానని తెలుపగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. ఓపి రిజిస్టర్, స్టోర్ రూము ను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రాథమిక సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరం మేర తీసుకోవాలని సూచించారు. ధరల పట్టిక, స్టాకు రిజిస్టర్ పరిశీలించారు. ఈ రోజు ఇప్పటి వరకు ఎంత మంది రైతులు యూరియా తీసుకున్నారని వివరాలు అడుగగా 13 మంది రైతులకు 30 బస్తాలు యూరియా ఇచ్చామని తెలిపారు. ఎరువులు, విత్తన దుకాణాలను నిత్యం పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూములను పరిశీలించారు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ భారతి దరఖాస్తులు. పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. నోటీసు లు జారీ, విచారణ ప్రక్రియ, దరఖాస్తులు తిరస్కరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరస్కరించిన దరఖాస్తు దారులకు కారణాలు తెలియచేయాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయ సందర్శనలో కార్యాలయానికి వచ్చిన వయోవృద్ధునితో ఏ సమస్య కొరకు వచ్చారని అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ ఎల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన.!

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈనెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలి

సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు,

 

 

 

 

ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల,రేషన్ కార్డుల వేరిఫికేషన్,భూభారతి దరఖాస్తుల పరిష్కరణ,వన మహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8750 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 4806 గ్రౌండింగ్ అయి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని , మిగిలిన ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వారంలోగా నిర్మాణ పనుల గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో  ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజరులో ప్రధానమంత్రి అవాస యోజన గ్రామీన్ (పీఎంఏవైజి)

 

 

 

 

పథకం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన ఇండ్ల వివరాలు పంచాయతీ సెక్రెటరీ లు సర్వే చేసి వెంటనే పీఎంఏవైజి ఆప్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు.ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఒక్కో మునిసిపల్, మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.

 

 

 

ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.  నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు.ప్రజాపాలన దరఖాస్తుల రేషన్ కార్డుల జారీ వేరిఫికేషన్ పై మునిసిపల్, మండలాల వారిగా. కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లావ్యాప్తంగా 58,841 దరకాస్తులలో 41,836 దరకాస్తులు వేరిఫికేషన్ పూర్తయిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు. మీ సేవలో రేషన్ కార్డుల కొరకు జిల్లాలో 17866 దరకాస్తులు రాగా 7331 మంజూరు చేయడం జరిగిందని, మిగిలినవి వెంటనే వేరిఫికేషన్ చేయాలని సూచించారు.

 

 

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 31 లక్షల
మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించుటకు ప్రణాళిక ప్రకారం అనువైన ప్రదేశాన్ని  గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళిక లను సిద్ధం  చేసుకొని మన మహోత్సవ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ లలో పెద్దఎత్తున ప్లాంటేషన్ కు చర్యలు తీసుకోవాలని సూచించారు.భూ భారతి లో జిల్లావ్యాప్తంగా 50 850 వేల దరకాస్తులు రాగా అందులో 10 వేల 7 దరకాస్తులు మాత్రమే ఆర్ ఓ ఎఫ్ ఆర్ ప్రకారం చేయడం జరుగుతున్నదని,

 

 

 

 

మిగిలిన దరకాస్తులలో 47843 సాడబైనమా, ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు.ఆర్ ఓ ఆర్ పరిధిలో ఉన్న పదివేల దరఖాస్తులను ఆగస్టులో 15లోగా వేరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు  చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ , పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచుకొని ఎక్కడైతే నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపిస్తాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. గ్రామాలలో ప్రతి  ఫ్రై డే ను–డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి,డిఆర్డీఓ కౌసల్యాదేవి, గృహ నిర్మాణ శాఖ పిడి గణపతి, డిపిఓ కల్పన,రెవిన్యూ డివిజనల్ అధికారులు సత్యపాల్ రెడ్డి, రమాదేవి,మండల ప్రత్యేక అధికారులు,జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,బల్దియా ఉప కమిషనర్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు,ఎంపిఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి

వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం లో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కలెక్టర్ తో పాటు మిగతా అధికారులంతా మొక్కలు నాటారు.కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలందరూ వనమహోత్సవ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలని,ప్రతి ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రకృతిని,పచ్చని వాతావరణాన్ని పెంపొందించుకోవాలని,ఆరోగ్యమైన జీవితాన్ని పొందాలని తెలియజేశారు.ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్ తో పాటు డిఆర్ డిఓ కిషన్,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,ఈసీ,టిఏ,పంచాయితీ కార్యదర్శి,ఈజీఎస్ సిబ్బంది,ఐకెపి సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ నాయకులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.

మొక్కలే మానవ మనుగడకు మూలం

మొక్కలే మానవ మనుగడకు మూలం= జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్..

*ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోపణ 2025 కార్యక్రమం ప్రారంభం..

రామచంద్రపురం(నేటి ధాత్రి)

మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రపురం మండలం, కుప్పం బాదురు సమీపంలోని ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోపణ –2025 కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ,, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చున్నారు. అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో రావి, మర్రి చెట్ల నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ప్రజల ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షనీయమన్నారు.ప్రాణ యోగ ఆశ్రమ కైలాష్ గురూజీ మాట్లాడుతూ “వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే. ఆధ్యాత్మికత చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుంది, దీనివలన భూమికే కాదు, జీవాత్మకూ మహోన్నతమైన ఉపయోగం కాగలదు,

 

 

 

 

 

అని పేర్కొన్నారు. వృక్షారోపణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు, ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచే శుభారంభమన్నారు.ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక దైవచింతలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషమన్నారు.
అనంతరం ప్రాణ యోగ ఆశ్రమంలో పరిశుభ్రత పచ్చదనాన్ని భక్తుల వసతి భవనాలు, గోశాలలను పరిశీలించారు. ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను దుస్యాలువాతో సన్మానించి, జ్ఞాపకం అందజేశారు. ఈ వృక్షారోపణ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ కే ఎన్ సత్యనారాయణ,ఐఆర్ఎస్ అధికారిణి పాయల్ గుప్తా, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణరాజు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి. రాజేంద్ర ప్రసాద్, రాయుడు. ఎంపీడీవో ఇందిరమ్మ, ఏపీవో సుజాత, వ్యవసాయ శాఖ అధికారిణి మమత, వీఆర్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు..

బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను పరిశీలించిన

బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను పరిశీలించిన
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

సుభాష్ కాలనీలో నిర్మాణంలో ఉన్న బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతి రాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణంలో ఆలస్యానికి కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8 గదుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ గదులను ప్రత్యక్షంగా పరిశీలించి, పనుల నాణ్యత, వేగంపై పలు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా, వేగంగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన .

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

లక్ష్యం మేరకు జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ సాధించాలి

జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి

జూనియర్ కళాశాలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి

ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎనరోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాల, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటి పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాల పై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.

 

 

 

 

 

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలో మొదటి సంవత్సరం 1777 అడ్మిషన్స్ సాధించడం లక్ష్యం కాగా 63% 1116 మంది విద్యార్థులు ఎనరోల్ చేసుకోవడం జరిగిందని అన్నారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్ , విద్యుత్ సరఫరా, పారిశుధ్య, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన, మైనర్ రిపేర్ పనులకు ప్రభుత్వం 1కోటి 80 లక్షల రూపాయల మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.

 

 

 

 

 

 

జూనియర్ కళాశాలలో అందించే విద్య నాణ్యత పెరగాలని అన్నారు. లెక్చరర్ సకాలంలో కళాశాలకు హాజరు కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో సప్లమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాత వేములవాడ ,ఎల్లారెడ్డి పేట, ఇల్లంతకుంట కళాశాలలో ఫలితాలు తక్కువగా వచ్చాయని తెలిపారు.

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ విద్య చాలా వెనకబడిందని, మౌలిక వసతుల కల్పన పనులు, పరీక్ష ఫలితాలో చాలా ఇంప్రూవ్ కావాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి జూనియర్ కళాశాలలో రెగ్యులర్ గా స్టూడెంట్ కౌన్సిలర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.

 

 

 

 

జూనియర్ కళాశాలలో యాంటి డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ అందించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో క్రీడలు ఆడు ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

 

 

 

 

మన జిల్లాలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం అందించిన ప్రత్యేక శిక్షణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని, ఇదే స్పూర్తి కొనసాగించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు , టెన్నిస్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ క్యారం బోర్డులు చెస్ బోర్డులు ఏర్పాటు చేసి అందించాలని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆ రూట్ లలో కాలేజీ సమయాలకు అనుగుణంగా బస్సులు నడిచేలా ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.

కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి .

కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.

ఎంజీఎంలో మౌలిక సదుపాయాల మరమ్మత్తుల పనులను ప్రారంభించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 10 కేజీబీవీలలో అవసరమగు డార్మటరి,యూరినల్స్ , బాత్రూమ్స్, ఆరో ప్లాంట్స్ పనులు చేపట్టాలని,ఖానాపూర్,దుగ్గొండి, నల్లబెల్లి కేజీబీవీలలో
కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాయపర్తి కేజీబీవీలో డార్మిటరీ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.మిగిలిన కేజీబీవీ లలో కూడా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొన్న విధంగా సీలింగ్ మరమ్మత్తులు, అంతర్గత మరమ్మత్తులు తదితరులు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, ఎంజీఎం పర్యవేక్షకులు కిషోర్, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి ఫ్లోరెన్స్,ఇరిగేషన్ అధికారి సునీత, ఆర్ఎంఓ మాగంటి అశ్వినితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఎన్ఎస్పిసి పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

ఎన్ఎస్పిసి పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ (ఎన్.ఎస్.పి.సి) 2025 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ,వ్యర్థాల వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్వాలిని పేర్కొన్నారు.ఈ పోటీని హరిత్ , ద వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో పర్యావరణ సంరక్షణ
అనే ఉద్దేశంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు.జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయనీ,కేంద్ర విద్యా,పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారనీ చెప్పారు. ఫలితాలు ఆగస్టు 30న విడుదల విడుదల చేస్తామన్నారు.పోటీ ఐదు విభాగాలలో..1వ నుండి 5వ తరగతి, 6వ నుండి 8వ తరగతి, 9వ నుండి 12వ తరగతి,డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు,ఇతరులు / సాధారణ పౌరులు పోటీలో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు.ఈకో మిత్ర https://ecomitram.app/nspc/
అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చన్నారు.హిందీ, ఇంగ్లీష్ సహా అనేక భాషలలో క్విజ్ అందుబాటులో ఉంటుందనీ, మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న మీ సెల్ఫీని అప్లోడ్ చేయడం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి పాల్గొన్నందుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందనీ, ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ పోటీలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జ్ఞానేశ్వర్,జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన సిపిఐ కరీంనగర్ జిల్లా మహాసభలో నూతనంగా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పరిచయం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను పంజాల శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. పంజాల శ్రీనివాస్ విద్యార్థి దశ నుండే చురుకైన వాడని, విద్యార్థి, యువజన రంగాలలో పనిచేసి, పార్టీలో జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగాడని ప్రజా సమస్యల పై అధికారులు కలిసినప్పుడు స్పందించాలని కలెక్టర్ ను వెంకటరెడ్డి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటనలో శ్రీనివాస్ తెలిపారు.

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని రెండవ బైపాస్ చంద్రంపేట ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అధికారిక పర్యటన నిమిత్తం అటుగా వెళుతున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రమాదాన్ని చూసి గాయపడిన యువకులను అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .

అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్.

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్
విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని జిల్లా కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆమె తల్లితండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్ బ్యాంక్ ను కలెక్టర్ పరిశీలించారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి, వైద్య సేవల తీరుపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version