రౌడీషీటర్‌పై బహిష్కరణ ఉత్తర్వులు

రౌడీషీటర్‌ ను కమిషనరేట్ నుంచి బహిష్కరణ

ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి వెలివేత

సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు

వరంగల్ నేటిధాత్రి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్‌పై పోలీస్ కమిషనరేట్ తొలిసారిగా కఠిన చర్యలు చేపట్టింది. మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (31)ను ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం–1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం–2015)లోని సెక్షన్ 26(1) ప్రకారం ఈ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్వుల అనంతరం మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ మిథున్‌లు నిందితుడు కోతి సురేష్‌కు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో బహిష్కరణ ఉత్తర్వులను అందజేశారు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతని అక్రమ కార్యకలాపాల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, ఫిర్యాదులు చేయడానికీ ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కారణాలు చూపించాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, నిందితుడు సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదని, ఎలాంటి వ్రాతపూర్వక వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన పోలీసులు, అతని ప్రవర్తన ప్రజా శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారిందని నిర్ధారించారు.

అందువల్ల ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు నెలల కాలానికి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు హాజరు సందర్భంలో మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేసిన గౌరవ హైకోర్టు

ఫిబ్రవరి, 21 తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశం:-

 

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

 

ఒక సివిల్ తగాదా లో హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దానిని అమలు చెయ్యకుండా పిటిషనర్ల మీదనే కేసు నమోదు చేసిన విషయంలో గౌరవ హైకోర్టు మిల్స్ కాలనీ సిఐ వెంకట రత్నం మరియు ఎస్ ఐ శ్రీకాంత్ లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే ఏలుకుర్తి వాల్మీకి మరియు వారి కుటుంబ సభ్యులు తమకున్న ఫోర్ట్ వరంగల్ లో గల దూపకుంట లో సర్వే నెంబర్ 1263 (పాతది) 740 (కొత్తది) లో 2- 00 ఎకరాల భూమి కలదు. ఇట్టి భూమి పైకి బత్తుల సంపత్ కుమార్ మరియు కొందరు వచ్చి ఆక్రమించే ప్రయత్నం చెయ్యడం వలన సీనియర్ సివిల్ జడ్జి, వరంగల్ కోర్టు లో బత్తుల సంపత్ మరియు అతని కుమారునిపై సివిల్ దావా వెయ్యడం జరిగింది, ఇందులో గౌరవ కోర్టు వారు వాల్మీకి వాళ్లకు ఇంట్రిమ్ జంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐనా బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు భూమి పైకి దౌర్జన్యంగా రావడం వలన వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు వారు కింది కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను అమలు చెయ్యమని మిల్స్ కాలనీ పోలీస్ లను ఆదేశించింది. ఇట్టి విషయాన్ని వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ దృష్టికి తీసుక పోయారు, కానీ ఇంతలో మళ్ళీ బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు మళ్ళీ భూమి మీదకు వచ్చి దౌర్జన్యం చెయ్యగా వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ గారిని ఆశ్రయించారు, కానీ సిఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా బత్తుల సంపత్ ఇచ్చిన దరఖాస్తు మీద వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంలో వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు మళ్ళీ గౌరవ హైకోర్టు ను ఆశ్రయించి పోలీసుల పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు, గౌరవ హైకోర్టు తేదీ 24-01-2025 నాడు మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేస్తూ ఈ నెల 21 తారీకున వ్యక్తిగతంగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version