గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నిషేధిత చైనీస్ మాంజ ను ఉపయోగించి గాలిపటం ఎగురవేసే క్రమంలో యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలైన ఘటన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్ కాలనీలో చోటు చేసుకుంది. బీహార్ ప్రాంతానికి చెందిన నిరాజ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు పట్టణ పరిధిలోని స్థానిక పరిశ్రమలలో పని చేసుకొంటూ సంక్రాంతి పండుగ ను ఆస్వాదించేందుకు గురువారం మధ్యాహ్నం సమయంలో తాము అద్దె కు ఉన్న ఇంటి పైన గాలి పటాలు నిషేధిత చైనీస్ మాంజ తో ఎగురిస్తున్న క్రమంలో చైనీస్ మంజ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బీహార్ యువకులకు విద్యుత్ షాక్ తగిలిందాన్న విషయన్ని తెలుసుకోన్న బిఅర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ స్పందించి బాధితులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ శికిత్స చేసి మెరగైన వైద్య సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
