శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

 

 

ఫొటో క్యాప్షన్,భారీ వర్షాల కారణంగా కొలంబోలోని కడువెల ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతం

గమనిక : ఈ కథనంలో కలచి వేసే అంశాలున్నాయి

శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఇప్పటి వరకు 193 మంది చనిపోయారని, 228 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.

వరదల వల్ల 26,114 కుటుంబాలకు చెందిన 9.68 లక్షల మంది ప్రభావితమయ్యారు. భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

దిత్వా తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకి దక్షిణంగా 250 కి.మీ. దూరం ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

అది తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. ఆదివారం (నవంబర్ 30) సాయంత్రానికి తీరాన్ని సమీపిస్తుందని అంచనా

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను కారణంగా తమిళనాడుతోపాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుపాను తూర్పు వైపుకు కదిలి ఇండోనేషియాలో భారీ నష్టాన్ని కలిగించింది.

ఈ వారం బంగాళాఖాతంలో మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్, శ్రీలంకకు దక్షిణంగా దిత్వా అనే రెండు తుపానులు దాదాపు ఒకేసారి వచ్చాయి.

“బంగాళాఖాతంలో ఇది చాలా అరుదైన సంఘటన” అని స్వతంత్ర వాతావరణ శాస్త్రవేత్త శ్రీకాంత్ అన్నారు.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను ప్రభావం తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్,శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

డిసెంబర్ 1న తుపాను వేగం గంటకు 45-55 కి.మీ.లకు (అప్పుడప్పుడు గంటకు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి) తగ్గుతుంది.

తుపానును దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

ఫొటో క్యాప్షన్,శ్రీలంకలోని కాండీ సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

శ్రీలంకలోని కాండీలోని సరసవిగమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు పిల్లలు సహా 23 మంది తమిళులు మరణించారని స్థానికులు బీబీసీతో చెప్పారు. కొండచరియలు విరిగిపడిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.

కొండ చరియలు విరిగి పడినప్పుడు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటికే మరోసారి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెప్పారు.

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి మృతదేహాలను వెదికేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.

ఫొటో క్యాప్షన్,కొలంబో శివారు ప్రాంతం వెల్లంపిటియలో వరద నీటిలో సురక్షిత ప్రాంతానికి వెళుతున్న స్థానికులు.

దిత్వా తుపాను శుక్రవారం శ్రీలంకను తాకింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తింది.

బదుల్లా జిల్లాలో (తేయాకు తోటలు ఉన్న ప్రాంతం) కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.

కాండీ, అంపారా, బదుల్లా జిల్లాల్లోనే తుపాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులను మూసివేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైనవి మినహా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు, రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ ఫైనల్ క్రికెట్‌ మ్యాచ్‌లో తుపాను బాధితుల కోసం శ్రీలంక క్రికెటర్లు ఒక నిముషం మౌనం పాటించారు.

తుఫాన్ బీభత్సం…

తుఫాన్ బీభత్సం

నెక్కొండ మండలంలో భారీ నష్టం

#నెక్కొండ,నేటి ధాత్రి :

మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెక్కొండ, నర్సంపేట, కేసముద్రం, చంద్రుగొండ పరిసర గ్రామాలు వాగులు, వరదలతో చుట్టుముట్టి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు చెరువుల్లా మారిపోగా, పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పనికర రైతులు వట్టేవాగు వెంబడి సుమారు 500 ఎకరాల పైన పంట నీట మునిగింది .ఈ పంట మొత్తం పది రోజుల్లో చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రమైన ఆవేదన అవుతున్నారు. పనికర గ్రామానికి చెందిన బుర్ర సమ్మిరెడ్డి సంజీవ గర్నెపల్లి రామిరెడ్డి ,సుదర్శన్ రెడ్డి, రాజనర్సింహారెడ్డి, రేగుల ప్రతాపరెడ్డి పైండ్ల రాములు, మధు ,లక్ష్మయ్య, కమలమ్మ,సింగం సమ్మయ్య ఒగ్గుల దేవేందర్ ,ప్రభాకర్, దూదిపాల బాబు, బిక్షపతి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గడ్డ బోయిన కుమారస్వామి, కాశబోయిన కుమార్, కొత్త మోహన్ రెడ్డి, రైతుల
పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనికర గ్రామానికి చెందిన రైతు బుర్ర సమ్మిరెడ్డి, భార్య సరోజన ,దంపతులు వేదనతో చెబుతూ “నాలుగు రోజులైతే కోయాల్సిన పంట వట్టే వాగులో కొట్టుకుపోయింది. లక్షల్లో నష్టం జరిగింది. కొద్ది నెలల క్రితం చనిపోయిన మా చిన్నకొడుకు చేసిన అప్పులు తీర్చే అవకాశం ఈసారి వస్తుందని అనుకున్నాం, కానీ మళ్లీ దెబ్బతిన్నాం” అని కన్నీటి స్వరంతో తెలిపారు.
పంట నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైందని చెబుతున్నారు. అధికారులు గ్రామాల పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన….

ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన

 

కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.

అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా ఎగువన కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. భారీ వర్షాల వల్ల కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శాఖాపరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పరిహహక ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది.

కాగా… మొంథా తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తుపాను ఎఫెక్ట్‌తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం…

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

పలు గ్రామాలలోని కాలనీలలో చేరిన వరద నీరు

వేల ఎకరాలలో మునిగిన వరి పంట

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.

ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ

నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.

ఎవరు కూడా బయటికి రావద్దు

భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.

తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..

తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

#అధికారులు,కాంగ్రెస్ నేతలు ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే నాయిని విజ్ఞప్తి..

#మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా హనుమకొండ నగరంలో వరద పరిస్థితి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

హన్మకొండ, నేటిధాత్రి:

 

నగరంలో చాలా చోట్ల వరద ప్రవాహం కన్పిస్తుంది..
టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడూ సమాచారం ఇవ్వండి..
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు…
సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ :
1800 4251115
18004251980

చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు….

చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు

 

 

వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Chittoor Rains) కురుస్తున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు రెండు ప్రాజెక్టుల్లోనూ రెండు గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని నీవా నది లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కళాశాలలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తోంది జిల్లా యంత్రాంగం. పది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూరగాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

కాగా.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని.. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొంగిపోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.

రామాయంపేట అభివృద్ధి జనహృదయనేత సుప్రభాత్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T143429.082.wav?_=1

 

రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..

రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.

 

Development

రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం.
రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.

 

Development

 

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-13T133623.743.wav?_=2

బల్దియా నిధులను బర్బాద్ చేస్తున్న మేయర్..? “సీఎం” ఆదేశాలు బేకతార్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించండి. వరంగల్ మేయర్ నిధుల దుర్వినియోగంపై ఆరా తీయండి అని వేడుకుంటున్న వరంగల్ ప్రజలు

వరంగల్ మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై పూర్తి కథనం త్వరలో.. మీ”నేటిధాత్రి”లో..

“నేటిధాత్రి”, వరంగల్.

రాష్ట్రంలోని అధికారులు, నాయకులు వర్షాలు, వరదల విషయంలో అందరూ అందుబాటులో ఉండాలి అని ఒకపక్క సీఎం చెబుతుంటే, వరంగల్ మేయర్ మాత్రం స్టడీ టూర్ పేరుతో నగరాన్ని పట్టించుకోకుండా తన సొంత లాభం కోసం కార్పోరేటర్లని పట్టుకొని విహారయాత్రలకు వెళ్తుండటం వివాదాస్పదంగా మారింది.

మళ్లీ గెలవాలనే తాపత్రయంతో కార్పోరేటర్ లను మచ్చిక చేసుకోవడానికి కోసం స్టడీ టూర్ పేరుతో, ప్రజల సొమ్ముతో విహారయాత్ర?

గ్రేటర్ వరంగల్ నగర సమస్యలు గాలికి వదిలేసి “ఇండోర్ స్టడీ టూర్ కు ఏర్పాట్లు”

గ్రేటర్ వరంగల్ నగరంలో రోడ్లు బాగాలేక, అనేక సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా, వరంగల్ మున్సిపల్ పాలకవర్గం ఇండోర్ స్టడీ టూర్ పై అడుగులు వేయడం నగరవాసులు, ప్రతిపక్షాల్లో చర్చనీయాంశమైంది.

సుమారు 55మంది కార్పొరేటర్లు, మేయర్‌తో పాటు అధికారులు 25మంది కలిసి స్టడీ టూర్ పేరుతో (విహారయాత్ర) వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతుండటంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

టూర్ ఖర్చు దాదాపు 50లక్షల రూపాయల పైవరకు వెళ్తుందని వినిపిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రజల సొమ్ముతో ఖర్చు చేయడం సమంజసమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకపక్క నగర ప్రజలు వరదల నుండి తేరుకోక ముందే విహార యాత్రలు ఎందుకు? మరోవైపు రాబోయే ఐదు రోజులు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు.

మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వర్షాల సమయంలో అప్రమత్తంగా నాయకులు నగరాల్లో అందుబాటులో ఉండాలని చెప్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉండాల్సిన నాయకులు స్టడీ టూర్ పేరు మీద విహారయాత్రలా అని ఆగ్రహిస్తున్న ప్రజలు

మునిసిపల్ శాఖలో నిధులు లేవంటూనే, స్టడీ టూర్లు పెట్టి, విహార యాత్రలు చేస్తూ, ప్రజలు కడుతున్న పన్నులను విహారయాత్రలకు వినియోగిస్తోంది నగర మేయర్ అంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు

నగర మేయర్ మీకిది తగునా? నగర సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నిస్తున్న సామాన్యులు..

వరదలు వచ్చి, ఇప్పటికీ తేరుకొని నగరవాసులు. మరోసారి మేయర్ పదవి కోసమేనా ఈ టూర్? ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అంటున్న ప్రతిపక్షాలు..

నగరంలో సమస్యలు అనేకం ఉన్నాయి.. ఇప్పుడు ఇంత భారీ బృందం, టూర్ పేరుతో ఇండోర్ వెళ్ళడం, వరంగల్ ప్రజల డబ్బు వృథా చేయడమేనంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

“నగరంలోనే పరిష్కరించాల్సిన అంశాలు పరిష్కరించలేకపోతూ, ఇండోర్ స్టడీ టూర్ అవసరమా?” అనే ప్రశ్న ముందుకు వచ్చింది.

పోయిన సారి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. 10 వేల ఫోనుకు 30,000 బిల్లు పెట్టింది అని విమర్శలు వచ్చాయి? ప్రజల సొమ్ముతో సెల్ ఫోన్లు కొనివ్వడం ఏంటి అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ సెల్ ఫోన్ల వెనుక పెద్ద ఎత్తున దండుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి

టూర్ ఖర్చులు, సెల్ ఫోన్ల ఖర్చులు.. నగర “మేయర్” ఈ ఖర్చులపై ప్రజలకు మీడియా ద్వారా సమాధానం ఇవ్వాలంటూ సామాన్యుల నుండి స్వరాలు వినిపిస్తున్నాయి.

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన…

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన
.
వనపర్తి నేటిదాత్రి .

 

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ భారీవర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్. సి,ఎస్.టి వసతి గృహాలు,జంగిడిపురం,భగీరథ కాలనీ వెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగు పారడం,పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళవరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు అతిభారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ల లో కి వరద నీరు రావడంతో వార్డు ప్రజలు మాజీ వైస్ చైర్మన్ దృష్టి కి తెచ్చారు వెంటనే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ వెంట బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వనపర్తి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

నిజాంపేటలో బ్రిడ్జి కూల్పు – అత్యవసర సేవలకు అడ్డంకి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T154818.006.wav?_=3

 

బ్రిడ్జ్ నిర్మించండి!
• అత్యవసర సేవలకు ఈ రోడ్డు లో బ్రేక్..
• 5 కిలోమీటర్ల గమ్యాన్ని 11 కిలోమీటర్ల దూరంలో వెళ్లాలి..

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండలం అతలాకుతులమైంది. నిజాంపేట – నస్కల్ వెళ్లే రోడ్డు మార్గ మధ్యలో మల్కచెరువు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి వరద ఉధృతి తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోయింది. అలాగే నిజాంపేట, చల్మెడ, బీబీపేట గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో నీరు ప్రవాహం అధికంగా చేరి రోడ్డు పాయలుగా చీలిపోయింది. అయితే ఈ గ్రామాలకు అధికారులు రోడ్డుపై మట్టి పోసి తాత్కాలిక మరమ్మత్తులగా చేశారు. కానీ నిజాంపేట – నస్కల్ వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి కూలిపోవడంతో అత్యవసరగా మైన 108 అంబులెన్స్ సేవలు కూడా కష్టతరంగా మారాయి అన్నారు. ఈ రోడ్డులో ఓ ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని నాలుగు గ్రామాల గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఐదు కిలోమీటర్ల గమ్యాన్ని 11 కిలోమీటర్ల చేరాలంటే చాలా ఇబ్బందిగా పడవలసి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.

పోలీసుల సేవలకు సలామ్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T122317.302.wav?_=4

పోలీసుల సేవలకు సలామ్..!!

◆:- ప్రజల క్షేమమే ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ లక్ష్యం

◆:- వరుణుడి బీభత్సం.. సహాయ కార్యక్రమాలలో పోలీసుల కృషి

◆:- మండలంలో సుడిగాలి పర్యటన, ప్రజలకు సలహాలు తగు సూచనలు

◆:- ముందస్తు చర్యల్లో ఎస్ఐ సేవలు అభినందనీయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఒక్కసారిగా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు, రైతులు అతలాకు తలమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇటు వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, అటు వర్షానికి కూలిన ఇండ్లు దీంతో భారీ నష్టానికి గురైన ప్రజలు, రైతులు.

 

అదేవిధంగా చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ తన సిబ్బందితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడటమే కాకుండా భారీ వర్షానికి ఇండ్లలోకి ప్రవహిస్తున్న నీటిని చూసి భయాందోళన చెందుతున్న ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ..

 

 

వారిని కూడా కాపాడి ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చెరువు, కుంటలు నిండి రోడ్లపై భారీగా నీరు వరదల ప్రవహించడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు, రైతులకు తగు సూచనలు,సలహాలు ఇస్తూ రాకపోకలను నిలిపివేశారు. ప్రజల క్షేమమే తన బాధ్యతగా తీసుకొని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం మండల జిర్లాపల్లి ప్యాలారం దేవరంపల్లి ఎల్గోయి కృష్ణాపూర్ పోటీపల్లి గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్య టించారు. ప్రజలు భారీ వర్షాలు ఉండడంవల్ల అప్ర మత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని ఇటు రైతులను అటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఎలాంటి భయాందోళన చెందవద్దని పోలీసుల కృషి, అండ ఉంటుందని ధైర్యాన్ని ఇస్తూ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ చేస్తున్న సేవలకు హాట్సాఫ్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా అని లెక్కచేయకుండా తన విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలిచిన ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సలాం కొడుతున్నారు.

 

 

ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు : ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటి ప్రమాదం ఉన్నందున రాకపోకలు నిలిపివేశామని అదేవిధంగా అత్యవసర సమయాల్లో ప్రజలు బయటకు వెళ్లాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండేల చర్యలు చేపడుతున్నా మని అన్నారు.

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539-1.wav?_=5

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539.wav?_=6

ఈ విషయాన్ని తెలుసుకున్న న్యాల్కల్ తహశీల్దార్ ప్రభు ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావు బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. వారిని తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. అంతేకాకుండా, ఆహారం, కొంత నగదు సహాయం అందజేసి ఆదుకున్నారు

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు…

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్తూర్ శివారులో గల నారింజ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు ముఖ్యంగా వరద నీటి ఉద్రితిని నిరంతరం పర్వేక్షించాలని అధికారులను అదేశంచారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల లో నివాసముండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని నీళ్లలో ఉన్న కరెంటు పోల్స్ ను తాకడం మరియు దగ్గర నుండి వెళ్లడం చేయరాదని పొంగి పొర్లే వాగులు వంకలను చూడటానికి వెళ్లకూడదని జలాశయాలు నిండుకుండల మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పొంగిపోరిలే వాగులను దాటడానికి

 

 

ప్రయత్నించకూడదని అన్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా నియోజవర్గం లో పర్యటిస్తూ వివిధ శాఖల అధికారులను తగిన సూచనలను చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని పలు శాఖల అధికారులను ఆదేశించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారితో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ మాజి పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మాజి సర్పంచ్ లు కరణ్ రాజ్ జగదీష్ శంకర్ కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ అరుణ్ పాప్ నాథ్ భీమ్ రావు రాథోడ్ నవీన్ తేజ శశి వర్ధన్ రెడ్డి బి ఆర్ ఎస్వీ నాయకులు ఫయాజ్ గ్రామ నాయకులు యేసు అతీఫ్ రౌఫ్ రాజు శివరాజ్ తదితరులు ఉన్నారు ..

రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన…

రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
ప్రజల సమస్యలు తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవిని రఘునందన్ రావు..

రామాయంపేట ఆగస్ట్ 28 నేటి ధాత్రి (మెదక్)

ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవిని రఘునందన్ రావు రామాయంపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను కూడా వివరాలు అడిగి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ అకాల వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున సహాయం అందించడానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పట్టణంలో నీటి పారుదల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్శన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిలం అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు వెలుముల సీద్దరాములు, శంకర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం ప్రశాంత్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు జొన్నల భరత్, భాసం అనిల్, కడెం సిద్ధార్థ, లావణ్య, కటిక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలోని గంగమ్మకు గంగపుత్రులు ప్రత్యేక పూజలు…

సిరిసిల్లలోని గంగమ్మకు గంగపుత్రులు ప్రత్యేక పూజలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు లోని గంగమ్మ దేవాలయం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహానికి సిరిసిల్ల
గంగ పుత్రులు ప్రత్యేకంగా గంగమ్మకు శాంతి చేకూరాలని బోనాలతో మరియు అమ్మవారి విగ్రహ పల్లకి సేవతో ఊరేగింపుగా బయలుదేరి మానేరు గంగమ్మ నీటిలో ప్రత్యేక కుంకుమ పూజలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణకు సంబంధించిన గంగపుత్రులు మరియు పరిసర గ్రామాల గంగపుత్రులు అంగరంగ వైభవంగా వెళ్లి మానేరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T153306.328-1.wav?_=7

 

 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

– మరో మూడు రోజులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…..

– జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…

కొల్చారం,( మెదక్)నేటి ధాత్రి:-

 

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ కోరారు. పాత ఇళ్లలో ఉన్నవారు కూలిపోయే దశలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. నదులు,చెరువులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అని సూచించారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఇంకా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. కావున రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు అని భాగ్యరాజ్ తెలిపారు.

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T131444.482.wav?_=8

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

పరకాల ఏసీపీ సతీష్ బాబు

పరకాల నేటిధాత్రి

 

గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నతరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు డివిజన్ ప్రజలను కోరారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పోల్స్,ట్రాన్స్ఫర్మర్స్ లను ఎవరు తాకరాధని,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లోనివారు అప్రమత్తంగా ఉండాలి,వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా వేరే చోట ఉండాలని కోరారు.చెరువులు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున,చేపలు పట్టడానికి చెరువుల వద్దకు ఎవరు వెల్లవద్దని రోడ్లపై వరద వచ్చినపుడు వాహనధారులు అట్టి వాహనాలను రోడ్లపై దాటుటకు ప్రయత్నించకూడదని,అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకుడదని ఎటువంటి ఇబ్బందీ కలిగిన పోలీస్ వారికి డయల్100 ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సబ్ -ఇన్స్పెక్టర్ ఝరాసంగం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T124209.857.wav?_=9

 

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా

ఉండాలి సబ్ -ఇన్స్పెక్టర్ ఝరాసంగం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల్ సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని అన్నారు. నీళ్ళలో ఉన్న కరెంట్ పోల్స్ దగ్గర నుండి వెళ్లారాదని పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయాలలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని ఝరాసంగం మండలం పరిసర ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T121259.569.wav?_=10

 

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం బిఆర్ఎస్ పార్టీ మెదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్,ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ బోర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంటు స్తంభాలను తాకరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గణేష్ మంటపాల వద్ద కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T120501.725.wav?_=11

 

నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు.
ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version