సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి..

సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు
ఆకుల సుభాష్ ముదిరాజ్.

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం రాష్ట్రము అంతటా చెరువులు కుంటలు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ లు నిండు కుండల ఉండి మత్తళ్ళు దునుకుతుంటే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేప పిల్లలు రాక చేపల వృత్తే జీవనధారంగా కొన్ని లక్షల మంది మత్స్య కారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎన్నికలముందు వారు ఇచ్చిన హామీలు నమ్మి ప్రతి మత్స్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని ఒక్కవైపుగా మద్దతూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయినా మాట అందరికి తెలిసిందే. కానీ గత సంవత్సరం అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసి రకం చేప పిల్లలు పోయాడంతో పాటు కేటాయించిన చేప పిల్లలు పోయాక దొంగ లెక్కలు చూపి మత్స్యకారులను దగాచేసినారు ఈ సంవత్సరం జులై మాసం లొ పొసే సబ్సిడీ పిల్లలు సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికి ప్రభుత్వం ఇవ్వకపోవడం మత్స్యకారులు ప్రభుత్వం పై కన్నెర్ర చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జీవనధారం కోల్పోయిన మత్స్య కారులకు. భృతి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా…

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈరోజు గురువారం గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో
రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చర్ల పల్లి చింతల నుండి లద్దబండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.

జాతీయ మెగా లోక్ అదాలత్…

జాతీయ మెగా లోక్ అదాలత్

గణపురం సిఐ కరుణాకర్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ,పరిధిలోని ప్రజలకు తెలియ జేయునది ఏమనగా గొడవలు వద్దు-రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి.ఒక వేల ఇంతటితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు కోండి వివాదాలు కావాలా.? రాజీలు కావాలా.? తేదీ. 13-09-2025 వ తారీఖు కోర్టులో “జాతీయ మెగా లోక్ అదాలత్” ఉంది కాబట్టి.మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడును…1. యాక్సిడెంట్ కేసులు, 2. కొట్టుకున్న కేసులు,3. చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు, 4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్నచిన్న దొంగ తనం కేసులు,6,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవి.ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.

13 సెప్టెంబర్ జాతీయ మెగా లోక్ అదాలత్…

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలం గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ,పరిధిలోని ప్రజలకు తెలియ జేయునది ఏమనగా గొడవలు వద్దు-రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి.ఒక వేల ఇంతటితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు కోండి వివాదాలు కావాలా.? రాజీలు కావాలా.? తేదీ. 13-09-2025 వ తారీఖు కోర్టులో “జాతీయ మెగా లోక్ అదాలత్” ఉంది కాబట్టి.మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడును.1. యాక్సిడెంట్ కేసులు, 2. కొట్టుకున్న కేసులు,3. చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు, 4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్నచిన్న దొంగ తనం కేసులు,6,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవి.ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్…

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తి అరెస్ట్

తనపై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు

20 కి పైగా కేసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలింపు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించునారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ సంపత్ రావు, డీఎస్పీ భూపాల పల్లి గార్ల ఆదేశాల మేరకు, గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు పలు దొంగతనం కేసులలో నిందితుడయిన దురిశెట్టి నిరంజన్ తండ్రి. శంకర్ వయస్సు 28 సంవత్సరాలు కులం పెరుక వృత్తి హోటల్ వ్యాపారం నివాసం జంగేడు గ్రామం భూపాలపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను అతనిపై తేది 08.09.2025 నాడు ప్రివెంటివ్ డిటెన్షన్ ( డిపి) చట్టం అమలు చేశారు.
ఆయన పై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసుల నమోదు అయినాయి. ఒక్క భూపాలపల్లి జిల్లా లోనే దాదాపు 20 కి పైగా కేసులు నమోదు అయినాయి, పై వ్యక్తి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. పోలీసుల హెచ్చరికలు చేసినప్పటికీ తన దుర్వినయాన్ని కొనసాగించాడు.
జిల్లా పోలీసులు ఆయనపై ఉన్న రికార్డులు నేరప్రవర్తనను సమగ్రంగా పరిశీలించి ప్రజా శాంతి పరిరక్షణ కోసం ప్రివెంటివ్ డిటెన్షన్ (డిపి) చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చర్లపల్లి జైలు లో నిర్బంధించారు.జిల్లా ప్రజలకు శాంతి భద్రత కల్పించడం మా బాధ్యత. ఇటువంటి అలవాటు పడిన నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ సంపత్ రావు డి.ఎస్.పి గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం

ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోని ధర్మారావుపేటలొ ఆదివారం చంద్రగ్రహణం కారణగా ఆలయాల మూసిన సందర్బంగా తిరిగి సోమవారం శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాలు శుద్ధి కార్యక్రమం.

 

దేవత మూర్తులను గ్రామ దేవతలకు పవిత్ర గంగా నది జలలతో స్నానాలు జరిపించడం జరిగిందని అర్చకులు రాజేందర్ సంప్రోక్షణ చేసి దూప దీప నైవేద్యలతో యధావిధిగా పూజ కార్యక్రమాలు పునః ప్రారంభం చేశారని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు..ఈ కార్యక్రమంలొ సమితి సభ్యులు వాల నర్సింగరావు దూలం శంకర్ ఆకుల దామోదర్ బెతి రవీందర్ రెడ్డి గందే ప్రకాష్ సింగం రాజవిరు ఎల్లంకి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం…

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ

 

 

 

బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

గడప సముద్రం లో గణేశుల నిమజ్జనం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-66-1.wav?_=1

గడప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.

Gadapa Samudram.

ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T125952.524.wav?_=2

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి
చెందిన దేసు ప్రదీప్ వారి సతీమణి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరమశించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే వెంట జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ మండల నాయకులు నేరెళ్ల రాజు యువజన నాయకులు కార్తీక్ కార్యకర్తలు ఉన్నారు

ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.

ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో “మా ఊరి సంత” పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షేడ్లు, మూత్రశాలలను గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విధితమే.
ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం మండల కేంద్రానికి చేరుకొని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు, అలాగే వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముకునే వారికి సౌకర్యవంతంగా ఉండేలా షెడ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎటువంటి ముందస్తు నోటీసులు,పర్మిషన్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదని,ప్రజల ఆస్తిని కూల్చివేసిన వారి పై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్, ఐలోని రామచంద్ర రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి,గంజి జనయ, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,మామిండ్ల సాంబయ్య,రాజిరెడ్డి,మల్లారెడ్డి,జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటుగౌడ్ ,వాజిద్ ,సింహాచలం ,కొమురయ్య,శ్రీనివాస్,యాకయ్య,రఘు,తదితరులు ఉన్నారు

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు…

భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతంలో నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చిందని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీ బృందానికి పక్కనే ఉన్న కాలువ లో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు ముందుకు వెళ్లకుండా కాలనీలోకి రావడం జరిగిందని గమనించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో సంప్రదించడం జరిగింది వెంటనే స్పందించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఇ ఏఈ ప్రాంతాన్ని సందర్శించి త్వరలోనే తగు చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతులు సిరిగనేని బాబురావు మోటపోతుల చందర్ గౌడ్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బిజెపి బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ కాలనీవాసులు ఉన్నారు

సీఐ ని కలిసి శుభకాంక్షలు తెలిపిన బి ఆర్ఎస్ నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-84-2.wav?_=3

 

సీఐ ని కలిసి శుభకాంక్షలు తెలిపిన బి ఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం నూతన సర్కిల్ ఏర్పడి మెదటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు ని నేడు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు కలిసి శుభకాంక్షలు తెలిపారు. సి ఐ ని కలిసిన వారిలో మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు, సొసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ లు నడిపెల్లి మధుసూదన్ రావు, తోట మానస శ్రీనివాస్, పెంచాల రవీందర్, కట్ల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, నాయకులు గంజి జన్నయ్య, బైరగాని కుమారస్వామి, ఆరే సాంబరెడ్డి, రాందాస్ రాజు, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, ఉడుత సాంబయ్య, పిరాల దేవేందర్ రావు, పిన్నింటి శ్రీనివాసరావు, మామిండ్ల సాంబయ్య, చీటీ శంకర్ .అంజద్, గాజర్ల చింటూ తదితరులు ఉన్నారు

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T153118.778-1.wav?_=4

 

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

యూరియా లేక రైతుల ఇబ్బందులు

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఘనపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం విషయంలో మాట తప్పిందని కనీసం రైతులకు యూరియా అందించలేని దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని లేనిపక్షంలో రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ధర్నా చేస్తామని అన్నారు
కార్యక్రమంలో వారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు తోట మానస శ్రీనివాస్, పెంచల రవీందర్, నాయకులు బైరగాని కుమారస్వామి, ఉడుత సాంబయ్య, పేరాల దేవేందర్ రావు, మామిండ్ల సాంబయ్య, గాజర్ల చింటూ, వాజిద్, తదితరులు ఉన్నారు

ముందస్తు బిజెపి నాయకుల అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T161436.372.wav?_=5

ముందస్తు బిజెపి నాయకుల అరెస్ట్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అర్ధరాత్రి అరెస్టులుబీజేపీ పోరాటాన్ని అణగదీయలేరుభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు రేపు నిర్వహించబోతున్న
చలో సెక్రటేరియట్ కార్యక్రమం సందర్భంగా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తూ ముందస్తు అరెస్ట్ చేశారుబిజెపి గణపురం మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్,బిజెపి గణపురం మండల ఉపాధ్యక్షుడు మాధాసు మొగిలి నీ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తీసుకువెళ్ళడం జరిగింది.
ఈ అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాపాలనకు నిదర్శనం.
ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా, బీజేపీ నాయకులు వెనక్కి తగ్గరు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు మా పోరాటం ఆగదు.
పోరాటమే మా శక్తి ప్రజలే మా బలం.

సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ధర్మ సమాజ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T155236.360-1.wav?_=6

 

సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ధర్మ సమాజ పార్టీ

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

 

 

గణపురం మండల కేంద్రంలో నూతనంగా మూడు మండలాలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ కర్ణాకర్ రావు ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చా నీ అందించి, శాలువాతో సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ,గాంధీ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంజపెల్లి విక్రమ్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ ,ఖండే సదయ్య తదితరులు పాల్గొన్నారు

లక్ష్మారెడ్డి పల్లిలో ఉచిత వైద్య శిబిరం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-2.wav?_=7

లక్ష్మారెడ్డి పల్లిలో వైద్య శిబిరం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో గురువారం చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి శ్రీదేవి ఆదేశాల మేరకు లక్ష్మి రెడ్డి పల్లి సబ్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా గ్రామస్థులకు బీపీ, షుగర్, థైరాయిడ్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ,రక్త పరీక్షలు నిర్వహించి మందులు అంద చేశారు.
ఈ శిబిరంలో సూపర్వైజర్ కృష్ణవేణి,విజయలక్ష్మి,ఏఎన్ఎం పార్వతి,ఆశా వర్కర్లు జెమున,విమల,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

వధూవరులను ఆశీర్వదించిన కరుణాకర్ రెడ్డి…

వధూవరులను ఆశీర్వదించిన కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రానికి చెందిన కత్తి నవీన్ గౌడ్ వెడ్స్ శైలజ రిసెప్షన్ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, హజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్, కార్తీక్ గౌడ్ ఎండి వాజిత్, తదితరులు పాల్గొన్నారు.

గణపురం సీఐని కలిసిన బీజేపీ నేతలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-62-2.wav?_=8

 

గణపురం సీఐని కలిసిన బీజేపీ నేతలు

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రావును బుధవారం మండల బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్నం చందర్, మహిళా నాయకురాలు బొల్లం అరుణ, మండల ప్రధాన కార్యదర్శి చెలమల ప్రవీణ్, కోశాధికారి వడ్డెం రాజశేఖర్, బిల్లా దేవేందర్, రేపాక సంతోష్, భూక్యా హరిలాల్, దూడపాక సతీష్, సందీప్, దూడపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T152429.801-1.wav?_=9

 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జయంతి

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్,
మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున గౌడ్,
గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ,
మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, గుర్రం సదానందం యువజన నాయకులు దూడపాక పున్నం, సీనియర్ నాయకులు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, రామగిరి సంపత్, సుధాకర్ రెడ్డి, ఆలూరి మొగిలయ్య, ఎస్ కే జానీ. మోషే. గణేష్. తదితరులు పాల్గొన్నారు

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T143106.483-1.wav?_=10

 

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొరంచ వెంబడి నీట మునిగిన వరి పొలాలను అంచనవేసి రైతులకు నష్టపరిహారం అందించాలని గణపురం మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని పొలాల్లో ఇసుక దిబ్బలు పెరికపోయాయని, పత్తి పంట నష్టం జరిగిందని పంట నష్టం విషయంలో ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేక వర్షాల కారణంగా దోమల నివారణలో జాప్యం జరుగుతుందని అధికారులు వెంటనేc స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version