బాల్య వివాహాలు జరుగకుండా అడ్డుకోవాలి కలెక్టర్…

బాల్య వివాహాలు జరుగకుండా అడ్డుకోవాలి కలెక్టర్

100 ఫిర్యాదు చేయాలి ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి .

 

బాల్యా వివాహాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.శుక్రవారం ఐ.డి. ఒ .సి ఆవరణలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గ్రామీణ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన ప్రచార వాహనానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు వనపర్తి, మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలలో ఒక్కో జిల్లాలో 10 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలు,చట్ట ప్రకారం పడే శిక్షల పై విస్తృత ప్రచారం చేయనున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదాలు ఉంటాయన్నారు. పుట్టబోయే పిల్లలు శారీరక ఎదుగుదల లేకపోవడం తల్లి బిడ్డలు అనేక రోగాల బారిన పడి జీవితాలు నాశనం అయిపోతాయని తెలిపారు.బాల్య వివాహాలు చేసే వారి పై ఎలాంటి జాలి లేకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు వేయడం జెరుతుందని అన్నారు
ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 100..112 నెంబరు కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు బాల్య వివాహం చేసే తల్లిదండ్రులతో పాటు పెళ్లి తంతులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, పెళ్ళికి వెళ్ళే బంధు మిత్రుల పై సైతం కేసులు పెట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని చెప్పారు. అనంతరం బాల్య వివాహాలు అరికట్టేందుకు రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. సంతకాల సేకరణలో భాగంగ ప్లెక్సీ పై సంతకాలు చేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఎస్ కోఆర్డినేటర్ చిన్నమ్మ థామస్, ప్రోగ్రాం ఆఫీసర్ చూచేత, సహాయ ప్రోగ్రాం ఆఫీసర్ జూవెద్ ఖురేషి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి డి సి పి ఓ రాంబాబు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు

ప్రజావాణిలో ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ…

ప్రజావాణిలో ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
వనపర్తి నేటిధాత్రి .

సోమవారం ప్రజావాణిలో వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు
ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి వెంటనే పరిష్కారం చూపడమే పోలీసుశాఖ బాధ్యత అని ఎస్పీ తెలిపారు పోలీసు
ప్రజావాణి లో ప్రజలు తెలు పాలని పోలీసు ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఒక ప్రకటన లో తెలిపారు . బాధితులకు న్యాయం జరిగే విధంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ పని చేస్తుందని ప్రజలు పోలీసుశాఖపై నమ్మకం ఉంచి, సమస్యల పరిష్కారానికి పోలీస్ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమనిజిల్లా ఎస్పీ పేర్కొన్నారు

ముగ్గుల పోటీల్లో మహిళల సృజనాత్మకత

ముగ్గులు వేయడం మహిళల సృజనాత్మకతకు నిదర్శనం

విజేతలకు బహుమతులు అందజేసేన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

ముగ్గులు భారతీయ మహిళల హస్తకళా నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. మకర
సంక్రాంతి సందర్భంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీని ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఏ ఆర్, అదనపు ఎస్పీ,వీరా రెడ్డి, వనపర్తి డి ఎస్పీ, వెంకటేశ్వరావు, డిసిఆర్బి డిఎస్పి,బాలాజీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, మహిళ ఎస్సైలు, మహిళ, కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు

నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జారిమాన జిల్లా ఎస్పీ ఆదేశాలు ట్రాఫిక్ ఎస్సై…

నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జారిమాన జిల్లా ఎస్పీ ఆదేశాలు ట్రాఫిక్ ఎస్సై
సురేందర్
వనపర్తి నేటిదాత్రి .

 

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి ట్రాఫిక్ ఎస్సై, సురేందర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీ లు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో వనపర్తి లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కఠిన చర్యలు చేపట్టారు.
40 నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి, వాహనాల యజమానులకు కౌన్సిలింగ్‌ ఇచ్చామని జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై నరేంద ర్ ఒక ప్రకటన లో తెలిపారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్డు ప్రమాదాలకు మాత్రమే కాకుండా చైన్ స్నాచింగ్, దొంగతనాలు నేరాలకు జెరగకుండా ప్రజలు సహకరించాలని ట్రాఫిక్.ఎస్సై విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా కమాన్ కొత్త బస్టాండు నవత ట్రాన్స్ పోర్టు గాంధీ విగ్రహం పాత బస్టాండు దగ్గర పాన్ గల్ రోడ్డులో రోడ్లపై లారీలు భారీ వాహనాలు అపరాదని ఆపినచో జరిమానాలు విడిస్తామని ట్రాఫిక్ ఎస్సై తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version