పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు…

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర,విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని,అంతే కాకుండా రామగుండం పోలీస్ కమీషనరేట్ స్థాయిలో 1వ, 2వ,3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడుతాయి అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.పోటీలో పాల్గొనే విధానం కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
మీ పేరు,విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయండి.వ్యాసాన్ని పేపర్‌ పై రాసి,దానిని చిత్రం (ఇమేజ్) లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌ లో 500 పదాలు మించకుండా అప్‌ లోడ్ చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు.

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ….

దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన ఎస్ఐ

◆:- ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం – పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం చీకటిమయం అవుతుందిఅని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి – మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ముందస్తుగా మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ . దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ప్రజలను కోరారు.

చిట్యాల కళాశాలలో బేటి బచావో బేటి పడావో అవగాహన…

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు భేటీ బచావో బేటి పడావో పై అవగాహన కార్యక్రమం.

చిట్యాల ,నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో డ్రగ్స్ పై మరియు బాల్య వివాహాల పైన బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించినారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినిలు బాల్యవివాహాలను చేసుకోవద్దని బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని అమ్మాయిల పైన వివక్షత చూపిస్తున్నారని కాబట్టి అమ్మాయిలు బాగా చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని వారికి ఈ సమాజంలో ఎన్నో రక్షణ చట్టాలు వచ్చాయని వాటిని ఉపయోగించుకోవాలన్నారు అలాగే ఏదైనా సమస్య వస్తే 1098కి ఫోన్ చేసి తెలపాలన్నారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్ యుగంధర్ కళావతి అనూష మమత మరియు అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version